కార్టోశాట్-2B ఉపగ్రహం

(కార్టోశాట్-2B నుండి దారిమార్పు చెందింది)

కార్టోశాట్-2B ఉపగ్రహం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన భూస్వరూపఅధ్యాయన ఉపగ్రహం.ముఖ్యంగా భారతదేశం యొక్క భూభాగాల పటచిత్రణ/రూపకల్పనకై నిర్దేశించి ప్రయోగించిన ఉపగ్రహం.ఇస్రో రూపొందించిన కార్టోశాట్ ఉపగ్రహాల శ్రేణిలో ఇది నాల్గవ ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములో సూర్యసమస్థితి కక్ష్య (sun-synchronous orbit) లో కనిష్ఠఎత్తు భూకక్ష్యలో తిరిగేలా ప్రవేశ పెట్టారు. ఈ ఉపగ్రహం ఇస్రోవారు ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్‌శ్రేణి క్రింద నిర్మించిన 17 వ ఉపగ్రహం.[4] ఈ ఉపగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీహరికోట లోఉ న్నటువంటి సతీష్ థావన్ మొదటి లాంచ్ ప్యాడ్ నుండి 12జులై సోమవారం, 2010 న అంతరిక్షములోకి పంపారు.[5] ఈ ఉపగ్రహాన్ని అంతరిక్షములో కక్ష్యలో ప్రవేశ పెట్టుటకై PSLV శ్రేణికి చెందిన PSLV–C15అను ఉపగ్రహ వాహక నౌకను ఉపయోగించారు.

Cartosat-2B
మిషన్ రకంEarth observation
ఆపరేటర్ISRO
COSPAR ID2010-035A Edit this at Wikidata
SATCAT no.36795
మిషన్ వ్యవధి5 years
అంతరిక్ష నౌక లక్షణాలు
లాంచ్ ద్రవ్యరాశి690 కిలోగ్రాములు (1,520 పౌ.)[1]
శక్తి930 watts
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ12 July 2010, 03:52 (2010-07-12UTC03:52Z) UTC[2]
రాకెట్PSLV-CA (s/n C15)
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం FLP
కాంట్రాక్టర్ISRO
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Low Earth[1]
Perigee altitude629 కిలోమీటర్లు (391 మై.)
Apogee altitude651 కిలోమీటర్లు (405 మై.)
వాలు97.89 degrees
వ్యవధి97.38 minutes
మీన్ మోషన్14.78
పునరావృత వ్యవధి4 days
ఎపోచ్25 December 2013, 12:27:56 UTC[3]
Main camera
తరంగ దైర్ఘ్యములు0.5 – 0.85 micrometre
రిజల్యూషన్Less than 1 metre
 

ఈ ఉపగ్రహంతోపాటు,116 కిలోల బరువుఉన్న అల్జేరియాన్ ఉపగ్రహాన్ని,, కెనడా, స్విట్జర్లాండ్‌కు చెందిన ఒక్కొక్క నానో ఉపగ్రహాన్ని, StudSat అను పికో ఉపగ్రహాన్ని కుడా ఏకకాలంలో అంతరిక్షములో నిర్దేశించిన కక్ష్యలో విజయ వంతంగా ప్రవేశపెట్టారు.

ఉపగ్రహ వివరాలు

మార్చు

ఉపగ్రహంబరువు 694కిలోలు.ఉపగ్రహం సమాచారాన్ని పంపించు నిర్దేశించిన జీవిత కాలం 5 సంవత్సరాలు.ఉపగ్రహంయొక్క ఆన్‌బోర్డ్ పవర్ 930 watts.ఉపగ్రహ పెరిజీ 629 కిలోమీటర్లు, అపోజీ 651 కిలోమీటర్లు. వాలుతలం 97.89 డిగ్రీలు.ఆవర్తన కాలం 97.38 నిమిషాలు. ఈ ఉపగ్రహంలో ఒక పాన్ క్రోమాటిక్ (PAN) కెమారాను అమర్చారు. ఉపగ్రహంలో అమర్చిన పాన్‌క్రోమాటిక్ కెమరా విద్యుదయస్కాంత వర్ణపటం యొక్క కనిపించే ప్రాంతంలో భూమియొక్క నలుపు, తెలుపు చిత్రాలు చిత్రికరించగలదు.కెమరా తరంగపొడవు 0.5 – 0.85 మైక్రో మీటర్లు, రెజల్యుసన్ 1 మీటరుకన్న తక్కువ.కార్టోశాట్-2B ఉపగ్రహం 26 డిగ్రీల కోణంలో అటు ఇటు తిరుగలదు.ఈ ఉపగ్రహ ప్రదక్షిణలను, పనితీరును బెంగలూరు లోఉన్న స్పేస్ క్రాఫ్ట్ కంట్రోల్ కేంద్రము, దానితో నెట్‌వర్క్ అనుబంధమున్నలక్నో, మారిటస్, రష్యాలోని బేర్ స్లాక్, ఇండోనేషియా లోని భయాక్, నార్వే లోని స్వల్బార్డ్ నెట్‌వర్కు కేంద్రాల సహకారంతో పర్యవేక్షణచేస్తుంది

ఉపగ్రహం సాంకేతిక సమాచారపట్టిక'[6]

ప్రయోగ ఉద్దేశం రిమోట్ సెన్సింగ్
బరువు 694 kg కిలోలు
పవర్ 900 Watts
స్థిరీకరణ 3 - axis body stabilised using high torque reaction wheels,
magnetic torquers and thrusters
పేలోడ్ Panchromatic కెమెరా
ప్రయోగ తేది 2010 జూలై 12
ప్రయోగ వేదిక SHAR కేంద్రం, శ్రీహరికోట
ఉపగ్రహ వాహకం PSLV-C15
కక్ష్య 630 కి.మీ ధ్రువ సూర్యసమస్థితి కక్ష్య
Polar Sun Synchronous
ఎటవాలుతలం 97.71º

ఇవికూడా చూడండి

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "CARTOSAT - 2A". Archived from the original on 2008-04-30. Retrieved 2015-09-03.
  2. McDowell, Jonathan. "Launch Log". Jonathan's Space Page. Retrieved 25 December 2013.
  3. "CARTOSAT 2B Satellite details 2010-035A NORAD 36795". N2YO. 25 December 2013. Retrieved 25 December 2013.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-21. Retrieved 2015-09-03.
  5. "ISRO to launch more satellites this year". The Times Of India. 12 Jul 2010. Archived from the original on 15 జూలై 2010. Retrieved 12 Jul 2010.
  6. "CARTOSAT - 2B". isro.gov.in. Archived from the original on 2017-06-12. Retrieved 2015-09-03.