కాసింబజార్
కాసింబజార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, ముర్షిదాబాద్ జిల్లా, బెర్హంపూర్ పట్టణం లోని శివారు ప్రాంతం.[1]
పేరు
మార్చుఇర్ఫాన్ హబీబ్ ప్రకారం, షాజహాన్ హయాంలో బెంగాల్ సుబాకు ప్రతినిధిగా ఉన్న ఖాసిం ఖాన్ పేరు మీద ఖాసింబజార్ అనే పేరు వచ్చింది.[2] : 44
జనాభా వివరాలు
మార్చు2011 భారత జనాభా లెక్కల ప్రకారం, కాసింబజార్ మొత్తం జనాభా 11,724, అందులో 5,978 (51%) మంది పురుషులు కాగా 5,746 (49%) మంది స్త్రీలు. 0–6 సంవత్సరాల పిల్లల జనాభా 981. కాసిం బజార్‌లో మొత్తం అక్షరాస్యుల సంఖ్య 9,872 (6 సంవత్సరాల కంటే ఎక్కువ జనాభాలో 91.89%). [3]
2001 జనగణన ప్రకారం, కాసిం బజార్ జనాభా 10,175. జనాభాలో పురుషులు 52%, స్త్రీలు 48% ఉన్నారు. కాసిం బజార్ సగటు అక్షరాస్యత రేటు 78%, జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 83% కాగా, స్త్రీల అక్షరాస్యత 72%. కాసిం బజార్ జనాభాలో 9% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.
భౌగోళికం
మార్చు- ↑ "Cossimbazar" in Imperial Gazetteer of India, Oxford, Clarendon Press, 1908–1931 [v. 1, 1909].
- ↑ Habib, Irfan (1982). An Atlas of the Mughal Empire. Oxford University Press. ISBN 0195603796. Retrieved 26 March 2023.
- ↑ "District Census Handbook, Murshidabad, Series 20, Part XII B" (PDF). Rural PCA-C.D. blocks wise Village Primary Census Abstract, location no. 315444, page 32-33. Directorate of Census Operations West Bengal. Archived (PDF) from the original on 28 June 2021. Retrieved 5 July 2021.
5miles
నది
నది
నది
నది
స్థానం
మార్చుకాసింబజార్ 24°07′N 88°17′E / 24.12°N 88.28°E.[1] వద్ద సముద్రమట్టానికి 17 మీటర్ల ఎత్తున ఉంది.
ప్రాంతం అవలోకనం
మార్చుమ్యాప్లో చూపిన ప్రాంతం, బెర్హంపూర్, కండి ఉపవిభాగాలను కవర్ చేస్తుంది. ఇది జిల్లాలోని సహజ భౌతిక ప్రాంతాలైన రార్హ్, బాగ్రీ రెండింటిలోనూ విస్తరించి ఉంది.[2][3] ముర్షిదాబాద్ జిల్లా ముఖ్యపట్టణమైన బెర్హంపూర్ ఈ ప్రాంతం లోనే ఉంది.[4] బెంగాల్‌ను 7వ శతాబ్దంలో పాలించిన మొదటి ముఖ్యమైన రాజు శశాంకుడీ రాజధాని కర్ణసుబర్ణ శిధిలాలు బెర్హంపూర్ నుండి నైరుతి దిశలో 9.6 కిలోమీటర్లు (6.0 మై.) దూరంలో ఉన్నాయి.[5][6][7] జనాభాలో 80% పైగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.[8]
చరిత్ర
మార్చు17వ శతాబ్దానికి పూర్వం ఈ ప్రదేశం చరిత్రను గుర్తించలేనప్పటికీ, ముర్షిదాబాద్ స్థాపనకు చాలా కాలం ముందే దీనికి చాలా ప్రాముఖ్యత ఉండేది. మొదటి ఐరోపా వ్యాపారులు ఇక్కడ కర్మాగారాలను స్థాపించారు. సరస్వతీ నది ముఖద్వారంలో ఇసుక మేట వేసిన కారణంగా సత్గావ్ నాశనమైన తరువాత, దీనికి బెంగాలులో గొప్ప వాణిజ్య కేంద్రంగా ప్రాముఖ్యత వచ్చింది. ఇది కలకత్తాకు పునాది పడేవరకు దానికి ఆ ప్రాముఖ్యత ఉండేది.[9]
