కాండీ నగరం
కాండీ (సింహళం: క్యాండీMahanuwara (help·info), తమిళం: కండి, కాండీkandi (help·info)) శ్రీలంకలోని రెండవ అతిపెద్ద నగరం. ఇది కాండీ, మాతలే, నువారా ఎలియా జిల్లాలతో కూడిన శ్రీలంకలోని సెంట్రల్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక ప్రధాన నగరం. ఇది శ్రీలంకను పరిపాలించిన పురాతన రాజుల చివరి రాజధాని[1]. ఈ నగరం కాండీ పీఠభూమిలో కొండల మధ్యలో ఉంది. కాండీ నగరంలో, ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన బౌద్ధ ప్రార్థనా స్థలాలలో ఒకటైన టూత్ రెలిక్ (శ్రీ దళాద మలిగావా) ఉంది. దీనిని1988లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది[2].
కాండీ
క్యాండీ | |
---|---|
శ్రీలంకలోని నగరాలు | |
Nickname: సెంకడగల | |
Coordinates: 7°17′47″N 80°38′6″E / 7.29639°N 80.63500°E | |
దేశం | శ్రీలంక |
శ్రీలంక ప్రావిన్స్ | సెంట్రల్ ప్రావిన్స్, శ్రీలంక |
శ్రీలంక నగరాలు | కాండీ నగరం |
సెంట్రల్ ప్రావిన్స్, శ్రీలంక డివిజనల్ సెక్రటేరియట్లు | క్యాండి డివిజనల్ సెక్రటేరియట్ |
కాండీ మునిసిపల్ కౌన్సిల్ | 1865 |
Founded by | సేనసమ్మత విక్రమబాహు |
Government | |
• Type | శ్రీలంక మున్సిపల్ కౌన్సిల్ |
• Body | కాండీ మున్సిపల్ కౌన్సిల్ |
• కాండీ మేయర్ | కేసెర సేనానాయకే, యునైటెడ్ నేషనల్ పార్టీ |
విస్తీర్ణం | |
• Total | 28.53 కి.మీ2 (11.02 చ. మై) |
Elevation | 500 మీ (1,600 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,25,400 |
• జనసాంద్రత | 4,591/కి.మీ2 (11,890/చ. మై.) |
Demonym | కాండియన్ |
Time zone | UTC+05:30 (శ్రీలంక సమయం) |
శ్రీలంక పోస్టల్ కోడ్ | 20000 |
ప్రాంతపు కోడ్ | శ్రీలంక టెలిఫోన్ నంబర్లు |081 |
చరిత్ర
మార్చుకాండీ నగరానికి ఉత్తరాన ఉన్న గంపోలా రాజ్యానికి చక్రవర్తి అయిన విక్రమబాహు III (సా.శ. 1357-1374) మొదట ఈ రాజ్యాన్ని స్థాపించి సెంకడగలపుర అని పేరు పెట్టాడు అని చారిత్రక రికార్డులు సూచిస్తున్నాయి.
ఈ రాజ్యాన్ని పరిపాలించిన రాజులు:
- రాజు విక్రమబాహు సేనసమ్మత (1473–1511) (కాండీ మొదటి రాజు).
- జయవీర ఆస్తానా (1511-1551) (విక్రమబహు కుమారుడు).
- కరాలియద్దే బండార (1551-1581).
- యువరాజు యమసింగ్ బండార (1581-1581) (రాజు కరాలియద్దే బండార మేనల్లుడు) పోర్చుగీస్ మద్దతుతో పాలించాడు (ఇతను 6నెలలు పరిపాలించాడు, కోనప్పు బండారా కుట్రల ఫలితంగా మరణించాడు).
- క్వీన్ డోనా క్యాథరీనా (1581-1581) (కింగ్ కరాలియద్దే బండార కుమార్తె, పోర్చుగీస్ మద్దతుతో నామమాత్రంగా పరిపాలించింది).
- కింగ్ కొనప్పు బండార (1581-1591) పరిపాలించాడు.
- రాజు విమలధర్మసూర్య: 1591-1604 (డెల్గామువా అనే ప్రదేశం నుండి కాండీకి బుద్ధుని దంత అవశేషాలను తీసుకురావడం ద్వారా తన అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకున్నాడు).
