కిన్నెర మాసపత్రిక

తెలుగు పత్రిక
(కిన్నెర నుండి దారిమార్పు చెందింది)

కిన్నెర ఒక తెలుగు మాసపత్రిక. ఇది 1948 సంవత్సరం నవంబరు నెలలో ప్రారంభమైనది. మద్రాసు నుండి వెలువడింది. దీనికి వ్యవస్థాపక సంపాదకులుగా పందిరి మల్లికార్జునరావు పనిచేశారు.

కిన్నెర ముఖచిత్రం

ఈ పత్రిక తొలిసంచిక సంపాదకీయంలో ఈ పత్రిక ఆశయాన్ని సంపాదకులు ఇలా పేర్కొన్నారు. “ఈ నవభారత జనసమయంలో, ఈ యుగసంధిలో సుస్థిరమైన భారత జాతీయ నిర్మాణానికి, ముఖ్యంగా సౌష్ఠవమైన ఆంధ్ర రాష్ట్రనిర్మాణానికి దోహదమివ్వడమే మా ప్రధానాశయం. తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు విజ్ఞానానికి యథోచిత సేవచేయుటయే మా కిన్నెర పత్రిక యొక్క ఉత్కంఠ. మా ఉద్యమానికి ఆంధ్రులంతా తోడ్పడతారని మా ఆశ.”

1950 పత్రికలోని విషయాలు

మార్చు
  • రైల్వే పునర్వర్గీకరణ
  • వ్యాఖ్యలు
  • డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్
  • డాక్టర్ కథ
  • నృత్యం
  • బామ్మ తపఃఫలం
  • విజ్ఞాన పురోగతి : శబ్దవేగం మించి ప్రయాణం
  • కుటుంబ సమావేశం
  • నారాయణభట్టు
  • రాజా - రాణి
  • రెండవతరం
  • సాంఘిక వాసన
  • సౌందర్య నిరూపణలో అభిరుచి
  • ఏరిన ముత్యాలు

రచయితలు

మార్చు

ఈ పత్రిక కోసం పేరొందిన రచయితలు రచనలు చేసేవారు. వారిలో భమిడిపాటి కామేశ్వరరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి, చెఱుకుపల్లి జమదగ్నిశర్మ, వసంతరావు వేంకటరావు, బులుసు వేంకటరమణయ్య, చాగంటి సోమయాజులు, పారనంది జగన్నాథస్వామి, తుమ్మలపల్లి సీతారామారావు, రాంపల్లి నరసింహశర్మ, విద్వాన్ విశ్వం, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఆండ్ర శేషగిరిరావు, విశ్వనాథ సత్యనారాయణ, పిలకా గణపతిశాస్త్రి, ఆచంట జానకీరామ్‌, శ్రీశ్రీ, ఆరుద్ర, మాలతీ చందూర్, మల్లాది రామకృష్ణశాస్త్రి, త్రిపురనేని గోపీచంద్, గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి, బుచ్చిబాబు, వాసిరెడ్డి సీతాదేవి, జనమంచి రామకృష్ణ, చిలుకూరి నారాయణరావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట శారదాదేవి, తులికా భూషణ్ తదితర రచయితలు ఉన్నారు.

మూలాలు

మార్చు
 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: