కాజాలు ఆంధ్ర ప్రాంతంలో అత్యదికంగా విక్రయించబడే మిఠాయిలు, శుభకార్యక్రమములలో విరివిగా వినియోగించబడే ప్రసిద్ధ మిఠాయి. కాకినాడ ప్రాంతము కాజాల ద్వారానే బహు ప్రసిద్ధి. పిండిని పల్చగా సన్నటి పట్టీగా మార్చి దానిని గుండ్రంగా మడచి తరువాత ఒక వైపు కొంచెం నొక్కడంతో కాజా ఆకారం వస్తుంది. దీనిని నూనెలో బంగారపు రంగు వచ్చేవరకూ వేయించి తరువాత పంచదార పాకంలో ముంచి తీసి తయారు చేస్తారు. ఒక్క ఆంధ్రప్రాంతంలోనే కాక దేశవ్యాప్తంగా అన్ని చోట్లా లభ్యమగును.

కాజా
Telugu sweet-kaja-4.jpg
మూలము
ఇతర పేర్లుకాజాలు
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంఆంధ్రప్రదేశ్
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు గోదుమ పిండి, చక్కెర, నూనె
కాజాలు

కాజాలు, రకాలుసవరించు

కాజాలలో మడత కాజా, గొట్టం కాజా, చిట్టికాజా అనే రకాలు ఉన్నాయి.

విశేషాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కాజాలు&oldid=2879455" నుండి వెలికితీశారు