- కింగ్ సెనరత్ (సేనరత్నే): 1604-1635
- రాజాసింహ 2: 1629-1687
- విమలధర్మసూర్య 2: 1687-1707
- రాజు శ్రీ వీర పరాక్రమ నరేంద్రసింహ: 1707-1739
- విజయ రాజసింహ: 1729-1747
- కీర్తి శ్రీ రాజాసింహ: 1747-1782
- రాజాధి రాజాసింహ: 1782-1798
- శ్రీ విక్రమ రాజాసింహ: 1798-1815
2 మార్చి1815 లో శ్రీ విక్రమ రాజసింహను బ్రిటిష్ ప్రభుత్వం ఓడించింది. బ్రిటీష్, రాడాల (కాండియన్ ప్రభువులు) మధ్య క్యాండియన్ కన్వెన్షన్ అని పిలువబడే ఒక ఒప్పందం సంతకం చేయబడింది. ఈ ఒప్పందంపై పదవీచ్యుతుడైన రాజు సంతకం చేయలేదు. అతని ఆస్థాన సభ్యులు, క్యాండియన్ రాజ్యానికి చెందిన ఇతర ప్రముఖులు సంతకం చేశారు. ఈ ఒప్పందంతో, కాండీ జార్జ్ IIIని రాజును చేసారు. రాజ్యం చివరి రాజు శ్రీ విక్రమ రాజసింహను బ్రిటీష్ వారు పట్టుకుని రాజ ఖైదీగా సింహాసనంపై హక్కుదారులందరితో సహా దక్షిణ భారతదేశంలోని వెల్లూరు కోటకు తీసుకెళ్లారు. కొంతమంది కుటుంబ సభ్యులు కూడా తమిళనాడులోని తంజావూరుకు తీసుకెళ్లారు. పాత మరియమ్మన్ కోయిల్ రోడ్‌లోని తంజావూరు పట్టణానికి తూర్పు భాగంలో వారి పూర్వపు నివాస స్థలాన్ని ఇప్పటికీ "కాండీ రాజా అరణ్మనై" అని పిలుస్తారు. బ్రిటిష్ వాళ్ళు కాండీ రాజ్య ప్రజల భూములను లాక్కొని వారిని దినసరి కూలీలుగా మార్చారు. 26 జూలై 1848 న రాజుగా పట్టాభిషిక్తుడైన గొంగలెగోడ బండ, ప్రధానమంత్రి పూరన్ అప్పు కాండీ రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా తిరుగుబాటు చేశారు.
భౌగోళికం
మార్చుకాండీ నగరం పర్వతాలు, దట్టమైన అటవీ అంతర్భాగంలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 500 మీటర్లు (1,600 అడుగులు) ఎత్తులో ఉంది, ఈ నగరం నకిల్స్ పర్వత శ్రేణి, హంతానా పర్వత శ్రేణి మధ్య ఉంది. ఇది కృత్రిమ కాండీ సరస్సుకు ఆనుకుని, ఉడవట్ట కేలే అభయారణ్యంకి దక్షిణంగా ఉంది.
వాతావరణం
మార్చుకాండీ నగరం పర్వతాల మధ్యలో, ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున, ఈ నగరం దేశంలోని మిగిలిన ప్రాంతాలలోని ఉష్ణమండల వాతావరణం కంటే చల్లటి ఉష్ణోగ్రతలను కలిగి ఉంటుంది[3]. ఎత్తైన ప్రదేశం కారణంగా చల్లటి వాతావరణం ఉంటుంది. నువారా ఎలియా దీనికి దక్షిణంగా ఉంది. ఈ నగరంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు వాతావరణం పొడిగా ఉంటుంది[4]. మే నుండి జూలై వరకు, అక్టోబరు నుండి డిసెంబరు వరకు ఈ ప్రాంతం రుతుపవనాల సమయం కావడంతో తేమగా ఉంటుంది, తేమ సాధారణంగా 70% నుండి 79% మధ్య ఉంటుంది.
