కాల యవనుడు నారదుని ఉపదేశమున మధురపై దండు ఎత్తిరాగా, కృష్ణుఁడు విశ్వకర్మ వలన సముద్ర మధ్యమున ద్వారకాపురిని కట్టించి అందు మధురాపుర జనులను అందఱను చేర్చి తాను నిరాయుధుడై పురము వెలువడి ముచికుందుడు నిద్రించుచు ఉండిన పర్వతగహమునకు పరుగెత్తెను. కాలయవనుడు అతనిని తఱుముకొని పోయి ఆగహలోనికి దూఱి అందు నిద్రించు ముచుకుందుని కృష్ణుడు అని తలచి తన్నగా అతడు మేల్కని వాని చూడ వాడు భస్మము అయ్యెను.

ఒకప్పుడు సాల్వుడు గార్గ్యుని షండుడు అని పలుకఁగా యాదవులు అందఱు వాని చూచి నవ్విరి. అందుమీఁద ఆగార్గ్యుడు లోహచూర్ణము భుజించుచు పండ్రెండేండ్లు అత్యుగ్రము అగు తపము ఆచరించి కాలయవనుని పుట్టించినట్లుపురాణాలలో చెప్పఁబడి ఉన్నది.

మూలాలుసవరించు

"https://te.wikipedia.org/w/index.php?title=కాలయవనుడు&oldid=2424640" నుండి వెలికితీశారు