కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి
కసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1989లో రాజంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.
కసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1989 - 1994 | |||
నియోజకవర్గం | రాజంపేట నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1957 పాతూరు గ్రామం, నందలూరు మండలం, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతదేశం | ||
రాజకీయ పార్టీ | తెలుగుదేశం పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ |
జననం, విద్యాభాస్యం
మార్చుకసిరెడ్డి మదన్‌మోహన్ రెడ్డి 1957లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కడప జిల్లా, నందలూరు మండలం, పాతూరు గ్రామంలో జన్మించాడు.[1]ఆయన గుల్బర్గా లో ఎం.బి.బి.ఎస్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుకసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985లో రాజంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బండారు రత్నసభాపతి చేతిలో ఓడిపోయాడు. ఆయన 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కొండూరు ప్రభావతమ్మ పై 10510 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
కసిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి 1994లో రాజంపేట నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పసుపులేటి బ్రహ్మయ్య చేతిలో 23353 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 1999లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. మదన్‌మోహన్ రెడ్డి అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకేపాటి అమరనాథరెడ్డి చేతిలో ఓడిపోయాడు.
మూలాలు
మార్చు- ↑ Sakshi (20 March 2019). "ఒక మండలం.. ఐదుగురు ఎమ్మెల్యేలు". Archived from the original on 29 July 2021. Retrieved 29 July 2021.