కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను

వేలూరి రైల్వే స్టేషన్

కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను తమిళనాడులో వెల్లూరు జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన, రద్దీగా ఉండే రైల్వే స్టేషను. ఈ స్టేషను చెన్నై సెంట్రల్-బెంగళూరు సిటీ లైన్, బెంగుళూర్ సిటీ-హౌరా మెయిన్ లైన్, కాట్పాడి-గూడూరు శాఖా రైలు మార్గము, కాట్పాడి-విల్లుప్పురం శాఖా రైలు మార్గములో ఉంది. ఇక్కడ క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోసం ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఈ రైల్వే స్టేషను డబుల్ లైన్ ఎలక్ట్రిఫికేషన్‌ను కలిగి ఉంది.[1]

కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల స్టేషను
ప్లాట్ ఫారముల 3 & 4 దృశ్యం
సాధారణ సమాచారం
Locationవెల్లూర్ - చిత్తూరు హై రోడ్ , కాట్పాడి , వెల్లూరు, తమిళనాడు
భారత దేశము
Elevation213 మీటర్లు (699 అ.)
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ రైల్వే
లైన్లుచెన్నై సిటీ-బెంగళూరు సిటీ రైలు మార్గము
గూడూరు-కాట్పాడి శాఖ రైలు మార్గము
విల్లుప్పురం-కాట్పాడి శాఖ రైలు మార్గము
బెంగళూరు సిటీ-హౌరా ప్రధాన రైలు మార్గము
చెన్నై సెంట్రల్-తిరువనంతపురం ప్రధాన రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు5
పట్టాలు9
నిర్మాణం
పార్కింగ్ఉంది
Bicycle facilitiesఉంది
Disabled accessమూస:Accessicon
ఇతర సమాచారం
స్టేషను కోడుKPD
Fare zoneభారతీయ రైల్వేలు
విద్యుత్ లైనుఅవును
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
కాట్పాడి–విల్లుప్పురం శాఖా రైలు మార్గము
కి.మీ.
చిత్తూరు వైపునకు
  చెన్నై సెంట్రల్  
0 కాట్పాడి జంక్షన్
  జోలార్‌పేట జంక్షన్  
MAS పరిధులు
TPJ పరిధులు
పలార్ నది
9 వెల్లూరు టౌన్
10 వెల్లూరు కంటోన్మెంట్
19 పెన్నతూర్ హాల్ట్
22 కనియంబాడి
31 కన్నమంగళం
35 ఒన్నుపురం హాల్ట్
40 సేదారాంపట్టు
కమండల నది
46 ఆర్ని రోడ్
50 మడిమంగళం
62 పోలూర్
చెయ్యార్ నది
76 అగరం సిబ్బంది
84 తురింజపురం
93 తిరువన్నామలై
తురింజాల్ నది
110 తండరాయ్
113 అండంపలియం
119 అధిచ్చానూర్
123 తిరుక్కోవిల్లూర్
136 ముగైయూర్
141 అయందూర్
145 మాంబాలపట్టు
149 తేలి
153 వెంకటేశపురం
  చెన్నై ఎగ్మూర్  
161 విల్లుపురం జంక్షన్
  వ్రిద్ధాచలం జంక్షన్  
కడాలూర్ పోర్ట్‌ జంక్షన్ వైపునకు
పుదుచ్చేరి వైపునకు
Katpadi Jn Railway station Board.
కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను పేరు ప్రదర్శన బోర్డు

లేఅవుట్

మార్చు

ఈ స్టేషను ఐదు ప్లాట్ ఫారములు కలిగి ఉంది. ప్లాట్ ఫారములు 4, 5 ప్రధానంగా వెల్లూర్ కంటోన్మెంట్, దక్షిణ తమిళనాడు,, ఆంధ్రప్రదేశ్ లకు రైళ్ళు రాక పోకలకు సేవలు అందిస్తాయి.

ప్లాట్ ఫారములు 1 నుండి 3 ప్రధానంగా చెన్నై, బెంగుళూరు, హౌరా, న్యూఢిల్లీ, ముంబై, కన్యాకుమారి, కోయంబత్తూరు, కేరళకు వెళ్ళే రైళ్ళకు సేవలు అందిస్తాయి.[2]