శీతోష్ణస్థితి డేటా - కాండీ | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
సగటు అధిక °C (°F) | 27 (81) |
28 (82) |
30 (86) |
30 (86) |
29 (84) |
28 (82) |
27 (81) |
28 (82) |
28 (82) |
28 (82) |
27 (81) |
27 (81) |
28 (83) |
రోజువారీ సగటు °C (°F) | 23.1 (73.6) |
24.1 (75.4) |
25.4 (77.7) |
25.9 (78.6) |
25.6 (78.1) |
24.8 (76.6) |
24.3 (75.7) |
24.4 (75.9) |
24.3 (75.7) |
24.3 (75.7) |
24 (75) |
23.7 (74.7) |
24.5 (76.1) |
సగటు అల్ప °C (°F) | 18 (64) |
18 (64) |
18 (64) |
20 (68) |
20 (68) |
20 (68) |
20 (68) |
19 (66) |
19 (66) |
19 (66) |
19 (66) |
18 (64) |
19 (66) |
సగటు అవపాతం mm (inches) | 79 (3.1) |
74 (2.9) |
71 (2.8) |
188 (7.4) |
144 (5.7) |
132 (5.2) |
128 (5.0) |
113 (4.4) |
155 (6.1) |
264 (10.4) |
296 (11.7) |
196 (7.7) |
1,840 (72.4) |
సగటు వర్షపాతపు రోజులు | 6 | 5 | 8 | 14 | 11 | 15 | 14 | 13 | 13 | 17 | 16 | 14 | 146 |
రోజువారీ సరాసరి ఎండ పడే గంటలు | 7 | 8 | 8 | 7 | 6 | 6 | 6 | 6 | 6 | 6 | 6 | 6 | 7 |
Source 1: అత్యధిక, అత్యల్ప ఉష్ణోగ్రతలు[5] | |||||||||||||
Source 2: ప్రపంచ వాతావరణ మార్గదర్శి[6] |
బొమ్మలు
మార్చు-
పోర్చుగీస్ పెడ్రో లోపెజ్ సిలోన్ రాణి డోనా క్యాథరినాకు స్వాగతం పలుకుతున్న దృశ్యం.
-
కాండీ సరస్సు
-
కాండీ రాజుల సంతకాలు
-
1815లో బ్రిటిష్, క్యాండియన్ పెద్దల మధ్య సంతకం చేయబడింది
పర్యాటక ప్రదేశాలు
మార్చు- సెంకడగల రాయల్ ప్యాలెస్ - సెంకడగల సింహళ రాజధానిగా ఉన్న కాలంలో సెంకడగల రాయల్ ప్యాలెస్ రాజ్యం పరిపాలనా కేంద్రంగా ఉంది.
- టెంపుల్ ఆఫ్ ద టూత్ - కింగ్ విమలధర్మసూర్య I (1592 - 1604) మొదటగా నిర్మించిన టెంపుల్ ఆఫ్ ద టూత్‌లో బుద్ధుని ఎడమ దంత అవశేషం ఉంది .
- సతారా మహా దేవాలయం - నగరంలో ఉన్న నాలుగు పురాతన దేవాలయాలను సతారా మహా దేవాలయం అని పిలుస్తారు. నాథ, విష్ణు, కటరాగ, పట్టిని అనే నాలుగు దేవతల కోసం వీటిని నిర్మించారు.
- నువారా వేవా - నువారా వేవా 1807 లో శ్రీ విక్రమ రాజసింగ్ రాజుచే టూత్ టెంపుల్ సమీపంలో నిర్మించబడింది.
- కాండీ నేషనల్ మ్యూజియం - కాండీ నేషనల్ మ్యూజియం శ్రీలంకలో కాండీ రాజ్యం, బ్రిటిష్ వలస కాలం నాటి కళాఖండాలు, ఆభరణాలు, ఉపకరణాలు, ఇతర కళాఖండాలను ఉన్నాయి .
- అస్గిరియ ఇంటర్నేషనల్ స్టేడియం - 1996 క్రికెట్ ప్రపంచ కప్ అస్గిరియ అంతర్జాతీయ స్టేడియంలోని ట్రినిటీ కాలేజీ, క్యాండీలో జరిగింది .
