కిషన్ కాంత్ పాల్
క్రిషన్ కాంత్ పాల్ (జననం 6 ఫిబ్రవరి 1948) ఒక మాజీ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి, అతను ఫిబ్రవరి 2004 నుండి జూలై 2007 వరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌గా పనిచేశాడు.[1] [2] పోలీసుగా పదవి విరమణ చేసిన తర్వాత కిషన్ కాంత్ పాల్ పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు. అతను మేఘాలయ (2013-15 నుంచి), మణిపూర్ (2014-15 నుంచి) ఉత్తరాఖండ్ (2015-18 నుంచి) రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశాడు.
కిషన్ కాంత్ పాల్ | |
---|---|
ఉత్తరాఖండ్ గవర్నర్ | |
In office 2015 జనవరి 28 – 2018 ఆగస్టు 21 | |
ముఖ్యమంత్రి | హరీష్ రావత్ , త్రివేంద్ర సింగ్ రావత్ |
తరువాత వారు | బేబీ రాణి మౌర్య |
మేఘాలయ గవర్నర్ | |
In office 2013 జులై 1 – 2015 జనవరి 5 | |
ముఖ్యమంత్రి | ముకుల్ శర్మ |
అంతకు ముందు వారు | రంజిత్ శేఖర్ |
తరువాత వారు | కేసరి నాథ్ త్రిపాఠి |
మణిపూర్ గవర్నర్ | |
In office 2014 సెప్టెంబర్ 16 – 2015 మే 15 | |
ముఖ్యమంత్రి | ఇబోబి సింగ్ |
అంతకు ముందు వారు | వినోద్ |
తరువాత వారు | సయ్యద్ అహ్మద్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1948 ఫిబ్రవరి 6 |
జీవిత భాగస్వామి | సుమిత్ర పాల్ |
కళాశాల | పంజాబ్ విశ్వవిద్యాలయం |
జీవిత విశేషాలు
మార్చుఐపీఎస్ అధికారిగా
మార్చుకిషన్ కాంత్ పాల్‌కు ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW)లో పనిచేసిన అనుభవం ఉంది. [3] [4] [5] కిషన్ కాంత్ పాల్ ఫిబ్రవరి 2004 నుండి జూలై 2007 వరకు ఢిల్లీ నగరానికి పోలీస్ కమిషనర్ గా పనిచేశాడు. [6] [7]
గవర్నర్గా
మార్చుకిషన్ కాంత్ పాల్ 2013 జూలై రెండవ తేదీన, మేఘాలయ గవర్నర్‌గా నియమితులయ్యారు. కిషన్ కాంత్ పాల్ 8 జూలై 2013న ప్రమాణ స్వీకారం చేశాడు. 2 జూలై 2014న నాగాలాండ్ గవర్నర్‌గా కిషన్ కాంత్ పాల్ నియమితుడయ్యాడు.
16 సెప్టెంబర్ 2014న, పాల్ మిజోరాం గవర్నర్‌గా కిషన్ కాంత్ పాల్ ప్రమాణస్వీకారం చేశాడు. అత్యధిక రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేసిన వ్యక్తిగా కిషన్ కాంత్ పాల్ నిలిచాడు.
మూలాలు
మార్చు- ↑ "Raj Bhawan of Uttarakhand". governoruk.gov.in. 22 January 2014. Retrieved 21 February 2015.
- ↑ "FORMER COMMISSIONERS OF DELHI POLICE". Delhi Police. 2 May 2013. Retrieved 21 February 2015.
- ↑ "KK Paul is new governor of Meghalaya". The Telegraph (Calcutta). 2 July 2013. Archived from the original on 6 July 2013. Retrieved 21 February 2015.
- ↑ "K.K. Paul is Delhi's new police commissioner". Siliconindia.com. Retrieved 10 September 2016.
- ↑ "The Big House Constant". Outlookindia.com. Retrieved 10 September 2016.
- ↑ "Bioprofile of Dr. Krishan Kant Paul, H.E. the Governor, Uttarakhand" (PDF). Uttarakhand Government. Retrieved 3 April 2021.
- ↑ Krishnan, Revathi (18 January 2020). "Delhi Police chief Amulya Patnaik to retire — but don't be surprised if he gets another job". ThePrint. Retrieved 3 April 2021.