కాపర్(I) ఆక్సైడ్ఒక రసాయన సంయోగ పదార్థం. కాపర్(I) ఆక్సైడ్ ఒక ఆకర్బన సమ్మేళన పదార్థం. ఈ సమ్మెళన పదార్థం యొక్క రసాయన సంకేత పదం Cu2O.రాగి, ఆక్సిజన్ మూలకాల రసాయన సంయోగం వలన ఈ సమ్మేళన పదార్థం ఏర్పడినది. రాగి యొక్క ఆక్సైడులలో కాపర్(I) ఆక్సైడ్ ముఖ్యమైనది.రంగులలో కాపర్(I) ఆక్సైడును అంటి ఫౌలింగ్(మలినాలను తొలగించునది) కారకంగా ఉపయోగిస్తారు.కాపర్(I) ఆక్సైడు దాని పదార్థకణాల పరిమాణాన్ని బట్టి పసుపు లేదా ఎరుపుగా ఉండును.[1] కాపర్ ఆక్సైడు, కుప్రైట్ అను ఎరుపు ఖనిజంగా లభిస్తుంది .

కాపర్(I) ఆక్సైడ్
Copper(I) oxide
Copper(I) oxide unit cell
పేర్లు
IUPAC నామము
Copper(I) oxide
ఇతర పేర్లు
Cuprous oxide
Dicopper oxide
Cuprite
Red copper oxide
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [1317-39-1]
పబ్ కెమ్ 10313194
యూరోపియన్ కమిషన్ సంఖ్య 215-270-7
కెగ్ C18714
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GL8050000
SMILES [Cu]O[Cu]
ధర్మములు
Cu2O
మోలార్ ద్రవ్యరాశి 143.09 g/mol
స్వరూపం brownish-red solid
సాంద్రత 6.0 g/cm3
ద్రవీభవన స్థానం 1,232 °C (2,250 °F; 1,505 K)
బాష్పీభవన స్థానం 1,800 °C (3,270 °F; 2,070 K)
Insoluble
ద్రావణీయత in acid Soluble
Band gap 2.137 eV
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
cubic
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−170 kJ·mol−1
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
93 J·mol−1·K−1
ప్రమాదాలు
ఇ.యు.వర్గీకరణ {{{value}}}
R-పదబంధాలు R22, R50/53
S-పదబంధాలు (S2), మూస:S22, S60, S61
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Copper(II) oxide
Silver(I) oxide
Nickel(II) oxide
Zinc oxide
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

కాపర్(I) ఆక్సైడ్ ఎరుపు రంగు కలిగిన ఘన పదార్థం.కాపర్(I) ఆక్సైడు యొక్క అణుభారం 143.09 గ్రాములు/మోల్.ఈ సంయోగ పదార్థం యొక్క సాంద్రత 6.0 గ్రాములు/సెం.మీ3.కాపర్(I) ఆక్సైడు సమ్మేళన పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 1,232 °C (2,250 °F; 1,505K).అలాగే కాపర్(I) ఆక్సైడు యొక్క బాష్పీభవన స్థానం 1,800 °C (3,270 °F; 2,070K).ఇది నీటిలో కరుగదు, కాని ఆమ్లాలలో కరుగుతుంది.

ఘన కాపర్(I) ఆక్సైడు డయామాగ్నెటిక్ పదార్థం.కాపర్(I) ఆక్సైడు యొక్క అణుసౌష్టవం బహురూపిత సిలికా డయాక్సైడ్(SiO2) సౌష్టవాన్ని పోలిఉన్నది.

ఇతర ధర్మాలు

మార్చు

కాపర్(I) ఆక్సైడు గాఢ అమ్మోనియా ద్రావణంలో కరగడం వలన రంగులేని సంక్లిష్ట పదార్థం [Cu(NH3) 2]+ను ఏర్పరచును.ఇలా ఏర్పడిన ఈ పదార్థం సులభంగా గాలిలో ఆక్సీకరణ చెంది నీలిరంగు[Cu(NH3) 4(H2O) 2]2+గా పరివర్తన పొందును. హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరగడం వలన CuCl2ద్రావణంఏర్పడును. కాపర్(I) ఆక్సైడు సజల సల్ఫ్యూరిక్‌ఆమ్లంతో కాపర్(II) సల్ఫేట్, నైట్రిక్ ఆమ్లంతో కాపర్(II) నైట్రేట్‌లను ఉత్పత్తి చెయ్యును.[2]

తేమ /చెమ్మ ఉన్నగాలిలో కాపర్(I) ఆక్సైడు పరివర్తన వలన కాపర్(II) ఆక్సైడుగా మారును.