- క్యాండీ టౌన్ హాల్ - క్యాండీ మున్సిపల్ కౌన్సిల్, క్యాండీ మేయర్ కార్యాలయం ఉన్న ప్రధాన ప్రధాన కార్యాలయ భవనం. అప్పటి దునువిలా వలవ్వ అని పిలువబడే ఈ భవనాన్ని 1870లో క్యాండీ మునిసిపల్ కౌన్సిల్ తన టౌన్ హాల్‌ని స్థాపించడానికి ఉపయోగిచారు.
- ఉదవట్టెకెలె - అభయారణ్యం టూత్ ఆలయానికి అనుసంధానించబడి ఉంది.
- క్లాక్ టవర్, కాండీ - 1947లో నిర్మించబడింది. శ్రీ దళాద వీడియా, ఎస్.ఇ.ఆర్.డి. ఇంటర్‌ఛేంజ్ మధ్యలో ఉంది.
- ప్రపంచ బౌద్ధ మ్యూజియం - కాండీలోని ప్రపంచ బౌద్ధ మ్యూజియం ప్రపంచంలోని మొట్టమొదటి అంతర్జాతీయ బౌద్ధ మ్యూజియం.
- క్వీన్స్ హోటల్ - పట్టణంలోని పాత హోటల్.
- బోగంబర జైలు - ఇది 1876లో క్యాండీలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన జైలు .
- బ్రిటీష్ గారిసన్ శ్మశానవాటిక - శ్రీలంకలో చనిపోయిన వారిని పాతిపెట్టడానికి 1817లో బ్రిటిష్ వారు నిర్మించిన శ్మశానవాటిక. 1873లో శ్మశానవాటిక మూసివేయబడింది.
- వేల్స్ గార్డెన్స్ - రాజు శ్రీ విక్రమ రాజాసింగ్ నిర్మించిన పార్క్. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గౌరవార్థం వేల్స్ పార్క్ అని పేరు పెట్టారు.
- నెల్లిగాల క్షేత్రం
పరిసర ప్రాంతాలు
మార్చు- అంపిటియ
- ఉత్తర అంపిటియ
- దక్షిణ అంపిటియ
- అన్నీవట్ట
- తూర్పు అరుప్పోల
- అస్గిరియ
- బహిరవకాండ
- బోగంబర
- బోగోడవట్ట
- బోవాలా
- బూవెలికాడ
- దంగోల్ల
- దెయ్యన్నెవెల్లె
- ఏటమోరగొడవట్ట కాలనీ
- పశ్చిమ గన్నోరువా
- గెలియోయ
- గంపోలా
- హీనాగమ
- కటుగస్తోట
- కటుకెలే
- కోస్గస్పిటియ
- కోటగోడెల్ల
- లేవెల్లా
- మడవల
- మహాయ్యవా
- మాల్వత్తా
- మపనావతుర
- మావిల్మడ
- మెనిక్కుంబుర
- ముల్గంపోల
- నవయలతేన్న
- నిట్టవెల
- నువారా దోడన్‌వాలా
- పెరదేనియా
- పోల్గొల్ల
- సియాబలపిటియ
- సీయంబలగస్తెన్నా
- తూర్పు సుడుహుంపోల
- పశ్చిమ సుడుహుంపోల
- తల్వత్తా
- ఉడమడపోల
- ఉడతలవిన్నా
- వాటపులువా
- వత్తారంటెన్న
- వేవెల్పిటియ
- యతివవల
- వట్టేగామ
పరిపాలన
మార్చుకాండీ మున్సిపల్ కౌన్సిల్ ఈ ప్రాంతంలోని మొట్టమొదటి పురపాలక సంఘం. క్యాండీ మేయర్, కౌన్సిలర్లు ఐదు సంవత్సరాల ఒకసారి జరిగే ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతారు. కేసెర సేనానాయకే ప్రస్తుతం కాండీ మేయర్ గా ఉన్నాడు. క్యాండీలో 24 వార్డులు ఉన్నాయి. కౌన్సిల్ లో 24 మంది సభ్యులు ఉంటారు. పాలక పక్షం, యునైటెడ్ నేషనల్ పార్టీ 14, ప్రతిపక్షం 10. కౌన్సిల్ పురోగతిని సమీక్షించడానికి, దాని ప్రాజెక్ట్‌ల అమలుపై నిర్ణయం తీసుకోవడానికి నెలకు ఒకసారి సమావేశమవుతుంది. కౌన్సిల్ ఐదు స్టాండింగ్ కమిటీలు, ఫైనాన్స్, లా, వర్క్స్, స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ సర్వీసెస్ (ప్రీ-స్కూల్స్, లైబ్రరీ) కూడా నెలవారీ సమావేశమై ఆమోదం కోసం కౌన్సిల్ సంబంధిత విషయాలను మూల్యాంకనం చేయడానికి, సిఫార్సు చేస్తాయి.