సౌకర్యాలు

మార్చు

ఐఆర్సిటిసి నిర్వహించు ఫుడ్ ప్లాజా ప్లాట్ ఫారములు 1, 2 లో ఉంది. ప్లాట్ ఫారములు 1, 2, 3 కూడా ఆవిన్ పాలు బూత్, కాఫీ దుకాణాలు, హోటల్, పుస్తక దుకాణము, పండ్ల దుకాణములతో సహా రిఫ్రెష్మెంట్ స్టాల్స్ కలిగి ఉంటాయి. ప్లాట్ ఫారములు 1, 2, 3, 5 లో మరుగుదొడ్లు, స్నానపు గదులు అందుబాటులో ఉన్నాయి. కరూర్ వైశ్యా బ్యాంకు, కాట్పడి బ్రాంచ్ యొక్క ఎటిఎం ప్రధాన ద్వారం వద్ద ఉంది. ప్లాట్‌ ఫారం 1, 2 లలో ఒక డిజిటల్ బోర్డ్ కోచ్ నంబర్లతో రైళ్ల నిష్క్రమణ, రాకను చూపుతుంది. ఆర్‌పిఎఫ్ పోలీస్ స్టేషను ప్లాట్‌ ఫారం 1లో ఉంది. పార్సెల్ బుకింగ్ ఆఫీసు, రైల్వే మెయిలింగ్ సర్వీస్ (ఆర్‌ఎంఎస్) అందుబాటులో ఉన్నాయి. ఎగువ తరగతి, స్లీపర్ తరగతి ప్రయాణీకులకు వేచి ఉండే గదులు ప్లాట్ ఫారములు 1, 2, 3వ నంబరుల్లో అందుబాటులో ఉన్నాయి. మహిళలకు ప్రత్యేక నిరీక్షణ (వెయిటింగ్) హాల్ కూడా అందుబాటులో ఉంది.

రిజర్వేషన్ టికెట్ల కోసం ప్లాట్‌ ఫారం ఒకటిలో ఈ స్టేషనుకు ఐదు కౌంటర్లు ఉన్నాయి. సుదూర రైళ్లకు రిజర్వేషన్లు ప్రత్యేక భవనంలో రైల్వే స్టేషను యొక్క ప్రధాన ద్వారం వద్ద ఉన్నాయి. ప్రయాణీకుల భద్రత కోసం, దక్షిణ రైల్వేలు అన్ని ప్లాట్ ఫారములలో కెమెరాలు ఏర్పాటు చేశాయి.[3] ప్లాట్‌ ఫారం 1లో సిఎంసి హాస్పిటల్ యొక్క 'హెల్ప్ డెస్క్ ' ఉంది.[4]

రవాణా

మార్చు

వెల్లూరు కొత్త బస్ స్టాండ్ కాట్పడి స్టేషను నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెల్లూరు న్యూ బస్ స్టాండ్ హబ్ అన్ని ఇతర నగరాలకు, సమీపంలోని స్థానిక ప్రదేశాలకు అనుసంధానం చేస్తుంది. ఇది స్థానిక బస్సులు, బయటి దూరప్రాంతాలకు వెళ్ళే బస్సులకు అందుబాటులో ఉంది. ఈ రైల్వే స్టేషను నుండి నగరం యొక్క ఇతర భాగాలకు అనుసంధానించే బస్సు సదుపాయాలు స్టేషను వెలుపల అందుబాటులో ఉన్నాయి. టాక్సీలు, ఆటోలు ఇతర ప్రధాన రవాణా పద్ధతులు కూడా అందుబాటులో ఉన్నాయి.

రైళ్లు

మార్చు

దాదాపు 245 రైళ్లు ఈ జంక్షన్ వద్ద ఆగుతాయి. కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషనుకు వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కోసం, సీఎంసీ ఆసుపత్రి, వీటీ విశ్వవిద్యాలయానికి వెళ్ళేందుకు ప్రయాణించేవారే ప్రధాన ప్రయాణికులుగా ఉంటారు. ప్రతిరోజూ రోజుకు 18,000 మంది ప్రయాణీకులకు ఈ స్టేషను సేవలు అందిస్తున్నది. ప్రతిరోజూ 11 కాట్పాడి జంక్షన్ రైల్వే స్టేషను నుండి బయలుదేరే రైళ్ళు, 67 ప్రయాణికుల రైళ్లు ఉన్నాయి.[5]

మూలాలు

మార్చు
  1. "Vellore Train Timings". Archived from the original on 27 జనవరి 2010. Retrieved 27 డిసెంబరు 2018.
  2. "The History Of C.M.C". Home.cmcvellore.ac.in. Archived from the original on 2012-02-25. Retrieved 2014-03-08.
  3. "Yeshwantpur, Bangalore Cantonment to have food plazas soon - The Times of India". Articles.timesofindia.indiatimes.com. 2010-02-16. Archived from the original on 2013-10-31. Retrieved 2014-03-08.
  4. "A Guide to Christian Medical College, Vellore" (PDF). Cmch-vellore.edu. Archived from the original (PDF) on 2015-09-23. Retrieved 2014-03-08.
  5. Namma, Vellore. "Vellore Katpadi Railway Station to Upgrade". www.nammavellore.in.