కాకినాడ టౌన్ రైల్వే స్టేషను

కాకినాడ టౌన్ రైల్వే స్టేషను భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా లోని కాకినాడ లోని ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది సామర్లకోట-కాకినాడ పోర్ట్ శాఖా రైలు మార్గములో ఉంది. ఈ శాఖా రైలు మార్గము హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని ఒక భాగముగా ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను నిర్వహణలో ఉంది. ఇది కంప్యూటర్ రిజర్వేషన్ సౌకర్యాలు, వెయిటింగ్ హాల్స్, రిఫ్రెష్మెంట్ గదులు, రిటైరింగ్ గదులు కలిగి ఉంది. కాకినాడ టౌన్ రైల్వే స్టేషను నుండి గౌతమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, సర్కార్ ఎక్స్‌ప్రెస్, శేషాద్రి ఎక్స్‌ప్రెస్, కొకనాడ ఎసి ఎక్స్‌ప్రెస్‌ వంటి కొన్ని ప్రీమియం రైళ్ళు ఇక్కడి నుండి ప్రారంభమవుతాయి.[1]

కాకినాడ టౌన్ రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
కాకినాడ టౌన్ రైల్వే స్టేషను ప్రవేశద్వారం
General information
Locationరామరావు పేట, కాకినాడ, తూర్పు గోదావరి, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°55′48″N 82°19′48″E / 16.9300°N 82.3300°E / 16.9300; 82.3300
Elevation19 మీ. (62 అ.)
Line(s)సామర్లకోట-కాకినాడ పోర్ట్ శాఖా రైలు మార్గము
కాకినాడ సిటీ జంక్షన్-కోటిపల్లి
Platforms3(4 వది పూర్తి చేయవలసి ఉంది)
Tracksబ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeCCT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrifiedఅవును

ప్రత్యేక రైళ్లు

మార్చు

కాకినాడ టౌన్ రైల్వే స్టేషను ప్రతి సంవత్సరం హైదరాబాద్, తిరుపతి, కొల్లం నుండి ప్రత్యేక రైళ్ళతో అనుసంధానించబడి ఉంది.

స్టేషను వర్గం

మార్చు

కాకినాడ టౌన్ రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. ఇది విజయవాడ రైల్వే డివిజనులో "మోడల్ స్టేషన్", "ఆదర్శ్ స్టేషన్", "టచ్ & ఫీల్ (మోడరన్ స్టేషన్స్)"గా గుర్తింపు పొందింది.[2][3]

అభివృద్ధి

మార్చు

ఈ స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు (ATVM లు) ఈ స్టేషన్లో ఇన్స్టాల్ చేశాయి. అలాగే 2016-18లో రైల్వే బడ్జెట్లో, కాకినాడను హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో విలీనం చేయటానికి 200 కోట్ల రూపాయలు కేటాయించ బడింది.[4]

ఇవి కూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. "Kakinada City railway station info". India Rail Info. Retrieved 19 November 2015.
  2. "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 30 డిసెంబరు 2018.
  3. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
  4. "SCR introduces mobile paper ticketing facility in 38 stations".