కావలి పురపాలక సంఘం

కావలి పురపాలక సంఘం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరుకు చెందిన మున్సిపాలిటీ. ఇది కావలి పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది. ఈ పురపాలక సంఘం నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలోని, కావలి శాసనసభ నియోజకవర్గం పరిధికి చెందిన పురపాలక సంఘం.

కావలి పురపాలక సంఘం
కావలి
స్థాపన1967
రకంస్థానిక సంస్థలు
చట్టబద్ధతస్థానిక స్వపరిపాలన
కేంద్రీకరణపౌర పరిపాలన
ప్రధాన
కార్యాలయాలు
కావలి
కార్యస్థానం
సేవలుపౌర సౌకర్యాలు
అధికారిక భాషతెలుగు
ప్రధానభాగంపురపాలక సంఘం
జాలగూడుఅధికార వెబ్ సైట్

చరిత్ర

మార్చు

కావలి పురపాలక సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలోని మునిసిపాలిటీ. రాష్ట్ర రాజధానికి అమరావతికి 215 కి.మీ దూరంలో ఉంది.కావలి అంటే తెలుగులో కాపలా అని అర్ధము.ఉదయగిరి రాజు తన సైన్యాన్ని ఇక్కడ మొహరించాడు అందుకే ఆ పేరు వచ్చింది. చెన్నై నుంచి కలకత్తా ప్రధాన రహదారి, రైల్వే మార్గములు కావలి పట్టణం గుండా వెళ్ళడం కావలి అభివృద్ధికి దోహదపడ్డాయి. కావలి వస్త్ర వ్యాపారానికి చాలా పేరు గాంచింది.1967 న 3 వ గ్రేడ్ పురపాలక సంఘంగా స్థాపించబడింది. ప్రస్తుత గ్రేడ్ 2 వ గ్రేడ్ కొనసాగుతుంది.ఈ పురపాలక సంఘంలో 40 ఎన్నికల వార్డులు ఉన్నాయి. దీనికి ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరగాలి. కానీ దీనికి గత పది సంవత్సరాలకి పైనుండి ఎన్నిక జరగలేదు.[1]

జనాభా గణాంకాలు

మార్చు

ఈ పురపాలక సంఘంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 97053 ఉన్నారు.

దశాబ్దాల జనాభా కాలక్రమం

  • 1971 జనాభా లెక్కల ప్రకారం 29616
  • 1981 జనాభా లెక్కల ప్రకారం 48119
  • 1991 జనాభా లెక్కల ప్రకారం 65910
  • 2001 జనాభా లెక్కల ప్రకారం 79682
  • 2011 జనాభా లెక్కల ప్రకారం 97053

ప్రస్తుత చైర్‌పర్సన్, వైస్ చైర్మన్

మార్చు

ప్రస్త్తుత చైర్‌పర్సన్‌గా పోతుగంటి అలేఖ్య పనిచేస్తుంది.[2] వైస్ చైర్మన్‌గా జి. భారతి కుమారి.[2]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

మార్చు
  • భ్రమరాంబ సమేత మల్లీశ్వరస్వామి దేవాలయం.
  • లక్ష్మీకాంతస్వామి దేవాలయం
  • వీరాంజనేయస్వామివారి దేవాలయం

ఇతర వివరాలు

మార్చు

ఈ పురపాలక సంఘంలో 21064 గృహాల ఉన్నారు.40 ఎన్నికల వార్డులు ఉన్నాయి.1 ప్రభుత్వ ఆసుపత్రి, 28 ప్రభుత్వ పాఠశాలు, 6 ఉన్నత పాఠశాలలు, 4 ఉన్నత ప్రాథమిక పాఠశాలలు, 18 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. 2 కూరగాయల మార్కెట్లు, 5 పబ్లిక్ పార్కులు ఉన్నాయి.

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-20. Retrieved 2020-06-28.
  2. 2.0 2.1 "List of Elected Municipal Chairpersons, 2014 (Andhra)" (PDF). State Election Commission. 2014. Archived from the original (PDF) on 6 సెప్టెంబరు 2019. Retrieved 13 May 2016.

వెలుపలి లంకెలు

మార్చు