కాడ్మియం నైట్రేట్
కాడ్మియం నైట్రేట్ఒక అకర్బన రసాయన సమ్మేళనం.నిర్జల కాడ్మియం నైట్రేట్ రసాయన ఫార్ములా Cd (NO3) 2.ఆర్ద్ర కాడ్మియం నైట్రేట్ ల సాధారణ రసాయనఫార్ములా Cd (NO3) 2.xH2O.ఈ రసాయన సమ్మేళనంలో కాడ్మియం లోహంతో పాటు నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ పరమాణువుల సంయోగం వలన ఈ రసాయన సంయోగ పదార్థం ఏర్పడినది.ఈ సంయోగ పదార్థాలలో నిరాకార, అషౌష్టవ రకం చెందినది, వోలటైల్ (తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆవిరిగా మారు/బాష్పీకరణ చెందు పదార్థాలు) పదార్థం కాగా, మిగిలినవి లవణాలు.. కాడ్మియం నైట్రేట్ సమూహానికి చెందిన అన్నియు రంగులేని స్పటికాకృతి ఘనపదార్థాలు.ఇవ్వన్నియు గాలిలోని తేమ/చెమ్మను పీల్చుకొని తడిగా /చెమ్మగా మారును.కాడ్మియం సంయోగ పదార్థాలు కాన్సరు కారకాలుగా గుర్తింపబడినవి.
పేర్లు | |
---|---|
IUPAC నామము
Cadmium(II) nitrate
| |
ఇతర పేర్లు
Nitric acid, cadmium salt
| |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [10325-94-7] |
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 233-710-6 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:77732 |
SMILES | [Cd+2].[O-][N+]([O-])=O.[O-][N+]([O-])=O |
| |
ధర్మములు | |
Cd(NO3)2 | |
స్వరూపం | White crystals, hygroscopic |
వాసన | Odorless |
సాంద్రత | 3.6 g/cm3 (anhydrous) 2.45 g/cm3 (tetrahdyrate)[1] |
ద్రవీభవన స్థానం | 360 °C (680 °F; 633 K) at 760 mmHg (anhydrous) 59.5 °C (139.1 °F; 332.6 K) at 760 mmHg (tetrahydrate)[1] |
బాష్పీభవన స్థానం | 132 °C (270 °F; 405 K) at 760 mmHg (tetrahydrate)[2] |
109.7 g/100 mL (0 °C) 126.6 g/100 mL (18 °C) 139.8 g/100 mL (30 °C) 320.9 g/100 mL (59.5 °C)[3] | |
ద్రావణీయత | Soluble in acids, ammonia, alcohols, ether, acetone |
అయస్కాంత ససెప్టిబిలిటి | −5.51·10−5 cm3/mol (anhydrous) −1.4·10−4 cm3/mol (tetrahydrate)[1] |
నిర్మాణం | |
స్ఫటిక నిర్మాణం
|
Cubic (anhydrous) Orthorhombic (tetrahydrate)[1] |
Fdd2, No. 43 (tetrahydrate)[4] | |
mm2 (tetrahydrate)[4] | |
α = 90°, β = 90°, γ = 90°
| |
ప్రమాదాలు | |
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు | |
జి.హెచ్.ఎస్.సంకేత పదం | Danger |
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు | H301, H330, H340, H350, H360, H372, H410 |
GHS precautionary statements | P201, P260, P273, P284, P301+310, P310 |
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} |
R-పదబంధాలు | R25, R26, మూస:R45, మూస:R46,మూస:R48/23/25, R50/53, R60, R61 |
S-పదబంధాలు | S28, మూస:S36/37, S45, S53, S60, S61 |
Lethal dose or concentration (LD, LC): | |
LD50 (median dose)
|
300 mg/kg (rats, oral) |
US health exposure limits (NIOSH): | |
PEL (Permissible)
|
[1910.1027] TWA 0.005 mg/m3 (as Cd) |
REL (Recommended)
|
Ca[5] |
IDLH (Immediate danger)
|
Ca [9 mg/m3 (as Cd)] |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Zinc nitrate Calcium nitrate Magnesium nitrate |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక ధర్మాలు
మార్చుభౌతిక స్థితి
మార్చుకాడ్మియం నైట్రేట్ తెల్లని స్పటికరూప ఘనపదార్థం.ఆర్ద్రతాకర్షణ కల్గిన రసాయన సమ్మేళనపదార్థం.వాసన రహితం.
