గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి
గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి కళాభిమాని, సాహిత్య పోషకుడు, రచయిత, ప్రముఖ నేత్రవైద్యుడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో వైద్యవిజ్ఙానం శీర్షిక ద్వారా ఇతడు పాఠకులకు చిరపరిచితుడు.[1]
గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి | |
---|---|
జననం | గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి 1930 మార్చి 26 నరసరావుపేట గ్రామం, మండలం, గుంటూరు జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ రాష్ట్రం |
మరణం | [16-02-1990] అనంతపురం |
వృత్తి | నేత్రవైద్యుడు |
ప్రసిద్ధి | రచయిత |
మతం | హిందూ |
తండ్రి | గుంటుపల్లి శ్రీనివాసరావు |
బాల్యం
మార్చుఇతను గుంటూరు జిల్లా, లోని నరసరావుపేట గ్రామంలో నందవరీక నియోగి కుటుంబంలో 1930, మార్చి 25న తేదీన జన్మించాడు. ఇతని తండ్రి గుంటుపల్లి శ్రీనివాసరావు కవి. అతడు రుక్మిణీ కళ్యాణం, జానకీ పరిణయం మొదలైన కావ్యాలను వ్రాశాడు. రాధాకృష్ణమూర్తి తన అన్న గుంటుపల్లి శ్రీరామమూర్తి వద్ద మద్రాసులో పెరిగి పెద్దయ్యాడు.
విద్య, ఉద్యోగం
మార్చుఇతడు మద్రాసులోని పచ్చయప్ప కళాశాలలో చదివి 1949లో బి.ఎస్.సి పట్టాను పొందాడు. తరువాత మద్రాసులోని వైద్యకళాశాలలో 1954లో ఎం.బి.బి.ఎస్. డిగ్రీని, 1956లో ఆఫ్తాల్మాలజీలో డిప్లొమాను సంపాదించాడు. 1961లో ఎం.ఎస్. పట్టాను సాధించాడు. 1956లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యశాఖలో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా ఉద్యోగం ప్రారంభించాడు. కర్నూలు, వరంగల్లు వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఆఫ్తాల్మాలజీగా పనిచేశాడు. 1965లో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి నేత్రవైద్యుడిగా బదిలీ అయ్యాడు. తరువాత ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి అనంతపురంలో స్వంత నేత్రవైద్యశాలను స్థాపించి పేరు ప్రఖ్యాతులు పొందాడు. అనేక గ్రామాలు, పట్టణాలలో నేత్ర శిబిరాలు నిర్వహించి రమారమి లక్ష మందికి కంటి శుక్లాల ఉచిత శస్త్ర చికిత్సలు చేశారు.రోటరీ అంతర్జాతీయ సంస్థలో జిల్లా గవర్నరుగా సామాజిక సేవ చేశారు.జస్టిస్ ఆవుల సాంబశివరావు గారిచే నేత్రదాత బిరుదు అందుకున్నారు.
రచనలు
మార్చుఈయన మద్రాసులో ఎస్.ఎస్.ఎల్.సి చదువుతున్నప్పుడే తెలుగు ఉపాధ్యాయుడు గరిమెళ్ల సత్యగోదావరిశర్మ వల్ల ఆంధ్రసాహిత్యం పట్ల మమకారం ఏర్పడింది. ఇతని తొలి రచన సుదినం 1946లో ఆంధ్రమహిళ మాసపత్రికలో అచ్చయ్యింది. అది మొదలు ఇతడు చిత్రగుప్త, నవజీవన, ఆనందవాణి, జయశ్రీ, కిన్నెర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర విద్యార్థి మొదలైన పత్రికలలో కథానిక[2]లు, వ్యాసాలు, నాటికలు, పద్యాలు, గేయాలు, శీర్షికలు వరుసగా ప్రకటించాడు. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ఇతడు నిర్వహించిన వైద్యవిజ్ఞానము, తెలుగు కలాలు శీర్షికలు పాఠకుల మెప్పును పొందాయి. "గుంటుపల్లి సూక్తి గురుడ వినర" అనే మకుటంతో 200 పద్యాలను వ్రాశాడు.
ఇతని రచనలలో కొన్ని:
నవలలు
మార్చు- గెలుపు
- ప్రకాశము - ప్రేమ
- చక్కని చుక్కలు
- సిస్టర్ సుమతి
- అన్వేషణ
నాటకాలు/నాటికలు
మార్చు- ఓట్లవేట
- టోకరా
- ప్రేయసి
- వన్‌టూత్రీ
- మరో జవహర్
ఇతర గ్రంథాలు
మార్చుకథలు
మార్చు- కుబేరపుష్పకము
- మనసు మలుపుల్లో
- లాటరీచీటీ
- షష్టాష్టకం
- దోమతెర తగాదా
- అనందం
- అలవాటు
- ఆమె త్యాగం
- ఉద్యోగం సద్యోగం
- ఏది ప్రేమ, ఏది కాదు
- కునికిపాట్లు
- కొత్త ఏడాది
- పర్యవసానం
- పోటీ
- మధు మనస్తత్వం
- సుదినం
- సుభాషిణి
- స్వాతంత్ర్యం-నాదృష్టిలో
మూలాలు
మార్చు- ↑ కల్లూరు, అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర - రెండవ సంపుటి (1 ed.). హిందూపురము: శ్రీ కృష్ణదేవరాయ గ్రంథమాల. pp. 127–131.
- ↑ కాళీపట్నం, రామారావు. "రచయిత: గుంటుపల్లి రాధాకృష్ణమూర్తి". కథానిలయం. కాళీపట్నం రామారావు. Retrieved 26 December 2016.
- ↑ గూగుల్ బుక్స్‌లో హక్కులు విధులు
- ↑ గూగుల్ బుక్స్‌లో కళ్లను కాపాడుకోండి
- ↑ గూగుల్ బుక్స్‌లో వైద్యవిజ్ఞానం