కల్లూరు (కర్నూలు జిల్లా)
కల్లూరు, భారతదేశం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న కర్నూలు నగరపాలక సంస్థలో భాగంగా ఉన్న ఒక పట్టణ ప్రాంతం. కర్నూలు నగరం పశ్చిమ భాగాన్ని కల్లూరు అంటారు.ఇది కల్లూరు మండల పరిధిలోని పట్టణ ప్రాంతం.[1] కర్నూలు నగరంలోని బళ్లారి చౌరాస్తా, చెన్నమ్మ సర్కిల్, బిర్లా కాంపౌండ్, ఎపిఎస్ఆర్టీసీ మెయిన్ బస్ స్టాండ్ ఇంకా మరికొన్ని ప్రధాన ప్రాంతాలు కల్లూరు పరిధిలోకి వస్తాయి. ఇది నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం లోని 256 పాణ్యం శాసనసభ నియోజకవర్గం పరిధిలోఉంది.
Kallur | |
---|---|
Nickname: Kallur | |
Coordinates: 15°50′04″N 78°01′45″E / 15.83444°N 78.02917°E | |
Country | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | Kurnool |
Boroughs | Kurnool |
Government | |
• Type | Municipal Corporation |
• Body | Kurnool Municipal Corporation |
భాషలు | |
• అధికార | Telugu |
Time zone | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 518003 |
కర్నూలు నగరపాలక సంస్థలో విలీనం
మార్చు2002 లో కర్నూలు నగరపాలక సంస్థలో కల్లూరు పట్టణ ప్రాంతంగా విలీనం చేయబడింది.కల్లూరు పారిశ్రామికంగా బాగా అభివృద్ధి చెందింది. కల్లూరులోని పారిశ్రామిక ప్రాంతాన్ని కల్లూర్ ఎస్టేట్ అంటారు.
గ్రామ జనాభా
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం ఇది కల్లూరు మండల పరిధిలో ఉంది.కల్లూరు జనాభా, మండలం జనాభా 1,44.798 క్రింద వస్తుంది. దీనిలో 196.268 మొత్తం జనాభా ఉంది కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్, మిగిలిన 51.470 గ్రామీణ ప్రాంతం వస్తుంది.కల్లూరు పట్టణ ఏరియాలో లింగ నిష్పత్తి 996. కల్లూరు గ్రామీణ ప్రాంతంలో లింగ నిష్పత్తి 980.
మూలాలు
మార్చు- ↑ "Mandal wise villages" (PDF). Revenue Department - AP Land. National Informatics Center. p. 5. Archived from the original (PDF) on 9 December 2014. Retrieved 20 November 2014.