సాంద్రత
మార్చుసాధారణ 25 °C ఉష్ణోగ్రతవద్ద నిర్జల /అనార్ద్ర కాడ్మియం నైట్రేట్ సాంద్రత 3.6గ్రాములు/సెం.మీ3.నాలుగు జలాణువులు కల్గిన ఆర్ద్ర/జలయుత (tetrahdyrate) కాడ్మియం నైట్రేట్ సాంద్రత 2.45గ్రాములు/సెం.మీ3
ద్రవీభవన ఉష్ణోగ్రత
మార్చుసాధారణ వాతావరణ పీడనం దగ్గర (760 mmHg) నిర్జల /అనార్ద్ర కాడ్మియం నైట్రేట్ ద్రవీభవన స్థానం 360 °C (680 °F; 633K)., నాలుగు జలాణువులు కల్గిన ఆర్ద్ర కాడ్మియం నైట్రేట్ ద్రవీభవన స్థానం 59.5 °C (139.1 °F;332.6 K)
బాష్పీభవన ఉష్ణోగ్రత
మార్చునాలుగు జలాణువులుకల్గిన ఆర్ద్ర కాడ్మియం నైట్రేట్ బాష్పీభవన స్థానం, సాధారణ వాతావరణ పీడనం దగ్గర (760 mmHg) 132 °C (270 °F; 405K)
ద్రావణీయత
మార్చునీటిలో కరుగును. 100 మీ.లీ నీటిలో 0 °C వద్ద 109.7 గ్రాములు, 18 °C దగ్గర126.6 గ్రాములు, 30 °C వద్ద139.8 గ్రాములు, 59.5 °C వద్ద 320.9 గ్రాములు కరుగును.కాడ్మియం నైట్రేట్ ఇంకను ఆమ్లాలలో కరుగును.అమ్మోనియా, ఆల్కహాల్‌లు, ఇథర్,, ఎసిటోన్ లలోకూడా కరుగును.
ఉత్పత్తి
మార్చుకాడ్మియం లోహాన్ని లేదా కాడ్మియం ఆక్సైడ్‌ను నైట్రిక్ ఆక్సైడ్ లో కరగించి, పిమ్మట స్పటికికరించడం (crystallization) ద్వారా కాడ్మియం నైట్రేట్ ను ఉత్పత్తి కావింతురు.
- Cd + 4 HNO3 → 2 NO2 + 2 H2O + Cd(NO3)2
- CdO + 2HNO3 → Cd(NO3)2 +H 2O
అలాగే కాడ్మియం హైడ్రాక్సైడ్ లేదా కాడ్మియం కార్బోనేట్‌ను కూడా నైట్రిక్ ఆక్సైడ్ లో కరగించి, పిమ్మట స్పటికికరించడం (crystallization) ద్వారా కాడ్మియం నైట్రేట్ ను ఉత్పత్తి కావింతురు.
- CdCO3 + 2 HNO3 → Cd(NO3)2 + CO2 + H2O
రసాయన చర్యలు
మార్చుఅత్యధిక ఉష్ణోగ్రత వద్ద కాడ్మియం నైట్రేట్ విఘటన/వియోగం చెందటం వలన కాడ్మియం ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లను ఉత్పత్తి చేయును.ఆమ్లీకృతకాడ్మియం నైట్రేట్ ద్రావణం ద్వారా హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువును ప్రసరింపచేసిన, పసుపు వర్ణపు కాడ్మియం సల్ఫైడ్ ఏర్పడును.
కాస్టిక్ సోడా (సోడియం హైడ్రాక్సైడ్) ద్రావణంతో కాడ్మియం ఆక్సైడ్ చర్య వలన కాడ్మియం హైడ్రాక్సైడ్ అవక్షేపంగా ఏర్పడును.పలు కాడ్మియం లవణాలను ఇలా అవక్షేపరూపాలలో వేరు చేయవచ్చును.
ఉపయోగాలు
మార్చుకాడ్మియం నైట్రేట్ ను గాజు, పింగాణి వస్తువులకు రంగును ఇచ్చుటకై ఉపయోగిస్తారు.అలాగే పోటోగ్రఫిలో ఫ్లాష్పౌడర్ గా ఉపయోగిస్తారు.
మూలాలు/ఆధారాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 Lide, David R., ed. (2009). CRC Handbook of Chemistry and Physics (90th ed.). Boca Raton, Florida: CRC Press. ISBN 978-1-4200-9084-0.
- ↑ 2.0 2.1 "MSDS of Cadmium nitrate tetrahydrate". fishersci.ca. Fisher Scientific. Retrieved 2014-06-25.
- ↑ Seidell, Atherton; Linke, William F. (1919). Solubilities of Inorganic and Organic Compounds (2nd ed.). New York: D. Van Nostrand Company. p. 178.
- ↑ 4.0 4.1 James, D. W.; Carrick, M. T.; Leong, W. H. (1978). "Raman spectrum of cadmium nitrate". Australian Journal of Chemistry. 31 (6): 1189. doi:10.1071/CH9781189.
- ↑ NIOSH Pocket Guide to Chemical Hazards. "#0087". National Institute for Occupational Safety and Health (NIOSH).