కిలాడి బుల్లోడు

కిలాడి బుల్లోడు 1972, జూన్ 2వ తేదీన విడుదలైన తెలుగు సినిమా. చిత్రకళా పిక్చర్స్ బ్యానర్‌పై నందమూరి సాంబశివరావు నిర్మించిన ఈ సినిమాకు నందమూరి రమేష్ దర్శకత్వం వహించాడు.[1]

కిలాడి బుల్లోడు
(1972 తెలుగు సినిమా)
దర్శకత్వం నందమూరి రమేష్
తారాగణం శోభన్ బాబు,
చంద్రకళ,
కైకాల సత్యనారాయణ
సంగీతం టి.చలపతిరావు
నిర్మాణ సంస్థ చిత్రకళా పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు మార్చు

సాంకేతికవర్గం మార్చు

పాటలు మార్చు

ఈ చిత్రంలోని పాటలకు తాతినేని చలపతిరావు బాణీలు కట్టాడు.[2]

క్ర.సం. పాట రచయిత గాయకులు
1 ఏయ్ ఏయ్ మాట! నా పేరు రీటా! నీ పేరేమిటో? రామూ! సోమూ! జానీ! నానీ! సినారె
2 హల్లో కిలాడి బుల్లిబాబూ ఎందుకో మగాడికింత సిగ్గు వేసుకో మరొక్క చిన్నపెగ్గు సినారె
3 నిన్నుచూసి ఈ లోకం చూస్తే అన్నివైపులా అందాలే అందాలే అందాలే దాశరథి
4 ప్రతి పుట్టినరోజూ పండుగ కాదు ప్రతి రేయి వెన్నల రాదు వలచినవాడే కలసిననాడే ప్రతి వనితకు పండుగరోజు సినారె
5 ఓ మై లౌలీ డార్లింగ్ లెట్ మీ టెల్ యూ సంథింగ్ నీ బుగ్గలలో నిగనిగలాడే సిగ్గుమొగ్గలే బ్లూమింగ్ దాశరథి
6 హే బాబ్బా! ఓ బాబ్బా! వాయించు దిల్‌రుబా! దీవానా! ఓయ్! మస్తానా! వెలిగించవోయ్ మోహాల మతాబా! వీటూరి

కథ మార్చు

ప్రొఫెసర్ రామనాథం భారతదేశాన్ని శత్రుదుర్భేద్యం చేయాలని, శాంతి సమయంలో సస్యశ్యామలం గావించాలనే కాంక్షతో ఎక్కడో దుర్గమారణ్యాల మధ్య అబేధ్యమైన ప్రదేశంలో లాబొరేటరీ నిర్మించుకుని పరిశోధనలు చేస్తుంటాడు. ఆ లాబొరేటరీకి వెళ్ళే మార్గానికి సంబంధించిన ప్లాను రెండు భాగాలుగా చేసి ఒక భాగం తన తండ్రి పరంధామయ్య దగ్గర రెండో భాగం కొడుకు శేఖర్ దగ్గర ఉంచుతాడు. ఆ పరిశోధన ఫలించగానే దానిని చేజిక్కించుకోవడానికి రెండు శత్రుదేశాలు పొంచి ఉన్నాయి. దానికోసం లాబొరేటరీకి వెళ్ళే మార్గాన్ని కనుక్కోవడానికి ఒక దేశపు ఏజెంటు జాన్ పరంధామయ్యను చంపి ప్లాన్ దొంగిలిస్తాడు. అది పూర్తి ప్లాన్ అనుకొని మరొక దేశపు ఏజెంటు భూపాలరావు జాన్ నుండి దానిని తస్కరిస్తాడు. అయితే అది సగం ప్లానే అని తెలుసుకుని మిగిలిన సగం శేఖర్ వద్దనే ఉందని తెలుసుకొని ఆ ప్లానును సంపాదించడానికి జాన్, భూపాలరావులు కలిసిపోతారు. భూపాలరావుకు, శేఖర్‌కు మధ్య జరిగే ఎత్తులు, పైఎత్తులు విమానాశ్రయంలో శేఖర్‌కు పరిచయమైన పోలీస్ కమీషనర్ భీమారావు కుమార్తె చంద్ర సాహస కృత్యాలు, శేఖర్ దేశద్రోహ ముఠాను అరికట్టడానికి పడిన కష్టాలు అన్నీ మిగిలిన సినిమా కథ.[3]

స్పందన మార్చు

ఈ సినిమాపై సినీ విమర్శకులనుండి మిశ్రమ స్పందన లభించింది. "నిజ జీవితానికి చాలా సన్నిహితంగా ఉండే ఈ ఇతివృత్తం ప్రేక్షకాదరణను పొందుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తుంది" అని ఆంధ్రజ్యోతి దినపత్రికలో భరద్వాజ సమీక్షిస్తే,[3] "అర్థరహితమైన కథలను ఏ తరగతి ప్రేక్షకులను కూడా సంతృప్తి పరచని రీతిలో లక్షలకు లక్షలు వెచ్చించి చిత్రాలు ఎందుకు తీస్తారో అర్థం కాదు" అని ఆంధ్రప్రభ దినపత్రికలో రెంటాల గోపాలకృష్ణ పేర్కొన్నాడు.[4]

మూలాలు మార్చు

  1. వెబ్ మాస్టర్. "Kiladi Bullodu (Nandamuri Ramesh) 1972". ఇండియన్ సినిమా. Retrieved 16 January 2023.
  2. Kiladi Bullodu (1972)-Song_Booklet (1 ed.). 2 June 1972. p. 10. Retrieved 16 January 2023.
  3. 3.0 3.1 భరద్వాజ (4 June 1972). "చిత్రసమీక్ష:కిలాడి బుల్లోడు" (PDF). ఆంధ్రజ్యోతి దినపత్రిక. Archived from the original (PDF) on 3 జనవరి 2023. Retrieved 16 January 2023.
  4. రెంటాల, గోపాలకృష్ణ. "చిత్ర సమీక్ష:కిలాడి బుల్లోడు" (PDF). ఆంధ్రప్రభ దినపత్రిక. Archived from the original (PDF) on 16 జనవరి 2023. Retrieved 16 January 2023.