.

కల్మషహారాలు

డిటర్జెంట్ అనునది ఒక సర్ఫెక్టెంట్ (తలతన్యతను తగ్గించు గుణం గల వస్తువు) లేక " విలీన ద్రావణాలలో శుభ్రపరచు లక్షణాలు" గల సర్ఫెక్టెంట్ యొక్క మిశ్రమం అని నిర్వచించవచ్చు.[1] ఇవి సాధారణంగా సబ్బును పోలిన సమ్మేళనాల కుటుంబానికి చెందినవి కానీ ఘన నీటిలో ఎక్కువ కరిగే గుణం కలిగి వుంటాయి . ఇవి ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స . ఘన నీటిలో వుండు కాల్షియం, ఇతర పరమాణువుల సమూహముతో జత కూడుటకు సబ్బు యొక్క ధ్రువ కార్భోక్సైల్కు డిటర్జెంట్ల యొక్క ధ్రువ సల్ఫోనేట్ తో పోల్చి చూస్తే సబ్బుతో ఆ రసాయనిక చర్య జరుగుటకు అవకాశం చాలా తక్కువ ఇదే నీటిలో సబ్బు యొక్క కనిష్ఠ ద్రవానియతకు కారణము. మన సాదారణ పరిభాషలో డిటర్జెంట్ అనునది లాండ్రీ డిటర్జెంట్ ను ( బట్టలు ఉతికే సోడా) లేక డిష్ డిటర్జెంట్ ను ( అంట్లు కడిగే పొడి ) సూచిస్తుంది. సాధారణంగా డిటర్జెంట్స పొడులు లేదా కేంద్రీకరించిన ద్రవనాల రూపంలో అందుబాటులో వుంటాయి .డిటర్జెంట్లు అనునవి పాక్షికంగా హైడ్రోఫిలిక్ (ధ్రువ ), పాక్షికంగా హైడ్రోఫోబిక్ స్వభావము కల్గి వుండడం వల్ల అవి సబ్బు లాగా కూడా పని చేస్తాయి.అవి అంపిబిలిక్ స్వభావముతో వుంటాయి. చమురు, జిడ్డు వంటి హైడ్రోఫోబిక్ సమ్మేళనాలు నీటితో సౌకర్యవంతంగా మిశ్రమించడానికి వాటికి వున్న ఆ ద్వంద్వ స్వభావమే మూల కారణము.

కల్మషహారాలు-రసాయనిక వర్గీకరణ

మార్చు

కల్మషహారాలు తమ విద్యుత్ ఆవేశము బట్టి మూడు విస్తృత బృందాలుగా విభజించారు .

రుణావేశ కల్మషహారాలు

మార్చు

సాధారణ రుణవేశ కల్మషహారాలు ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స అయి ఉంటాయి. ఈ రుణవేశ అణువులలో వున్న అల్కైల్ బెంజీన్ భాగం లైపోఫిలిక, సల్ఫోనేట్ భాగం హైడ్రోఫిలిక్ అయి వుంటుంది.ఇందులో రెండు విభిన్న రకాలు ప్రాచుర్యం పొందాయి.[2] అవి సరళ ఆల్కైల్ సమూహాలతో వున్నవి, సారించిన ఆల్కైల్ సమూహాలతో ఉన్నాయి. ఆర్థికంగా పురోగమిస్తున్న సమాజాలలో రెండవ వర్గానివి తొలగించబడ్డాయి, అందుకు కారణము అవి చాలా పేలవంగా జీవఅధోకరణం చెందడమే. ఒక అంచనా ప్రకారం ఏటా 6 బిలియన్ కిలోల రుణవేశ కల్మషహారాలను దేశీయ విపణిలో ఉత్పత్తి చేస్తారు .

పిత్త ఆమ్లాలైన డీఆక్సీకొలీక్ ఆమ్లములు జీర్ణం కొరకు, అలాగే కొవ్వుల, నూనెల శోషణ నిమిత్తం కాలేయం ద్వారా ఉత్పత్తి చేయబడు ఇవి రుణవేశ కల్మషహారాలు అయి ఉన్నాయి.

 
right మూడు రకాల రుణావేశ కల్మషహారాలు:గొలుసుకట్టు ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స, సరళ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనేట్స, సబ్బు .

ధనావేశ కల్మషరాలు

మార్చు

ధనావేశ కల్మషహారాలు దాదాపుగా రుణవేశ కల్మషహారాల లాగే వుంటాయి . కానీ ఇవి రుణవేశ సల్ఫోనేట్ గుంపుకు బదులు హైడ్రోఫోబిక్ భాగం కల్గి వుంటాయి . ధనావేశ సర్ఫక్తెంట్ (తలతన్యతను తగ్గించు గుణం గల వస్తువు) లు చతుర్ధ అమ్మోనియం లవణములను కల్గి వుంటాయి . ఇక్కడ అమ్మోనియం గుంపు పైన ధనావేశము వుంటుంది.[2]

ఆయానేతర - కల్మషహారాలు

మార్చు

వీటిని ఎటువంటి ఆవేశము లేని హైడ్రోఫిలిక్ గుంపులతో వర్ణించవచ్చు . సాధారణంగా ఈ ఆయానేతర కల్మషహారాలు పాలిఒక్సీఇతీలీన్ లేదా గ్లైకోసైడ్ పైన ఆధారపడి ఉంటాయి. ఈ పదార్థాలను ఈతాక్సీలేట్లు అయి వుంటాయి . ట్వీన్, ట్రిటోన్,, బ్రిజ్ సరీ పైన పేర్కొన్న వాటికి సాధారణ ఉదాహరణలు. గ్లైకోసైడ్స్ వాటి ఆవేశేము లేని హైడ్రోఫిలిక్ గుంపుగా ఒక చక్కెరను కల్గి వుంటాయి. ఉదాహరణలుగా తియొగ్లుకొసైడ్, మల్టోసైడ్స్ను పేర్కొనవచ్చు. HEGA, MEGA వరుసకు చెందినవి వీటిని పోలి వుంటాయి.