అణు నిర్మాణం

మార్చు

కాపర్ ఆక్సైడ్ అణువు స్పటికము చరతుర్భుజాకారం కలిగిఉన్నది.అనువు అల్లిక స్థిరాంకం al=4.2696 Å.అణువులోని కాపర్ పరమాణువులు fcc(face centre cubic) ఉప అల్లిక నిర్మాణాన్ని కలిగి, అక్సిజన్ పరమాణువు bcc అల్లిక నిర్మాణంలో అమరిఉన్నది

ఉత్పత్తి విధానం

మార్చు

కాపర్(I) ఆక్సైడ్ను పలుపద్ధతులలో తయారు చెయ్యవచ్చును[3].ప్రథమంగా నేరుగా రాగి లోహాన్ని ఆక్సీకరణ కావించి కాపరు ఆక్సైడును ఉత్పత్తి చెయ్యవచ్చును.

4 Cu + O2 → 2 Cu2O

నీరు, ఆమ్లం వంటి వాటిని అదనంగా చేర్చడం వలన చర్యావేగంలో మార్పువచ్చును, అలాగే ఆక్సీకరణ వేగంలోను మార్పు వచ్చును.పారిశ్రామికంగా కాపర్(II) ద్రావాణాలను సల్ఫర్‌డయాక్సైడుతో క్షయించి తయారు చెయ్యు దురు. సజల కుప్రస్ క్లోరైడు ద్రావణులు క్షారాలతో ప్రతిచర్య జరపడం వలన కూడా కాపర్ ఆక్సైడు ఉత్పత్తి అగును. పై అన్ని విధానాలలో కాపర్ ఆక్సైడ్ యొక్క రంగు, ఉత్పత్తి విధాన శైలిపై ఆధార పడి ఉండును .

ఫేహేలిమ్గ్ టెస్ట్ (Fehling's test ), బెనెడిక్ట్స్ పరీక్ష(Benedict's test) లో చక్కెరలను క్షయించునపుడు కాపర్ (I) ఆక్సైడుఏర్పడటం ప్రధాన మూలలక్షణము. పరీక్షలో ఈ చక్కెరలు కాపర్(II) లవణాల యొక్క అల్కలైను ద్రావణాన్ని క్షయికరించి కాపర్ ఆక్సైడును అవక్షేపిచును

వెండిపూత కలిగిన రాగిపలకాల వెండిపూత పాడైపోయిన లేదా రంధ్రాలు పడిన అటువంటి చోట కాపర్(I) ఆక్సైడ్ ఏర్పడటాన్ని గమనించవచ్చను, ఇటు వంటి లోహక్షయికరణ చర్యను రెడ్‌ప్లేగు(red plague) అంటారు.రాగి-అమ్మోనియా సంక్లిష్ట పదార్థం, హైడ్రోజన్ పెరాక్సైడుతో చర్యవలన కూడా కాపర్(I) ఆక్సైడు ఏర్పడును.

ఉపయోగం

మార్చు

కుప్రస్ఆక్సైడును రంగులు తయారు చేయు, శిలీంద్ర నాశిని మందులు తయారు చేయు, అంటి ఫౌలింగ్ కారకాలను తయారీ చెయ్యు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.1924 కాలంలో, ఇంకా సిలికాన్ డయోడులు ప్రాచుర్యంలోకి రాని సమయంలో రెక్టిఫైయరు డయోడులలో కాపర్(I) ఆక్సైడును ఉపయోగించెవారు.[4] బెనేడిక్టు పరీక్షలో పింకురంగు కాపర్(I) ఆక్సైడు వలననే ఏర్పడును.

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. N. N. Greenwood, A. Earnshaw, Chemistry of the Elements, 2nd ed., Butterworth-Heinemann, Oxford, UK, 1997.
  2. D. Nicholls, Complexes and First-Row Transition Elements, Macmillan Press, London, 1973.
  3. H. Wayne Richardson "Copper Compounds" in Ullmann's Encyclopedia of Industrial Chemistry 2002, Wiley-VCH, Weinheim. doi:10.1002/14356007.a07_567
  4. L. O. Grondahl, Unidirectional current carrying device, Patent, 1927

ఇతర లింకులు

మార్చు