ఇంగ్లీషు, డచ్, ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలన్నిటికీ కాసింబజార్‌లో వ్యాపార కేంద్రాలుండేవి. 1658లో ఈస్టిండియా కంపెనీ (EIC) తమ మొదటి ఏజెన్సీని ఇక్కడ స్థాపించారు. 1667లో ఫ్యాక్టరీ అధినేత, కౌన్సిల్‌లో ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మారారు. ఈ కాలానికి చెందిన ఆంగ్ల పత్రాలలో, 19వ శతాబ్దం ప్రారంభం వరకు, హుగ్లీ నదిని "కాసింబజార్ నది" గాను, హుగ్లీ, పద్మ, జలంగిల మధ్య ఉన్న త్రిభుజాకార భూమిని కాసింబజార్ ద్వీపం గానూ వర్ణించారు. ఈ కర్మాగారం బెంగాల్ నవాబుల రాజధాని ముర్షిదాబాద్‌కు సమీపంలో ఉండటం, దాని సంపదకు, దాని రాజకీయ ప్రాముఖ్యతకు ప్రధాన వనరు ఐనప్పటికీ, దీనికి దాడుల ముప్పు ఎల్లప్పుడూ ఉండేది. ఆ విధంగా 1757లో అప్పటి నవాబు సిరాజ్-ఉద్-దౌలా ఆక్రమించిన మొదటి ఈస్టిండియా ఫ్యాక్టరీ; అక్కడి రెసిడెంటు, అతని సహాయకుడైన వారెన్ హేస్టింగ్స్ లను ఖైదీలుగా ముర్షిదాబాద్‌కు తరలించాడు.[9]
కాసింబజార్ మహారాజులకు ఇది ముఖ్యపట్టణం. 1773 నుండి 1785 వరకు బెంగాల్ గవర్నర్ జనరల్‌గా ఉన్న వారెన్ హేస్టింగ్స్ కు అప్పులిచిన వడ్డీ వ్యాపారి కాంత బాబు వారసులే, ఈ మహారాజులు. వీరు కాసింబజార్‌లో చక్కటి రాజభవనాన్ని నిర్మించారు, వీటిలో కొన్ని భాగాలను బెనారస్ మహారాజా చైత్ సింగ్ రాజప్రాసాదం నుండి తీసిన రాతితో నిర్మించారు.[10] మహారాజా సర్ మనీంద్ర చంద్ర నంది (1860-1929) బెంగాల్ పునరుజ్జీవనోద్యమంలో ప్రముఖపాత్ర పోషించిన విద్యా పోషకుడు, దానశీలి.
19వ శతాబ్దం ప్రారంభంలో నగరం మరింత అభివృద్ధి చెందింది; 1811 నాటికి ఇది పట్టులు, అల్లిన వస్తువులు, కోరాలు, అందమైన దంతపు పనులకు ప్రసిద్ధి చెందింది. అయితే, అక్కడి ఆరోగ్యకరమైన వాతావరణం బహుశా స్థానిక మలేరియా కారణంగా, క్రమంగా క్షీణించింది. పట్టణం చుట్టూ సాగుచేసే భూమి విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. వాటిని అడవులు ఆక్రమించాయి. 1813లో హూగ్లీ నది గమనంలో ఆకస్మిక మార్పు రావడంతో పట్టణ పతనం పూర్తయింది. ఈ మార్పు కారణంగా పాత పట్టణం నుండి 3 మైళ్ల దూరంలో ఒక కొత్త నదీ పాయ ఏర్పడింది. పురాతన నౌకాశ్రయాల చుట్టూ దుర్వాసనతో కూడిన చిత్తడిని మిగిలిపోయింది. 1829లో, పట్టణ జనాభా 3,538గా నమోదైంది.[10] దాని అద్భుతమైన భవనాలలో కాసింబజార్ మహారాజు భవనం మాత్రమే మిగిలి ఉంది, మిగిలినవి శిథిలావస్థలో ఉండడమో, మట్టి దిబ్బల లాగా మారిపోవడమో జరిగింది. 1901లో దాని జనాభా కేవలం 1,262. [9]
మౌలిక సదుపాయాలు
