కింజరాపు ఎర్రన్నాయుడు

(కింజరపు యర్రంనాయుడు నుండి దారిమార్పు చెందింది)

కింజరాపు ఎర్రన్నాయుడు (23 ఫిబ్రవరి, 1957 - 2 నవంబర్, 2012 ) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ప్రభుత్వ చీఫ్‌వీప్‌గా, నాలుగుసార్లు లో‍క్‍సభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రైల్వే, అగ్రికల్చర్‌ స్టాండింగ్‌ కమిటీలకు చైర్మన్‌గా, లోక్‌సభ ప్యానెల్‌ స్పీకర్‌గా, పార్లమెంట్‌ హౌస్‌లో ఫుడ్‌ కమిటీ ప్రతినిధిగా వివిధ పదవులు నిర్వహించాడు.[3]

కింజరాపు ఎర్రన్నాయుడు
కింజరాపు ఎర్రన్నాయుడు


కేంద్ర గ్రామీణాభివృద్ధి & ఉపాధి శాఖ మంత్రి
పదవీ కాలం
1996 జూన్ 1 – 1998 మార్చి 19
ప్రధాన మంత్రి హెచ్.డి.దేవెగౌడ
ఐ.కె.గుజ్రాల్
ముందు అటల్ బిహారీ వాజ్‌పేయి
తరువాత బాబాగౌడ పాటిల్

పదవీ కాలం
1996 – 2009
ముందు కణితి విశ్వనాథం
తరువాత కిల్లి కృపారాణి
నియోజకవర్గం శ్రీకాకుళం

పదవీ కాలం
1995 అక్టోబర్ 8 – 1995 అక్టోబర్ 11
గవర్నరు కృష్ణకాంత్
సి.రంగరాజన్

పదవీ కాలం
1983 – 1996
ముందు కన్నిపల్లి అప్పల నరసింహ భుక్త
తరువాత కింజరాపు అచ్చెన్నాయుడు
నియోజకవర్గం హరిశ్చంద్రపురం

వ్యక్తిగత వివరాలు

జననం (1957-02-23)1957 ఫిబ్రవరి 23
నిమ్మాడ, ఆంధ్రప్రదేశ్
మరణం 2012 నవంబరు 2(2012-11-02) (వయసు: 55)
రణస్థలం, ఆంధ్రప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు కింజరాపు దాలి నాయుడు, కళావతమ్మ
జీవిత భాగస్వామి కింజరాపు విజయ కుమారి
సంతానం ఆదిరెడ్డి భవాని, కింజరాపు రామ్మోహన నాయుడు[1]
మూలం [2]

జననం, విద్యాభాస్యం

మార్చు

ఎర్రన్నాయుడు 1957 ఫిబ్రవరి 23న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీకాకుళం జిల్లా, నిమ్మాడ గ్రామంలో కింజరాపు దాలి నాయుడు, కళావతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన గారలో ప్రాధమిక విద్యను, టెక్కలిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి, విశాఖపట్టణంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి ఎల్.ఎల్.బి. లో న్యాయ పట్టా పొందాడు.

రాజకీయ జీవితం

మార్చు

కింజరాపు ఎర్రన్నాయుడు 1982లో ఎన్.టి. రామారావు ప్రేరణతో తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 1983 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కన్నెపల్లి అప్పలనరసింహ భుక్తపై 14190 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1985 శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాఘవరావు సంపతిరావుపై 18,139 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

కింజరాపు ఎర్రన్నాయుడుకి 1989 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో హరిశ్చంద్రపురం శాసనసభ నియోజకవర్గం టీడీపీ టికెట్ దక్కకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తిరిగి టీడీపీలో చేరి 1994 శాసనసభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి రాఘవరావు సంపతిరావుపై 27,220 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రభుత్వ చీఫ్‌ వీప్‌గా పని చేశాడు.

కింజరాపు ఎర్రన్నాయుడు 1996 లో‍క్‍సభ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (లక్ష్మి పార్వతి) అభ్యర్థి జయ కృష్ణ మందమూరిపై 199700 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1998 లో‍క్‍సభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ (లక్ష్మి పార్వతి) అభ్యర్థి అప్పయ్య దొర హనుమంతుపై 86365 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండొవసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కింజరాపు ఎర్రన్నాయుడు 1999 లో‍క్‍సభ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కణితి విశ్వనాధంపై 96882 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 లో‍క్‍సభ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కిల్లి కృపారాణిపై 31879 ఓట్ల మెజారిటీతో గెలిచి నాల్గొవసారి లో‍క్‍సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

కింజరాపు ఎర్రన్నాయుడు 1998 నుండి 2009 వరకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలలో అనేక పదవులను నిర్వహించాడు. ఆయన 2009 లో‍క్‍సభ ఎన్నికలలో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి కిల్లి కృపారాణి చేతిలో 82,987 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ఎర్రన్నాయుడు 2012 నవంబర్ 2న తెల్లవారుజామున 2:00 గంటల ప్రాంతంలో విశాఖపట్నంలో జరిగిన వివాహ వేడుక నుండి తిరిగి వస్తుండగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని, రణస్థలం మండలం, దండానపేట కూడలి వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారును వెనుక నుండి ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో ప్రమాదంకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లగా శ్రీకాకుళం పట్టణంలోని కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్) కు తరలించగా, తెల్లవారుజామున 3:30 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.[4][5]

  1. Sakshi (10 June 2024). "కేంద్ర మంత్రిగా ఎర్రన్న తనయుడు". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  2. "Kinjarapu Yerran Naidu - Loksabha" (in ఇంగ్లీష్). Digital Sansad. 22 May 2025. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  3. "అందరివాడు ఎర్రన్నాయుడు". Andhrajyothy. 1 November 2022. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  4. "TDP leader Yerrannaidu dies in road accident" (in Indian English). The Hindu. 2 November 2012. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  5. "Senior TDP leader and former Union minister Yerran Naidu dies in a road accident in Andhra Pradesh" (in ఇంగ్లీష్). India Today. 2 November 2012. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.

బయటి లింకులు

మార్చు