కల్వల సదానందరావు

కల్వల సదానందరావు, తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు. తెలంగాణ రైతుసంఘం జిల్లా గౌరవాధ్యక్షుడిగా కూడా పనిచేశాడు. 1969లో తెలంగాణ ప్రజా సమితి నాయకునిగా తెలంగాణ కోసం పోరాటంచేసి నెలరోజులపాటు నల్గొండలో జైలుశిక్షను అనుభవించాడు.[1]

కల్వల సదానందరావు
కల్వల సదానందరావు
జననం
కల్వల సదానందరావు

మరణం2022, అక్టోబరు 18
వృత్తిఉపాధ్యాయుడు
సుపరిచితుడు/
సుపరిచితురాలు
తెలంగాణా పోరాట యోధుడు
పిల్లలుఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు

సదానందరావు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు పట్టణంలో జన్మించాడు. ఇతని సోదరుడు కల్వల ప్రభాకర్ రావు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు.

ఉద్యోగం

మార్చు

ఉపాధ్యాయునిగా తన వృత్తిజీవితాన్ని ప్రారంభించి, 1962లో ఉపాధ్యాయ వృత్తికి రాజీనామా చేశాడు.

ఉద్యమ జీవితం

మార్చు

1962లో మోత్కూరు గ్రామపంచాయతీకి వార్డుమెంబర్ గెలుపొందాడు. అడ్డగూడూరు సమీపంలోని మూలరేగడి (ప్రస్తుతం గోవిందాపురం) భూపోరాటంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పాల్గొన్నాడు. గ్రామపెద్దగా ఆ ప్రాంతంలో జరిగే వివాదాలను, పంచాయతీలను పరిష్కరించడంలో పేరుగడించాడు. పోచంపాడు నదీజలాల కోసం, భీమలింగంకాల్వ కోసం, 1982లో మోత్కూరు ప్రాంతంలో కరెంటు లోఓల్టేజి సమస్యపై, సాగునీటి కోసం నిర్వహించిన ఉద్యమాల్లో పాల్గొన్నాడు. కాంగ్రెస్ పార్టీలో సభ్యునిగా ఉంటూ ఉప్పునూతల పురుషోత్తంరెడ్డికి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించాడు. 1990లో రైతుసంఘం సమన్వయకమిటీ రాష్ట్ర సభ్యునిగా ఔరంగాబాద్ లో, హైదరాబాద్ లో జరిగిన అఖిలభారత రైతుమహాసభలలో, వరంగల్లో జరిగిన రాష్ట్ర మహాసభలలో పలు తీర్మాణాలను సదానందరావు ప్రవేశపెట్టాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పాటయిన తరువాత తెలంగాణ రైతుసంఘం గౌరవాధ్యక్షునిగా బునాదిగాని కాల్వ కోసం, గంధమల్ల బస్వాపురం రిజర్వాయర్ల కోసం అనేక సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి రైతుసమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో కృషి చేశాడు.[1]

సదానందరావు హైదరాబాదులోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ 2022, అక్టోబరు 18న గుండెపోటుతో మరణించాడు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.[2]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "తొలి తెలంగాణ పోరాట యోధుడు సదానందరావు మృతి". EENADU. 2022-10-20. Archived from the original on 2022-10-20. Retrieved 2022-10-20.
  2. రాష్ట్ర రైతుసంఘం నాయకుడు సదానందరావు మృతి, అంధ్రప్రభ, యాదాద్రి భువనగిరి జిల్లా ఎడిషన్, 2022 అక్టోబరు 20.