ఒక్రామ్ ఇబోబి సింగ్

ఒక్రామ్‌ ఇబోబి సింగ్‌ మణిపూర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశాడు.[2]

ఒక్రామ్‌ ఇబోబి సింగ్‌
ఒక్రామ్ ఇబోబి సింగ్


మణిపూర్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
15 మార్చి 2017

పదవీ కాలం
7 మార్చి 2002 – 15 మార్చి 2017
గవర్నరు వేద్ మార్వాహ
అరవింద్ దావే
శివీందర్ సింగ్ సింధు
గురుబచన్ జగత్
అశ్వని కుమార్
వినోద్ కుమార్ దుగ్గల్
క్రిషన్ కాంట్ పాల్
సయ్యద్ అహ్మద్
వి. షణ్ముగనాథన్
నజ్మా హెప్తుల్లా
ముందు రాధాబినోద్ కోయిజం
తరువాత నొంగుతొంబమ్ బిరెన్ సింగ్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2007
నియోజకవర్గం తౌబాల్ నియోజకవర్గం
పదవీ కాలం
2002 – 2007
నియోజకవర్గం ఖంగాబాక్‌ నియోజకవర్గం
పదవీ కాలం
1984 – 1995
నియోజకవర్గం ఖంగాబాక్‌ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1948-06-19) 1948 జూన్ 19 (వయసు 75)[1]
అథోక్పమ్ మఖా లేకై, మణిపూర్, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి లంధోని దేవి
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం మార్చు

ఒక్రామ్‌ ఇబోబి సింగ్‌ 1981లో కోఆపరేటివ్‌ సొసైటీకి కార్యదర్శిగా తన రాజకీయ జీవితం ప్రారంభించి, 1984లో మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా ఖంగాబాక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికై, ఆ తర్వాత 1985లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 1990లో జరిగిన ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశాడు.

ఒక్రామ్ ఇబోబి సింగ్ 1995, 2000లో జరిగిన ఎన్నికల్లో ఖంగాబాక్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన 1999లో మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఇబోబి సింగ్ 2002లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టాడు. ఆయన 2002 నుండి 2017 వరకు వరసగా మూడుసార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టి హ్యాట్రిక్‌ సీఎంగా రికార్డులకెక్కాడు.

మూలాలు మార్చు

  1. "SHRI OKRAM IBOBI SINGH". 2022. Archived from the original on 2 February 2022. Retrieved 2 February 2022.
  2. Sakshi (27 January 2022). "ఈశాన్యంలో పెద్దన్న.. ఆ పార్టీకి బలమూ ఆయనే.. బలహీనత ఆయనే". Archived from the original on 2 February 2022. Retrieved 2 February 2022.