మార్చుజిల్లా సెన్సస్ హ్యాండ్‌బుక్, ముర్షిదాబాద్, 2011 ప్రకారం, కాసిం బజార్ 2.78 కి.మీ2 (1.07 చ. మై.) విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ 5 కి.మీ. ల రోడ్లు ఉన్నాయి. రక్షిత నీటి సరఫరాలో ఓవర్ హెడ్ ట్యాంక్, ట్యాంక్/చెరువు/సరస్సు, చేతి పంపు ఉన్నాయి. ఇందులో 2,500 గృహ విద్యుత్ కనెక్షన్లు, 300 రోడ్డు లైటింగ్ పాయింట్లు ఉన్నాయి. 3 మందుల దుకాణాలు ఉన్నాయి. విద్యా సౌకర్యాలలో, 3 ప్రాథమిక పాఠశాలలు, 2 సీనియర్ సెకండరీ పాఠశాలలు, 1 ఇంజనీరింగ్ కళాశాల ఉన్నాయి. 1 గుర్తింపు పొందిన షార్ట్‌హ్యాండ్, టైప్‌రైటింగ్ & వృత్తిపరమైన శిక్షణా సంస్థ కూడా ఇక్కడ ఉంది. జాతీయం చేయబడిన బ్యాంకు శాఖ ఒకటి, ఒక సహకార బ్యాంకు శాఖ ఉన్నాయి.[11]
దర్శనీయ ప్రదేశాలు
మార్చుకాసింబజార్ ఒక చారిత్రిక పట్టణం. ఇది ముర్షిదాబాద్ కంటే ప్రాచీనమైనది. ఇందులో రెండు క్రైస్తవ శ్మశానవాటికలు, ఒక అర్మేనియన్ చర్చి మరియు స్థానిక భూస్వాముల యొక్క రెండు కలోనియల్ శైలి భవనాలు ఉన్నాయి, వాటిలో ఒకటి వారసత్వ హోటల్‌గా మార్చబడింది. 16వ శతాబ్దం మధ్యలో డచ్, ఫ్రెంచ్ మరియు బ్రిటీష్ వారు ఇప్పటికే కాసింబజార్‌లో తమ వర్తక పోస్టులను (తరచుగా ఫ్యాక్టరీలుగా సూచిస్తారు) స్థాపించారు. అర్మేనియన్ల వంటి వర్తక సంఘం కూడా అక్కడ ఉనికిని కలిగి ఉంది. [12]
- డచ్ స్మశానవాటిక: కాసింబజార్ రైల్వే స్టేషన్ పక్కనే డచ్ స్మశానవాటిక ఉంది. ఇందులో ఒకప్పుడు 47 సమాధులుండేవి. అందులో ఈ రోజు వరకు 20 మాత్రమే ఉన్నాయి. పురాతన సమాధి డేనియల్ వాన్ డెర్ ముయ్ మరియు 1721 నాటిది. చాలా సమాధులు ఒబెలిస్క్‌ల శైలిలో ఉన్నాయి, అయితే కొన్ని గోపురాలతో అగ్రస్థానంలో ఉన్నాయి. టామెరస్ కాంటర్ విస్చెర్ యొక్క తెల్లని గోపురం సమాధి ఇతర సమాధులలో ప్రత్యేకంగా ఉంటుంది. [12]
- బ్రిటిష్ శ్మశానవాటిక: ఈ స్మశానవాటిక డచ్ శ్మశానవాటిక కంటే చిన్నది. ఇందులో ప్లాసీ యుద్ధం తర్వాత కాసింబజార్‌లో మరణించిన బ్రిటిష్ అధికారులు మరియు వారి కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి. స్మశానవాటికలో వారెన్ హేస్టింగ్స్ మొదటి భార్య మేరీ మరియు వారి శిశువు కుమార్తె ఎలిజబెత్ సమాధి ఉంది. [12]
- రాయ్ రాజభవనం:
- నంది ప్యాలెస్:
- సెయింట్ మేరీస్ అర్మేనియన్ చర్చి: ఆర్మేనియన్ల ప్రముఖ వర్తక సంఘం కూడా కాసింబజార్‌లో పెద్ద సంఖ్యలో ఉనికిని కలిగి ఉంది. 1758లో ఆర్మేనియన్లు వారి స్వంత చర్చి అయిన సెయింట్ మేరీస్ చర్చ్‌తో ముందుకు వచ్చారు. కాసింబజార్ యొక్క వ్యాపార కార్యకలాపాల పతనం తరువాత, అర్మేనియన్లు తమ చర్చిని విడిచిపెట్టి తమ పట్టణాన్ని విడిచిపెట్టారు. చర్చిలో చివరి ప్రసంగం 1860లో ఇక్కడ జరిగింది. 2005లో, కోల్‌కతాలోని అర్మేనియన్ చర్చి కమిటీ చర్చిని పూర్వ వైభవానికి పునరుద్ధరించింది మరియు క్లాక్ టవర్‌ను కూడా జోడించింది. నేడు చర్చి చక్కగా నిర్వహించబడుతోంది మరియు దాని చుట్టూ చక్కగా నిర్వహించబడే చిన్న తోట ఉంది. [12]
