కళ్యాణం కమనీయం

కళ్యాణం కమనీయం 2023లో తెలుగులో విడుదలయిన సినిమా. యువీ కాన్సెప్ట్‌ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు అనిల్‌ కుమార్‌ ఆళ్ల దర్శకత్వం వహించాడు. సంతోష్‌ శోభన్‌, ప్రియ భవాని శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను 2023 జనవరి 5న విడుదల చేయగా[2], సినిమా జనవరి 14న విడుదలైంది.[3]

కళ్యాణం కమనీయం
Kalyanam Kamaneeyam.jpg
దర్శకత్వంఅనిల్‌ కుమార్‌ ఆళ్ల
నిర్మాతయువీ కాన్సెప్ట్‌
నటవర్గంసంతోష్‌ శోభన్‌
ప్రియ భవాని శంకర్
దేవీ ప్రసాద్
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
సంగీతంశ్రావణ్ భరద్వాజ్‌
నిర్మాణ
సంస్థ
యువీ కాన్సెప్ట్‌
విడుదల తేదీలు
2023 జనవరి 14 (2023-01-14)(థియేటర్)
2023 ఫిబ్రవరి 9 (2023-02-09)( ఆహా ఓటీటీలో)[1]
దేశం భారతదేశం
భాషతెలుగు

కథసవరించు

శివ (సంతోష్ శోభన్) బీటెక్ పూర్తి చేసి ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్లిన ఉద్యోగం దొరకదు. ఆ విషయం తెలిసీ శ్రుతి (ప్రియా భవానీ శంకర్) ప్రేమిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి మరీ పెళ్ళి చేసుకుంటుంది. శివకు ఉద్యోగం వచ్చే వరకు అతడి బాధ్యత తనదేనంటూ అతని అవసరాలకు డబ్బులు ఇస్తూ ఎవరినీ డబ్బులు అడగొద్దని, ఎవరి దగ్గరా చేయి చాచవద్దని చెబుతుంది. ఈ క్రమంలో శ్రుతికి ఉద్యోగం వచ్చిందని చెప్పిన శివ క్యాబ్ డ్రైవర్ గా చేస్తుంటాడు? చివరకు ఏమైంది? శివకు ఉద్యోగం దొరికిందా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]

నటీనటులుసవరించు

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: యువీ కాన్సెప్ట్‌
 • నిర్మాత: యువీ కాన్సెప్ట్‌
 • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ కుమార్‌ ఆళ్ల[9]
 • సంగీతం: శ్రావణ్ భరద్వాజ్‌
 • సినిమాటోగ్రఫీ: కార్తిక్‌ ఘట్టమనేని
 • సహ నిర్మాత: అజయ్‌ కుమార్‌ రాజు
 • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: నరసింహా రాజు

మూలాలుసవరించు

 1. Andhra Jyothy (5 February 2023). "ఈ వారమే విడుదల". Archived from the original on 5 February 2023. Retrieved 5 February 2023.
 2. Namasthe Telangana (5 January 2023). "ఎంటర్‌టైనింగ్‌గా సంతోష్‌ శోభన్ కళ్యాణం కమనీయం ట్రైలర్‌". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 3. V6 Velugu (6 January 2023). "జనవరి 14న రిలీజ్ కానున్న 'కళ్యాణం కమనీయం'". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 4. Eenadu (14 January 2023). "రివ్యూ: కళ్యాణం కమనీయం". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
 5. Eenadu (7 January 2023). "నిజాలతో నిజాయతీగా తీసిన సినిమా 'కళ్యాణం కమనీయం': శోభన్‌". Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 6. The Hindu (6 January 2023). "'Kalyanam Kamaneeyam' actor Santosh Soban: A moment of epiphany made me realise I am living my dream" (in Indian English). Archived from the original on 7 January 2023. Retrieved 7 January 2023.
 7. Namasthe Telangana (14 January 2023). "శుభారంభానిస్తుంది". Archived from the original on 15 January 2023. Retrieved 15 January 2023.
 8. Andhra Jyothy (14 January 2023). "ప్రతి ఒక్కరూ ఐడెంటిఫై చేసుకునే పాత్ర". Archived from the original on 16 January 2023. Retrieved 16 January 2023.
 9. Namasthe Telangana (10 January 2023). "మా కథ మీద నమ్మకముంది". Archived from the original on 10 January 2023. Retrieved 10 January 2023.

బయటి లింకులుసవరించు