కాలం మారింది (1965 సినిమా)
కాలం మారింది 1966, డిసెంబర్ 9న విడుదలైన తమిళ అనువాద చలనచిత్రం.[1]
కాలం మారింది (1965 తెలుగు సినిమా) | |
నిర్మాణ సంస్థ | ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ |
---|---|
భాష | తెలుగు |
కథ
మార్చుమాణిక్యం చేపలు పట్టుకునే ఒక చిన్న బృందానికి నాయకుడు. అదే ఊర్లో అలయప్పన్ నేతృత్వంలో నడిచే మరో వ్యతిరేక వర్గం ఉంటుంది. వీరిద్దరి మధ్య తగవులు జరుగుతూ ఉంటాయి. మాణిక్యం సుగుణాలు కలిగిన వాడు కాగా అలయప్పన్ దురాశ కలిగినవాడు. మాణిక్యం తండ్రి ఆ రెండు వర్గాల మధ్య గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ వైరి వర్గం వారు అతన్ని చంపేస్తారు. మాణిక్యం తన తండ్రి ఆశయం నెరవేర్చడం కోసం కృషి చేస్తుంతాడు. అతనికి పెద్ద అడ్డండి ఆ ఊరి జమీందారు నీలమగన్. అతను వారి మధ్య గొడవలు పెంచి పోషిస్తూ మధ్యలో తాను లాభపడుతూ ఉంటాడు.
మాణిక్యం అలయప్పన్ కూతురు ప్రేమలో పడతాడు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. కానీ వారి సామాజికవర్గం అందుకు అంగీకరించదు. మాణిక్యం అలయప్పన్ తో సంధి కుదుర్చుకోవడానికి వెళతాడు. కానీ అతను మాణిక్యాన్ని చచ్చేట్లు కొడతాడు. దాంతో మాణిక్యం మనుషులు అలయప్పన్ ని చంపబోగా ఒక అనామక వృద్ధుడు వచ్చి అడ్డుకుంటాడు. అతను నిజానికి అందరూ చనిపోయినట్లుగా భావిస్తున్న మాణిక్యమే. మారువేషంలో ఉండటంతో అతన్ని ఎవరూ గుర్తు పట్టలేరు. నీలమగన్ కూడా అలయప్పన్ కూతుర్నే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు. అలయప్పన్ కూడా అందుకు ఎదురుచెప్పలేకపోతాడు. ఆమె అందుకు అంగీకరించకపోతే తన బంగళాలో ఆమెను బంధిస్తాడు. మారువేషంలో ఉన్న మాణిక్యం కూడా ఆమెను కాపాడలేకపోతాడు. అప్పుడు నీలమగన్ భార్య ఆమెను తప్పిస్తుంది. నీలమగన్ భార్యను చంపి అలయప్పన్ కూతురు వెంటపడగా గ్రామస్థులు అడ్డుపడతారు. అదే సమయానికి పోలీసులు వచ్చి భార్య హత్య కేసులో అతన్ని నిర్బంధిస్తారు. అలయప్పన్ తన తప్పులు తెలుసుకుని తన కూతుర్ని మాణిక్యానికిచ్చి పెళ్ళి చేయడంతో కథ ముగుస్తుంది.
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: టి.ప్రకాశరావు
- సంగీతం:
- నిర్మాణ సంస్థ: ఈస్ట్ ఇండియా ఫిలిం కంపెనీ
మూలాలు
మార్చు- ↑ మద్రాసు ఫిలిం డైరీ. 1966-97లో విడుదలైన చిత్రలు (కళా ప్రింటర్స్ ed.). గోటేటి బుక్స్. p. 19.