రవాణా
మార్చుCossimbazar is the railway connection of కాసింబజార్, situated on the Sealdah–Lalgola line of the Eastern Railway.
ప్రస్తావనలు
మార్చు- ↑ MSN 2016.
- ↑ "District Census Handbook: Murshidabad, Series 20 Part XII A" (PDF). Physiography, Page 13. Directorate of Census Operations, West Bengal, 2011. Archived (PDF) from the original on 14 November 2016. Retrieved 24 July 2017.
- ↑ "Murshidabad". Geography. Murshidabad district authorities. Archived from the original on 29 August 2017. Retrieved 24 July 2017.
- ↑ "Murshidabad". Murshidabad district authorities. Archived from the original on 29 August 2017. Retrieved 12 September 2017.
- ↑ Ray, Nihar Ranjan, Bangalir Itihas Adi Parba, (in Bengali), 1980 edition, pp. 160-161, Paschim Banga Niraksharata Durikaran Samiti
- ↑ Sengupta, Nitish, History of the Bengali-speaking People, p.25, UBS Publishers’ Distributors Pvt. Ltd.
- ↑ Majumdar, Dr. R.C., History of Ancient Bengal, first published 1971, reprint 2005, pp. 5-6, Tulshi Prakashani, Kolkata, ISBN 81-89118-01-3.
- ↑ "District Census Handbook, Murshidabad, Series 20, Part XII B" (PDF). District Primary Census Abstract page 26. Directorate of Census Operations West Bengal. Retrieved 2 July 2021.
- ↑ 9.0 9.1 9.2 Chisholm 1911, p. 218.
- ↑ 10.0 10.1 "Cossimbazar" in Imperial Gazetteer of India, Oxford, Clarendon Press, 1908–1931 [v. 1, 1909].
- ↑ "District Census Handbook Murshidabad, Census of India 2011, Series 20, Part XII A" (PDF). Section II Town Directory, Pages 981-987: Statement I: Growth History, Pages 990-993: Statement III: Civic & Other Amenities, Pages 993-995: Statement IV: Medical Facilities 2009, Pages 995-1001 Section V: Educational, Recreational and Cultural Facilities; Pages 1 001- 1002: Statement VI: Industry & Banking. Directorate of Census Operations, West Bengal. Archived (PDF) from the original on 28 June 2021. Retrieved 26 June 2021.
- ↑ 12.0 12.1 12.2 12.3 Datta, Rangan. "Cossimbazar: The other colonial town near Murshidabad". My Kolkata. The Telegraph. Archived from the original on 21 April 2022. Retrieved 21 April 2022.
5miles
నది
నది
నది
నది