కీర్తి రెడ్డి
కీర్తి రెడ్డి ప్రముఖ చలనచిత్ర నటి. ఈవిడ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ చిత్రాలలో నటించింది. గన్ షాట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన కీర్తి రెడ్డి, పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ చిత్రంద్వారా గుర్తింపు పొందింది.
కీర్తి రెడ్డి | |
![]() | |
జననం | ![]() | 1978 నవంబరు 17
క్రియాశీలక సంవత్సరాలు | 1996 - 2004 |
Filmfare Awards | |
---|---|
ఉత్తమ సహాయ నటి (అర్జున్) |
జననం - విద్యాభ్యాసంసవరించు
కీర్తి రెడ్డి 1978, నవంబరు 17న హైదరాబాద్లో జన్మించింది. కీర్తి రెడ్డి తల్లి డ్రస్ డిజైనర్, తాత గంగారెడ్డి నిజామాబాదు లోకసభ నియోజకవర్గం మాజీ ఎంపీ.[1] కీర్తిరెడ్డి బెంగుళూర్ లోని జిడ్డు కృష్ణమూర్తి యొక్క వ్యాలీ పాఠశాలలో చదువుకుంది. ఎనిమిది సంవత్సరాల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ పొందింది. కొంతకాలం హైదరాబాద్ లోని సెయింట్ జోసెఫ్ పబ్లిక్ స్కూల్ చదువుకుంది. ఉన్నత విద్యను ఆమె, కెనడా టొరంటో రఎర్సన్ విశ్వవిద్యాలయంలో చదివింది.[2]
వివాహంసవరించు
2004లో కీర్తి రెడ్డి వివాహం ప్రముఖ నటుడు సుమంత్తో జరిగింది. వారు 2006 లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2014 లో లండన్లో సెటిలైన డాక్టర్ కార్తీక్ ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు.[2]
సినీరంగ ప్రస్థానంసవరించు
1996లో ఎస్. వి. కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన గన్ షాట్ చిత్రం ద్వారా తొలిసారిగా తెలుగు సినిమాలో నటించిన కీర్తి రెడ్డి, 1997లో తమిళంలో నటించిన దేవతై సినిమా కీర్తి రెడ్డికి విజయాన్ని అందించింది. 2004లో గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ చిత్రంలోని నటనకు ఉత్తమ సహాయ నటిగా ఫిలీంఫేర్ పురస్కారాన్ని అందుకుంది.[1]
నటించిన చిత్రాలుసవరించు
సంవత్సరం | చిత్రం పేరు | పాత్ర పేరు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
1996 | గన్ షాట్ | తెలుగు | ||
1997 | దేవతై | కాయల్ | తమిళం | |
నందిని | తమిళం | |||
1998 | జాలీ | చెల్లెమ్మ | తమిళం | |
ఇనియావలే | మంజు | తమిళం | ||
తొలిప్రేమ | అను | తెలుగు | ||
1999 | నినైవిరుక్కుం వారై | సంధ్య | తమిళం | |
ప్రేమించే మనసు | తెలుగు | |||
రావోయి చందమామ | రుక్మిణి | తెలుగు | ||
2000 | తేరా జాదు చల్ గయా | పూజా | హిందీ | |
2001 | ప్యార్ ఇష్క్ ఔర్ మొహబత్ | ఈషా నాయిర్ | హిందీ | |
2002 | బదాయి హో బదాయి | ప్లోరెన్స్ డిసౌజా | హిందీ | |
సూపర్ స్టార్ | దేవయాని | కన్నడ | ||
2004 | అర్జున్ | మీనాక్షి | తెలుగు | ఫిలింఫేర్, ఉత్తమ సహాయ నటి |
మూలాలుసవరించు
- ↑ 1.0 1.1 Celebsunseens. "Keerthi Reddy Wiki, Height, Weight, Age, Affairs, Measurements, biography & More". www.celebsunseens.com. Archived from the original on 6 మే 2017. Retrieved 3 May 2017. Check date values in:
|archive-date=
(help) - ↑ 2.0 2.1 టాలీవుడ్ టైమ్స్. "కీర్తి రెడ్డి". tollywoodtimes.com. Retrieved 3 May 2017.[permanent dead link]