కాలయవనుడు

కృష్ణుడికి వ్యతిరేకంగా మూడు మిలియన్ల యవనాల సైన్యంతో మధురపై దాడి చేసిన రాజు.
(కాలయవనుఁడు నుండి దారిమార్పు చెందింది)

కాలయవనుడుముచుకుందుడు కృష్ణుడికి వ్యతిరేకంగా మూడుకోట్ల మంది మ్లేచ్ఛసైన్యంతో మధురపై దాడి చేసిన రాజు. పెద్ద జడతో నల్లగా ఉండే కాలయవుడికి యాదవులు ఎవరూ కూడా తనని చంపలేని ఒక వరం ఉంది.నారద మహర్షి మాట విని శ్రీకృష్ణుని మధుర పైకి యుద్ధానికి వస్తున్నాడు అని తెలుసుకున్న శ్రీకృష్ణుడు జరాసంధుని తో యుద్ధం ముగించుకుని అంతలోనే కాలమును యుద్ధం ప్రజలకు నష్టం కలిగిస్తుందని విశ్వకర్మ ను పిలిపించి సముద్రగర్భంలో పన్నెండు ఆమడల వెడల్పు తో ద్వారకా నగరాన్ని నిర్మాణం చేయిస్తాడు ద్వారకకు కాపలాగా బలరాముడిని ఉంచి తను మధుర నగరానికి చేరుకుంటాడు అంతలోనే కాలయవనుడు నిరాయుధుడైన శ్రీకృష్ణపరమాత్ముని చూసి వీడేనా యాదవ రాజు అని వెంట పడడంతో శ్రీకృష్ణుడు పరుగులు తీస్తాడు పరుగుతీసి ఒక గుహ లోకి వెళతాడు గుహలో గాఢ నిద్ర లో ఉన్నటువంటి ముచికుందుని చూసి యాదవుడు అని అనుమానంతో కాలిపై తంతాడు ముచుకుందుడు నిద్రనుండి లేచి కళ్ళు తెరవగా ఆ కళ్ళ నుండి అగ్ని దారులు బయటికొచ్చి కాలయవనుడు కాలి బూడిదై పోతాడుఅయిపోతాడు ముచుకుందుడు మాంధాత కుమారుడు సూర్య వంశానికి చెందిన వాడు అయితే దేవతలకు యుద్ధంలో సహాయం చేసి అలసిపోతాడు దేవతలు ముచుకుందా నీవు మాకు బాగా సహాయం చేశావు ఏమైనా వరం కోరుకో అని అంటారు ముచికుందుడు నేను బాగా అలసిపోయాను నాకు నిద్ర పోవడానికి మంచి చోటు కావాలి అని కొడతాడు దానికి ఇంద్రుడు నీకు బాగా నిద్ర వస్తుంది నిన్ను ఎవడైతే నిద్రలో నుండి లేపుతాడో వాడు నీ కళ్ళలో నుండి వచ్చే మంటలో దగ్దమై పోతాడు అని వరము ఇస్తాడు చూడు: పూర్వగాథాలహరి.

కాలయవనుడు
సమాచారం
తండ్రిగర్గ్యుడు[1]

యాదవుల కుల గురువుతో జరిగిన పండిత చర్చలో ఓడిపోయిన మగధ రాజు గర్గ్యుడు 12ఏళ్ళపాటు తపస్సు చేసి, శివుడి అనుగ్రహంతో ఏ యాదవ వీరుడి చేతిలోనూ ఓడిపోని కొడుకుని కన్నాడు. పెరిగి పెద్దవాడైన కాలయవనుడు తన తండ్రి పగ గురించి తెలుసుకుని, యాదవులపై పగతీర్చుకోవాలనకుంటాడు.

దండయాత్ర

మార్చు

కంసుని బావ మగధ పాలకుడు జరాసంధుడు, మధుర నగరంపై పదిహేడుసార్లు దాడిచేసిన ప్రతిసారీ కృష్ణుడి చేతిలో ఓడిపోతాడు. కృష్ణుడిని ఒంటరిగా ఓడించలేకపోయిన జరాసంధుడు, కాలయవనుడి మద్దతు కోరుతాడు. బలవంతుడైన కాలయవనుడు తాను యుద్ధంలో ఓడిపోకుండా బ్రహ్మ చేత వరం పొంది ఉన్నాడు.[2]

తనకున్న వరం గురించి నారదుడు ఉపదేశించగా కాలయవనుడు మధురపై దండెత్తివచ్చాడు. అప్పుడు కృష్ణుడు విశ్వకర్మ సహాయంతో సముద్రం మధ్యలో ద్వారకాపురిని కట్టించి, మధుర ప్రజలను అక్కడికి చేర్చాడు.[3] తాను నిరాయుధుడై యుద్ధానికి సవాలు విసిరి కాలయవనుడిని రెచ్చగొట్టి, కృష్ణుడు వ్యూహాత్మకంగా యుద్ధభూమి నుండి పారిపోయి ఒక పురాతన గుహలోకి చేరుకున్నాడు. ఆ గుహలో... రాక్షసులతో జరిగిన యుద్ధంలో దేవతలకు సహాయం చేసిన తరువాత వేల సంవత్సరాల తీవ్ర నిద్రలో ఉన్న త్రేతాయుగం నాటి రాజు, శ్రీరాముడి పూర్వీకులలో ఒకరైన ముచికుందుడు ఉన్నాడు. ఎవరైనా తన నిద్రకు భంగం కలిగిస్తే వారిని వెంటనే తన కంటితో భస్మం చేసేలా ఇంద్రుడి చేత వరం పొంది ఉన్నాడు. గుహ లోపల లోతైన చీకటిలో కృష్ణుడు, ముచికుందుడిపై తన శాలువతో కప్పుతాడు. గుహలో పడుకున్న ముచికుందుడిని చూసి కృష్ణుడిగా భావించిన కాలయవనుడు కాలితో తన్ని నిద్రాభంగం చేయగా, ముచికుందుడు కళ్ళు తెరిచి కాలయవనుడిని భస్మం చేస్తాడు.[2] కాలయవనుడు భస్మమైన స్థలాన్ని నేటి గుజరాత్ రాష్ట్రంలోని గిర్నార్ గా పిలుస్తున్నారు.

మూలాలు

మార్చు
  1. "Story of Krishna and Kalayavana - Part 1". Archived from the original on 30 జూన్ 2020. Retrieved 29 జూన్ 2020.
  2. 2.0 2.1 "HARIVAMSHAM (GEETA PRESS)". mahabharata-resources.org. Archived from the original on 2020-02-17. Retrieved 2020-06-29.
  3. "THE KRISHNA AVATĀRA". sacred-texts.com.