మనోరమ (నటి)
మనోరమ (ఆంగ్లం: Manorama; born Gopishantha తమిళం: கோபிசாந்தா) (మే 26, 1937 - అక్టోబరు 11, 2015) సుప్రసిద్ధ దక్షిణ భారత సినిమా నటీమణి. ఈమె సుమారు 1500 సినిమాలు, 1000 నాటక ప్రదర్శనలు ఇచ్చింది. ఈమె ఎక్కువగా తమిళ భాషలో ఎక్కువగా నటించింది.[2] ఈమె కొన్ని మలయాళం, తెలుగు, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో కూడా నటించింది. ఈమెను అభిమానులు ఆచి (Aachi) అని ప్రేమగా పిలుస్తారు.[3][4]
మనోరమ Manorama [மனோரமா] | |
---|---|
జననం | Gopishantha Kasi Clockudaiyar మే 26, 1937 |
మరణం | అక్టోబర్ 11, 2015 |
ఇతర పేర్లు | ఆచి (Aachi) |
వృత్తి | రంగస్థల, సినిమా, టి.వి. నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1958 –2013 |
పిల్లలు | భూపతి |
1987లో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలలో నటించిన సినీ నటిగా ఈమె గిన్నీస్ బుక్లో స్థానం సంపాదించింది. ఈ రికార్డు 2009 వరకూ ఎవరూ అధిగమించలేదు. మనోరమ ఐదుగురు ముఖ్యమంత్రులతో కలిసి నటించారు. తమిళనాడు సీఎం జయలలిత, మాజీ సీఎంలు అణ్ణా దురై, ఎం.జి.రామచంద్రన్, కరుణానిధితో పాటు నందమూరి తారక రామారావుతో కలిసి నటించారు.
హీరోలైన శివాజీ గణేశన్, రజనీకాంత్, కమల్ హాసన్తో కలిసి నటించారు. 1958లో తమిళంలో మాలఇట్టామంగై చిత్రంతో మనోరమ తెరంగ్రేటం చేశారు. ఇక చివరి చిత్రం సింగం-2.
జననం
మార్చుమనోరమ 1937, మే 26 న తమిళనాడు లోని మన్నార్‌గుడిలో జన్మించారు. ఈవిడ అసలు పేరు గోపిశాంత.
అవార్డులు
మార్చు- 1988 : ఉత్తమ సహాయనటిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారం
- 2002 : పద్మశ్రీ పురస్కారం
- కళైమామణి పురస్కారం
నటించిన తెలుగు సినిమాలు
మార్చు- ఎవరాస్త్రీ? (1966)
- బొమ్మలాట (1970)
- భద్రకాళి (1976)
- శుభోదయం (1980)
- కాళి (1980)
- విచిత్ర సోదరులు (1989) - మునియమ్మ
- మా ఇంటి కృష్ణుడు (1990)
- మైఖేల్ మదన కామరాజు (1991) - గంగాబాయి
- అల్లరి ప్రియుడు (1993)
- కుంతీ పుత్రుడు (1993)
- జంటిల్ మేన్ (1993) - అర్జున్ తల్లి
- బొబ్బిలి రాయుడు (1994)
- యమలవ్ (1995)
- రిక్షావోడు (1995) - బామ్మ
- ప్రేయసి (1996)
- సింహం (1997)
- సాంబయ్య (1999)
- మా ఆయన సుందరయ్య (2001)
- బావ నచ్చాడు (2001) - భానుపతి
- ధీరుడు (2006)
- కృష్ణార్జున (2008)
- అరుంధతి (2009) - చంద్రమ్మ
- యముడు (2010) - మల్లికార్జున తల్లి
- అరుణాచలం
మరణం
మార్చుగత కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న ఆమె చెన్నై లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, అక్టోబర్ 11 న తుదిశ్వాస విడిచారు.
మూలాలు
మార్చు- ↑ There’s no stopping her[permanent dead link]. Hinduonnet. 2009/02/02
- ↑ "The endearing `aachi'". The Hindu. 2003-07-07. Archived from the original on 2003-12-30. Retrieved 2010-05-26.
- ↑ "The Hindu : The endearing `aachi'". Hinduonnet.com. 2003-07-07. Retrieved 2010-05-26.[permanent dead link]
- ↑ ‘Comedy is big responsibility’ Archived 2008-02-24 at the Wayback Machine. Hinduonnet. 10/08/2007