జనసంఖ్యా సంబంధితం
మార్చుజనాభా లెక్కల ప్రకారం (2012)
మార్చుజాతి | జనాభా | % మొత్తం |
---|---|---|
సింహళీయులు | 118,209 | 74.55 |
శ్రీలంక మూర్స్ | 17,282 | 10.90 |
శ్రీలంక తమిళులు | 15,203 | 9.59 |
ఇండియా తమిళులు | 5,601 | 3.53 |
(మిగతా వారు, శ్రీలంక మలయులు) | 2,269 | 1.43 |
మొత్తం | 158,564 | 100 |
భాష, మతం
మార్చుకాండీ, సింహళీయులు ఎక్కువగా ఉన్న నగరం. మూర్స్, తమిళులు వంటి ఇతర జాతి సమూహాలకు చెందిన గణనీయమైన కమ్యూనిటీలు ఉన్నాయి. పౌరులలో బౌద్ధమతం ఎక్కువమంది ఆచరిస్తున్నారు, తరువాతి స్థానాలలో హిందూ, ఇస్లాం, క్రైస్తవ మతం ఉన్నాయి.
ఆర్థిక వ్యవస్థ
మార్చుఇది శ్రీలంక ద్వీపంలో రెండవ అతిపెద్ద నగరం, సెంట్రల్ ప్రావిన్స్ రాజధాని. అనేక ప్రధాన సంస్థలు క్యాండీలో పెద్ద బ్రాంచ్ కార్యాలయాలను కలిగి ఉన్నాయి, వస్త్రాలు, శ్రీలంక రత్నాలు, ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆభరణాలతో సహా అనేక పరిశ్రమలు ఉన్నాయి. అనేక వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు నగరం అంతటా ఉన్నాయి.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Ng, Chee; Castle, David (2010-12-15). "Pharmacogenetics from ethno-cultural perspectives". Sri Lanka Journal of Psychiatry. 1 (2): 29. doi:10.4038/sljpsyc.v1i2.2569. ISSN 2579-2008.
- ↑ DE SILVA, WASANA; AMARAKOON, NISAL (2020-12-01). "SUSTAINABLE CITY GEOMETRIES: SACRED GEOMETRY OF RITUAL SPACE, ARCHITECTURE AND CITY LANDSCAPE IN KANDY, SRI LANKA". The Sustainable City XIV. Southampton UK: WIT Press. doi:10.2495/sc200131.
- ↑ Kawale, Jaya; Liess, Stefan; Kumar, Arjun; Steinbach, Michael; Snyder, Peter; Kumar, Vipin; Ganguly, Auroop R.; Samatova, Nagiza F.; Semazzi, Fredrick (2013-04-17). "A graph-based approach to find teleconnections in climate data". Statistical Analysis and Data Mining: The ASA Data Science Journal. 6 (3): 158–179. doi:10.1002/sam.11181. ISSN 1932-1864.
- ↑ "High-resolution image from the NOAA 18 satellite - almost cloud-free British Isles on 26 March 2012". Weather. 67 (5): E1–E1. 2012-04-25. doi:10.1002/wea.1938. ISSN 0043-1656.
- ↑ "Best Weather in Kandy, Sri Lanka". Weather2Travel. Retrieved 12 November 2013.
- ↑ www.worldclimateguide.co.uk. "Kandy Climate Guide, Sri Lanka – World Climate Guide".