కాపర్(I) సల్ఫైడ్
కాపర్(I) సల్ఫైడ్ ఒక రసాయన సమ్మేళనం. ఇది ఒక అకర్బన రసాయన సంయోగపదార్థం. రాగి, సల్ఫర్ మూలకాల పరమాణు సంయోగం వలన కాపర్‌సల్ఫైడ్ సమ్మేళనపదార్థం ఈ సంయోగపదార్థం యొక్క రసాయన సంకేతపదం Cu2Sఏర్పడినది. ప్రకృతిలో కాపర్‌సల్ఫైడ్ చాకోసైట్ (chalocite) అనబడు ఖనిజ రూపంలో లభిస్తున్నది.ఈ ఖనిజం stoichiometry గా Cu1.997S నుండి Cu2.000S వ్యత్యాసంలో లభిస్తుంది.[3]
పేర్లు | |
---|---|
IUPAC నామము
Copper(I) sulfide
| |
ఇతర పేర్లు | |
గుర్తింపు విషయాలు | |
సి.ఎ.ఎస్. సంఖ్య | [22205-45-4] |
పబ్ కెమ్ | 62755 |
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:51114 |
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | GL8910000 |
SMILES | [Cu+].[Cu+].[S-2] |
| |
ధర్మములు | |
Cu2S | |
మోలార్ ద్రవ్యరాశి | 159.16 g/mol |
సాంద్రత | 5.6 g/cm3 [1] |
ద్రవీభవన స్థానం | 1,130 °C (2,070 °F; 1,400 K) |
Insoluble | |
ద్రావణీయత | slightly soluble in HCl; soluble in NH4OH; dissolves in KCN; decomposes in HNO3, H2SO4 |
ప్రమాదాలు | |
జ్వలన స్థానం | {{{value}}} |
సంబంధిత సమ్మేళనాలు | |
ఇతరఅయాన్లు | {{{value}}} |
ఇతర కాటయాన్లు
|
Nickel(II) sulfide Copper(II) sulfide Zinc sulfide |
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |
verify (what is ?) | |
Infobox references | |
భౌతిక ధర్మాలు
మార్చుకాపర్(I) సల్ఫైడు యొక్క అణుభారం 159.16 గ్రాములు/మోల్. కాపర్(I) సల్ఫైడు సమ్మెళనపదార్థం యొక్క సాంద్రత(25 °C వద్ద)5.6 గ్రాములు/సెం.మీ3.కాపర్(I) సల్ఫైడు యొక్క ద్రవీభవన స్థానం1,130 °C (2,070 °F; 1,400K). కాపర్(I) సల్ఫైడు నీటిలో కరుగదు. కాని ఈ సంయోగ పదార్థం హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో తక్కువ ప్రమాణంలో కరుగుతుంది.అమ్మోనియం హైడ్రాక్సైడ్(NH4OH) లో కరుగుతుంది. అలాగే పొటాషియం సైనైడ్ ద్రావణంలో కూడా కరుగుతుంది.కాపర్(I) సల్ఫైడు సంయోగ పదార్థం, సల్ఫ్యూరిక్‌ఆమ్లం, నైట్రిక్ ఆమ్లాలలో వియోగం చెందుతుంది. కాపర్(I) సల్ఫైడు దహనచర్యలో పాల్గొనదు. దహనశీలి కాదు.
అణు నిర్మాణం
మార్చుకాపర్(I) సల్ఫైడ్ అణువు రెండురకాల మోనోక్లినిక్ రూపాలను కలిగి ఉంది. అందులో ఒకటి తక్కువ ఉష్ణోగ్రతవద్ద, 96 రాగి పరమాణువులను ఒక యూనిట్‌సెల్ (unit cell) లో కలిగిన సంక్లిష్ట నిర్మాణం[4].మరొకటి షట్కోణనిర్మాణంతో, 104°Cకన్న ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద స్థిరత్వంకలిగి ఉంది.
ఉత్పత్తి-రసాయన చర్యలు
మార్చురాగిలోహాన్ని సల్ఫర్‌ఆవిరిలో కాని లేదా హైడ్రోజన్ సల్ఫైడ్‌లో కాని బలంగా వేడి చెయ్యడం వలన కాపర్(I) సల్ఫైడు ఉత్పత్తి అగును.పొడిగా చయ్యబడిన రాగి లోహం, ద్రవస్థితిలో ఉన్న గంధకంతో చురుకుగా వేగంగా చర్య జరిపి కాపర్(I) సల్ఫైడును ఏర్పరచును. గుళికలు లేదా పూసలుగా ఉన్న రాగి లోహం గంధకం/సల్ఫర్‌తో చర్య జరిపి కాపర్(I) సల్ఫైడును ఉత్పత్తికి చెయ్యుటకు ఎక్కువ ఉష్ణోగ్రతవద్ద రసాయనిక చర్య జరుపవలసి ఉన్నది.[5]
కాపర్(I) సల్ఫైడుఆక్సిజన్‌తో రసాయనచర్యకు లోనుకావటం వలన కాపర్‌ఆక్సైడ్, సల్ఫర్‌డయాక్సైడ్ ఏర్పడును.[6]
- 2Cu2S + 3O2 → 2Cu2O + 2SO2
కాపర్ (I) సల్ఫైడ్ నుండి రాగిని ఉత్పత్తిచెయ్యు ప్రక్రియలో మూడు వంతుల్లో రెండు వంతుల(2/3) కాపర్(I) సల్ఫైడ్ పైనపేర్కొన్న విధంగా ఆక్సీకరణచెంది కాపర్‌ఆక్సైడ్‌ను ఏర్పరచును. ఏర్పడిన కాపర్ ఆక్సైడ్, కాపర్(I) సల్ఫైడ్‌తో చర్య జరపడం వలన రాగి, సల్ఫర్‌డయాక్సైడ్ ఉత్పత్తి అగును.[6]
- Cu2S + 2 Cu2O → 6 Cu + SO2
ఇవికూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Patnaik, Pradyot (2002). Handbook of Inorganic Chemicals. McGraw-Hill, ISBN 0-07-049439-8
- ↑ మూస:Greenwood&Earnshaw1st
- ↑ Potter, R. W. (1977). "An electrochemical investigation of the system copper-sulfur". Economic Geology. 72 (8): 1524–1542. doi:10.2113/gsecongeo.72.8.1524.
- ↑ Evans, H. T. (1979). "Djurleite (Cu1.94S) and Low Chalcocite (Cu2S): New Crystal Structure Studies". Science. 203 (4378): 356–8. doi:10.1126/science.203.4378.356. PMID 17772445.
- ↑ Blachnik R., Müller A. (2000). "The formation of Cu2S from the elements I. Copper used in form of powders". Thermochimica Acta. 361: 31. doi:10.1016/S0040-6031(00)00545-1.
- ↑ 6.0 6.1 Wiberg, Egon and Holleman, Arnold Frederick (2001) Inorganic Chemistry, Elsevier ISBN 0-12-352651-5