కాల్వ వెంకటేశ్వర్లు

కాల్వ వెంకటేశ్వర్లు ప్రఖ్యాత ఆధ్యాత్మికవేత్త,రచయిత,నటుడు,చిత్రకారుడు.నరసరావుపేట సొంతఊరు.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం శివారు గంజివారిపల్లి లో జన్మించారు.ఆధ్యాత్మికమణిమాల అనే గ్రంధాన్ని ప్రశ్నోత్త్రర రూపంలో రచించారు.

కాల్వ వెంకటేశ్వర్లు
వృత్తిఆధ్యాత్మికవేత్త,రచయిత,నటుడు,చిత్రకారుడు
ప్రసిద్ధిఆధ్యాత్మికవేత్త,రచయిత,నటుడు,చిత్రకారుడు
మతంహిందు.

భావాలు మార్చు

  • చేయదగిన కార్యములను ఫలాపేక్షలేకుండ చేయువాడే సన్యాసి అంతియే కాని కేవలము అగ్నిహోత్రమును వదలినవాడుకాదు. మఱియు అట్టి లక్షణముగలవాడే యోగి, అంతియేకాని కేవలము కర్మలను త్యజించిన వాడుకాడు.
  • సమస్త భూత కోట్ల యందు భగవంతుని, భగవంతుని యందు సమస్త భూత కోట్లను గాంచు వానికి భగవానుడు తప్పక గోచరించును. మఱియు భగదృష్టికిని అట్టి వాడు తప్పక గోచరించును.
  • 1. దైవకార్యముల నాచరించువాడు. 2. దైవమునే పరమప్రాప్యముగా నెంచువాడు, దైవ తత్పరుడై యుండు వాడు. 3. దైవ భక్తుడు 4. సంగరహితుడు 5. సర్వభూత దయగలవాడు, ఇట్టివాడు భగవంతుని పొందగలడు. భగవంతుని అనన్య భక్తిచే తెలిసికొనుట ‘‘జ్ఞాతుం’’ అనబడును. భగవంతుని దర్శించుట - ‘‘ద్రష్టుం’’ అనబడును. భగవంతుని యందు ప్రవేశించుట ‘‘ప్రవేష్టుం’’ అనబడును. ఇందు మొదటిది ద్వైతము, రెండువది విశిష్టాద్వైతము మూడవది ‘‘పూర్ణ అద్వైతము’’ పైన దెల్పిన మూడు స్థితులలో మొదటది సామాప్యము రెండవది సారూప్యము, మూడవది సాయుజ్యము.
  • మొత్తము ముప్పది యైదు సద్గుణములు చెప్పబడెను. అవిక్రమముగ 1. ఏప్రాణి నిద్వేషింపకుండుట 2. మైత్రి 3. కరుణ 4. మమత్వములేకుండుట 5. అహంకారము లేకుండుట 6. సుఖ దుఃఖము లందు సమత్వము 7. ఓర్పు 8. సత్యసంతుష్టి 9. మనోనిగ్రహము 10. ధృడ నిశ్చయము 11. మనోబుద్ధులను భగవంతునకు సమర్పించుట 12.లోకము వలన తానుగాని, తనవలన లోకముగాని భయపడకుండుట 13. హర్షము, క్రోధము, భయము లేకుండుట 14. దేని యందును అపేక్ష లేకుండుట 15. శుచిత్వముగలిగి యుండుట 16. కార్యసామర్థ్యము 17. తటస్థత్వము 18. మనోవ్యాకులత్వము లేకుండుట 19. సర్వకర్మ (ఫల) పరిత్యాగము 20. హర్షము లేకుండుట 21. ద్వేషము లేకుండుట 22. శోకములేకుండుట 23. కోరిక లేకుండుట 24. శుభాశుభ పరిత్యాగము 25. శత్రు మిత్రులందు సమత్వము 26. మానావమాసములందు సమభావము 27. శీతోష్ణములందు సమత్వము 28. సుఖ దుఃఖములందు సమభావము 29. సంగవర్జిత్వము 30. నిందా స్తుతులందు సమత్వము 31. మోనము 32. దొరికిన దానితో సంతుష్టి 33. నివాసము నందభిమానము లేకుండుట. 34. స్థిర బుద్ధి 35. భగవంతుని యందు భక్తి.
  • జ్ఞాన గుణములు ఇరువది. అవి క్రమముగ 1. తన్ను తాను పొగడు కొనకుండుట 2. డంబము లేకుండుట 3. పరప్రాణులను హింసింప కుండుట 4. ఓర్పుకలిగి యుండుట 5. ఋజుత్వముగలిగి యుండుట 6. గురుసేవచేయుట, 7. బాహ్యాభ్యంతర శుద్ధిగలిగి యుండుట 8. సన్మార్గమున స్ధిరముగా నిలబడుట 9. మనస్సును బాగుగ నిగ్రహించుట 10. ఇంద్రియ విషయములందు విరక్తి గలిగి యుండుట 11. అహంకారము లేకుండుట 12.పుట్టుక, చావు, ముసలితనము రోగము అనువానివలన గలుగు దుఃఖమును దోషమును మాటిమాటికి స్మరించుట 13. కొడుకులు (సంతానము) భార్య, యిల్లు-మున్నగు వాని యందు ఆసక్తి లేకుండుట. 15. ఇష్టానిష్టములు కలిగినపుడెల్లపుడును సమబుద్ది గలిగి యుండుట 16. భగవంతుని యందు అనన్యభక్తి గలిగియుండుట. 17. ఏకాంత ప్రదేశము నాశ్రయించుట. 18. జన సముదాయమునందు ప్రీతి లేకుండుట. 19. నిరంతరము ఆద్యాత్మజ్ఞానము గలిగియుండుట. 20. తత్వజ్ఞానము యొక్క గొప్ప ప్రయోజనమును తెలిసికొనుట.
  • 1. భయరాహిత్యము 2. చిత్తశుద్ధి 3. జ్ఞానయోగిత్వము 4. ధ్యానము 5. బాహ్యేంద్రియని గ్రహము 6. (జ్ఞాన) యజ్ఞము 7. శాస్త్రధ్యయనము 8. జ్ఞాన (తపస్సు) 9. ఋజుత్వము 10. అహింస 11. సత్యము 12. క్రోదరాహితము 13. త్యాగము 14. శాంతి 15. కొండెములు చెప్పకుండుట 16. భూతదయ 17. విషయ లోలత్యము లేకుండుట 18. మృధుత్వము 19. సిగ్గు 20. చపలత్వము లేకుండుట 21. ప్రతిభ బ్రహ్మ తేజస్సు 22. ఓర్పు 23. ధైర్యము 24. శుచిత్వము 25. ద్రోహబుద్థి లేకుండుట 26. అభిమాన రాహిత్యము ఈసద్గుణములే దైవీసంపదయన బడును.

బాల్యం మార్చు

విద్య మార్చు

వృత్తి మార్చు

రచనలు మార్చు

పుస్తకాలు మార్చు

రచన శైలి మార్చు

ఉదాహరణలు మార్చు

సాహిత్య సేవ మార్చు

పురస్కారాలు, గౌరవాలు, బిరుదులు మార్చు

ములాలు మార్చు

బయటి లింకులు మార్చు