జ్విట్టర్ అణువులు సమానమైన రుణవేశము, ధవేశములను కల్గి వున్న రాసాయన సమూహముల వలన నికరంగా సున్నా ఆవేశము కల్గి వుంటాయి.


చరిత్ర

మార్చు

మొదటి ప్రపంచ యుద్ధములో కొవ్వులు, నూనెల కొరతను అదిగమించడానికి మొదటి సారిగా జర్మనీలో కృత్రిమ కల్మషహారాలను వుత్పత్తి చేశారు.[3][4]

కల్మషహారాలు -ప్రాధాన్యాలు

మార్చు

లాండ్రీ కల్మషహారాలు

మార్చు

కల్మషహారాలను ముఖ్యంగా ఉపయోగించేది బట్టలు వుతుకటకు. వీటికి వున్న విభిన్న లేక బహుళఉపయోగార్థముగా వుండుటకు అలాగే పోటీతో కూడకున్న వినియోగదారుడి విపణి కోసం వీటి సూత్రీకరణలు చాలా క్లిష్టంగా వుంటాయి .సాధారణంగా లాండ్రీ కల్మషరాలు నీటి సున్నితత్వపూ రసాయనాలు, బ్లీచ్, ఎంజైములు,, పరిమళాలు,, అనేక ఇతర సాధనములను కల్గి వుంటాయి. వీటి సూత్రీకరణ వస్త్రములను శుభ్రము చేయు మంచి నీటి ఉష్ణోగ్రత మీద ఆధారపడి వుంటుంది . అలాగే ఈ సూత్రీకరణ ప్రదేశము మీద ఆధారపడి వుంటుంది.

జీవ పదార్థములు

మార్చు

వీటిని ముఖ్యంగా జీవ కణములలో అంతర్గత ప్రోటీన్లను విబాగించుటకు, శుద్ధీకరణ కొరకు ఉపయోగిస్తారు. దీని కోసం అంతర్గతంగ వున్న పల్చటి ఏక పొరలోకి చొచ్చుకెళ్లగల కల్మశహారాము కావాలి .శుద్ధీకరణలో అదునాతన సాకేంతిక పురోగతులు ముఖ్యమైన జీవ ప్రోటీన్ల యొక్క నిర్మాణ, జీవభౌతిక వర్గీకరణకు వెసులుబాటు కల్పిస్తుంది.ఇటువంటి అణువులు అంతర్గత పొరలను బంగపరుస్తాయి. వీటికి వుదాహరణలుగా వాహకాలను గ్రాహకాలను పేర్కొనవచ్చు.

ఇంధన సంకలితాలు

మార్చు

ఒట్టో ఇంజిన్ల యొక్క కార్బ్యురేటర్లు, ఇంధన గొట్టముల ద్వారా దుర్గందము రాకుండా ఈ కల్మషహారాలను విరివిగా ఉపయోగిస్తాయి . వీటి కేంద్రీకరణ గురించి దాదాపుగా 300 పి‌పిఎమ్ గా వుంటుంది . సాధారణ డిటర్జెంట్లు దీర్ఘ శృంఖల అమైన్లు, పాలిఐసొబ్యుటేనమైన్లు, పాలిఐసొబ్యుటేనమైడ్లు అయి వుంటాయి.[5]

సబ్బు లేని సబ్బు

మార్చు

ఇది సబ్బు లేని ద్రవ ప్రక్షాళనకు వుపయోగపడుతుంది. PH (10) తో కొద్దిగా ఆమ్లా స్వభావము కలిగి వుంటుంది. వీటిని ఏదిని ఉత్పత్తుల మధ్య వుంచుతారు.

మూలాలు

మార్చు
  1. "IUPAC Gold Book - detergent". Goldbook.iupac.org. 2012-08-19. Retrieved 2013-01-12.
  2. 2.0 2.1 Eduard Smulders, Wolfgang Rybinski, Eric Sung, Wilfried Rähse, Josef Steber, Frederike Wiebel, Anette Nordskog, "Laundry Detergents" in Ullmann’s Encyclopedia of Industrial Chemistry 2002, Wiley-VCH, Weinheim. doi:10.1002/14356007.a08_315.pub2
  3. "Soaps & Detergent: History (1900s to Now)". American Cleaning Institute. Retrieved on 6th January 2015
  4. David O. Whitten; Bessie Emrick Whitten (1 January 1997). Handbook of American Business History: Extractives, manufacturing, and services. Greenwood Publishing Group. p. 221. ISBN 978-0-313-25199-3.
  5. Werner Dabelstein, Arno Reglitzky, Andrea Schütze, Klaus Reders "Automotive Fuels" in Ullmann’s Encyclopedia of Industrial Chemistry 2002, Wiley-VCH, Weinheimdoi:10.1002/14356007.a16_719.pub2

ఇతర లింకులు

మార్చు