గిడుతూరి సూర్యం

గిడుతూరి సూర్యం (1920-1997) రచయిత, కవి, సినిమా దర్శకుడు, నిర్మాత, స్వాతంత్ర్యసమరయోధుడు, అభ్యుదయ మానవతావాది. పశ్చిమగోదావరి జిల్లాలో జన్మించాడు. ఆకాశవాణిలో అనౌన్సరుగా పనిచేస్తూ అనేక నాటికలు, నాటకాలు, సంగీత రూపకాలు రచించాడు. ఇతను రాసిన "మానవుడు చిరంజీవి" మూకాభినయ నాటికను రష్యా సినిమా బృందం చిత్రంగా చిత్రీకరించారు. గిడుతూరి సాహితీ పేరిట నాటకాలు, నాటికలు సంపుటాలుగా వెలువరించాడు.

గిడుతూరి సూర్యం
గిడుతూరి సూర్యం
జననం1920
మరణం1997
ప్రసిద్ధిరచయిత, కవి, సినిమా దర్శకుడు, నిర్మాత

సినిమా రంగం

మార్చు

రణభేరి, ఆస్తికోసం, కథానాయకురాలు, విక్రమార్క విజయం, పేదరాశి పెద్దమ్మ కథ, అమృతకలశం,నేను – నా దేశం, పంచ కళ్యాణి దొంగల రాణి, పంజరంలో పసిపాప, సంగీత లక్ష్మి, స్వామిద్రోహులు మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు. రాజేశ్వరి చిత్రానికి అనిసెట్టి సుబ్బారావుతో కలిసి పాటలను వ్రాశాడు. పంజరంలో పసిపాప, పంచ కళ్యాణి దొంగల రాణి సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. పంచ కళ్యాణి దొంగల రాణి చిత్రాన్ని నిర్మించాడు.

మనదేశంలో దూరదర్శన్ ప్రసారాలు ప్రారంభం కానున్న తొలిరోజులలో టి.వి కోసం భారతీయ నటులతో, రష్యన్ సాంకేతిక నిపుణులతో నలుపు తెలుపుల్లో మొట్టమొదటిసారిగా ‘రామాయణం’ లఘుచిత్రాన్ని నిర్మించాడు. ఇతడు మంచి చిత్రకారుడు కూడా. 1949లో ఇతడు హైదరాబాదు కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్‌ను స్థాపించాడు. ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకునిగా కూడా కొంతకాలం పనిచేశాడు. ఇతని రచనలు సుజాత, తెలుగు స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఉదయిని, ఆనందవాణి తదితర పత్రికలలో ప్రచురితమయ్యాయి.

రచనలు

మార్చు
  1. చక్రఘోష (కావ్యం)
  2. నా విశ్వవిద్యాలయాలు (అనువాదం - మూలం:మాక్సిం గోర్కీ)
  3. అమృతమూర్తి
  4. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీవారి దివ్యసూక్తులు
  5. అమ్మా (కథ)
  6. కుమారుడి మరణం (కథ)
  7. త్యాగమూర్తి (కథ)
  8. పతిత (కథ)
  9. రజ్జు సర్ప భ్రాంతి (కథ)
  10. లోకం పోకడ (కథ)
  11. మానవుడు చిరంజీవి (మూకాభినయ నాటకము)

మూలాలు

మార్చు

బయటి లంకెలు

మార్చు