కాల్షియం క్రోమేట్

(కాల్సియం క్రోమేట్ నుండి దారిమార్పు చెందింది)

కాల్సియం క్రోమేట్ఒక రసాయన సంయోగపదార్థం.ఇది ఒక అకర్బన రసాయన సమ్మేళనం. కాల్సియం, క్రోమియం,, ఆక్సిజన్ మూలక పరమాణు సంయోగం వలన కాల్సియం క్రోమేట్ సంయోగ పదార్థం ఏర్పడును.ఈ రసాయన పదార్థం యొక్క సంకేత పదం CaCrO4.

కాల్సియం క్రోమేట్

కాల్సియం క్రోమేట్

Calcium chromate dihydrate
పేర్లు
IUPAC నామము
Calcium dioxido-dioxo-chromium
ఇతర పేర్లు
Calcium chromate (VI)
Calcium monochromate
Calcium Chrome Yellow
C. I. Pigment Yellow 33
Gelbin
Yellow Ultramarine
గుర్తింపు విషయాలు
సి.ఎ.ఎస్. సంఖ్య [13765-19-0]
పబ్ కెమ్ 26264
యూరోపియన్ కమిషన్ సంఖ్య 237-66-8
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య GB2750000
SMILES [Ca+2].[O-][Cr]([O-])(=O)=O
  • InChI=1/Ca.Cr.4O/q+2;;;;2*-1/rCa.CrO4/c;2-1(3,4)5/q+2;-2

ధర్మములు
CaCrO4
మోలార్ ద్రవ్యరాశి 156.072 g/mol
స్వరూపం bright yellow powder
సాంద్రత 3.12 g/cm3
ద్రవీభవన స్థానం 2,710 °C (4,910 °F; 2,980 K)
anhydrous
4.5 g/100 mL (0 °C)
2.25 g/100 mL (20 °C)
dihydrate
16.3 g/100mL (20 °C)
18.2 g/100mL (40 °C)
ద్రావణీయత soluble in acid
practically insoluble in alcohol
నిర్మాణం
స్ఫటిక నిర్మాణం
monoclinic
సంబంధిత సమ్మేళనాలు
ఇతరఅయాన్లు {{{value}}}
ఇతర కాటయాన్లు
Beryllium chromate
Magnesium chromate
Strontium chromate
Barium chromate
Radium chromate
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

భౌతిక లక్షణాలు

మార్చు

కాల్సియం క్రోమేట్ ఒక ఘనపదార్థం. ప్రకాశవంతమైన పసుపు వర్ణపు ఘనపదార్థం. కాల్సియం క్రోమేట్ సాధారణంగా సార్ద్ర/జలయోజిత (hydrated),, అనార్ద్ర/నిర్జల (anhydrous) రూపాలలో లభిస్తుంది.సార్ద్ర స్థితి అయిన రెండు జలాణువులను కలిగిన స్థితిలో లభిస్తుంది.కాల్సియం క్రోమేట్ యొక్క అణుభారం 156.072గ్రాములు/మోల్.

సాంద్రత

మార్చు

సాధారణ ఉష్ణోగ్రత వద్ద (25 °C వద్ద) కాల్సియం క్రోమేట్ సాంద్రత 3.12గ్రాములు/సెం.మీ3.

ద్రవీభవన స్థానం

మార్చు

కాల్సియం క్రోమేట్ సంయోగ పదార్థం యొక్క ద్రవీభవన స్థానం 2,710 °C (4,910 °F; 2,980K).

ద్రావణీయత

మార్చు

కాల్సియం క్రోమేట్ నీటిలో కరుగును.నిర్జల కాల్సియం క్రోమేట్ అయిన 100 మి.లీ నీటిలో 20 °C వద్ద 2.25గ్రాములు కరుగును. ద్విజలాణువులు కలిగిన కాల్సియం క్రోమేట్ 20 °C వద్ద 100 మి.లీ నీటిలో 16.3 గ్రాములు, 40 °C వద్ద 18.2 గ్రాములు కరుగును.ఆమ్లాలలో కరుగును, ఆల్కహాల్లో కరుగదు.

రసాయన ధర్మాలు

మార్చు

సార్ ద్ర కాల్సియం క్రోమేట్ 200 °C వద్ద, తనలోని నీటిని కోల్పోవును.కాల్సియం క్రోమేట్ సేంద్రియపదార్థాలతో లేదా క్షయికరణ కారకాలతో చర్యచెంది క్రోమియం (III) ను ఏర్పరచును.ఈ ఘనపదార్థం హైడ్రాజీన్తో తీవ్రంగా విస్పోటన స్థాయిలో (explosively) చర్య జరుపును. కాల్సియం క్రోమేట్ ను బోరాన్తో కలిపి, ఏర్పడిన మిశ్రమాన్ని అంటించిన /మండించిన తీవ్రమైన స్వాభావంతో మండును.

ఉపయోగాలు

మార్చు
  • రంగులలో (pigment) ఉపయోగిస్తారు.
  • పదార్థాల క్షయికరణ/తుప్పుపట్టడం/కోత (corrosion inhibitor) నిరోదకం/నివారిణి.
  • ఎలక్ట్రోప్లేటింగు (electroplating) లో ఉపయోగిస్తారు.
  • పెట్రోలియం రసాయనాల ప్రాసెసింగులో ఉపయోగిస్తారు.
  • పారిశ్రామిక వ్యర్ధాల ట్రీట్‌మెంట్‌లో (waste treatment.)

ఇవికూడా చూడండి

మార్చు

ఆధారాలు/మూలాలు

మార్చు