కవి రాజమూర్తి ఖమ్మం జిల్లాకు చెందిన రచయిత. ఇతని అసలు పేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి.[1]

జీవిత విశేషాలుసవరించు

ఇతడు 1926 అక్టోబరు నెలలో ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలంలోని పిండిప్రోలులో ఉన్నత కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి వీరభద్రయ్య న్యాయవాది. ఇతని బాబాయి సర్వదేవభట్ల రామనాథం గొప్ప కమ్యూనిస్టు నాయకుడు. ఇతడు బాబాయి స్ఫూర్తితో కమ్యూనిజం వైపు మొగ్గు చూపాడు. ప్రత్యక్ష రాజకీయాలలో పాల్గొన లేదు కాని ఇతడు ఉర్దూలో అభ్యుదయ కవిత్వం చెప్పడం మొదలు పెట్టాడు. ఇతడి కవిత్వాన్ని మెచ్చి నిజాం ప్రభుత్వం ఇతనికి 19వ యేటనే ప్రజా కవిరాజు అనే బిరుదును ఇచ్చింది. నాటినుండి ఇతడు కవిరాజ మూర్తిగా స్థిరపడిపోయాడు. ఇతనికి 1942లో వరలక్ష్మితో వివాహం జరిగింది. 1946లో ఖమ్మంలో జరిగిన ఆంధ్ర మహాసభల సందర్భంలో ఇతడిని ప్రభుత్వం ఒక హత్యకేసులో ఇరికించింది. దానితో ఇతడు ఖమ్మం వదిలి హైదరాబాదుకు మకాం మార్చాడు. హైదరాబాదులో భుక్తి కోసం ఒక పుస్తకాల దుకాణం నడిపాడు. ప్రజాసాహిత్య పరిషత్తును స్థాపించాడు. కొంత కాలం నృపతుంగ హైస్కూల్లో తెలుగుపండితుడిగా ఉద్యోగం చేశాడు. తరువాత తాండూరు, పటాన్‌చెరు మొదలైన చోట్ల వివిధ పనులు చేశాడు. 1949 ప్రాంతాలలో ఇతడు ఉర్దూ భాషలో తెలంగాణ అనే పక్షపత్రికను సుమారు 6 నెలలు నడిపాడు[2]. ఇతడికి గిడుతూరి సూర్యం, బెల్లంకొండ రామదాసు, అబ్బూరి వరదరాజేశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, దేవులపల్లి రామానుజరావు మొదలైన వారితో స్నేహసంబంధాలు ఉండేవి.

నవలలుసవరించు

 1. మై గరీబ్ హూఁ
 2. మొదటి రాత్రి
 3. జారుడు బండ
 4. లహు కీ లకీర్ (ఉర్దూ)

కావ్యాలుసవరించు

 1. మహైక
 2. ప్రణుతి
 3. మానవ సంగీతం
 4. నవయుగశ్రీ (గేయాలు)
 5. అంగారే (ఉర్దూ)

నాటకంసవరించు

 1. మార్పు

మూలాలుసవరించు

 1. సంగిశెట్టి శ్రీనివాస్ (2005). తొలినాటి కతలు. హైదరాబాద్: ముదిగంటి సుజాతారెడ్డి. pp. xxxiv–xxxv. |access-date= requires |url= (help)
 2. అఫ్సర్ (2011-10-10). "తెలంగాణ సాహిత్య చరిత్రలో ఒక 'అపరిచితుడు'". ఆంధ్రజ్యోతి సాహిత్యం పేజీ వివిధ. Retrieved 4 April 2015.