టొరంటొ పట్టణం కెనడా దేశంలోని పెద్ద ప్రధాన మయిన భిన్న జాతులు సంస్కృ తులు కలసి నివసించే అందమయిన పట్టణం.

టొరంటొ
Skyline of టొరంటొ
Skyline of టొరంటొ
Flag of టొరంటొ
Flag
Coat of arms of టొరంటొ
Coat of arms
ముద్దు పేరు: T.O., Hogtown, The Big Smoke, Toronto the Good, T-Dot
నినాదం: Diversity Our Strength
Location of Toronto and its census metropolitan area in the province of ఓంటారియో
Location of Toronto and its census metropolitan area in the province of ఓంటారియో
Location of Toronto and its census metropolitan area in the province of ఓంటారియో
అక్షాంశరేఖాంశాలు: 43°39′N 79°23′W / 43.650°N 79.383°W / 43.650; -79.383
దేశం కెనడా కెనడా
ప్రావిన్సు మూస:Country data ఓంటారియో ఓంటారియో
జిల్లాలు ఈస్ట్ యార్క్
ఇటోబికోక్
నార్త్ యార్క్
పాత టొరంటొ
స్కార్ బరో
యార్క్
Established ఆగష్టు 27, 1793
పురపాలక సంఘం మార్చి 6, 1834
Amalgamated జనవరి 1, 1998
ప్రభుత్వం
 - Type {{{government_type}}}
 - మేయర్ John Tory (Canadian politician జాన్ టోరి
 - Council టొరంటొ సిటీ కౌన్సిల్
 - పార్లమెంటు సభ్యుడు (కెనడా)
 - MPPs
వైశాల్యము [1][2]
 - City 630 km² (243.2 sq mi)
 - పట్టణ 1,749 km² (675.3 sq mi)
 - మెట్రో 7,125 km² (2,751 sq mi)
ఎత్తు 76 m (249 ft)
జనాభా (2006)[1][2]
 - City 25,03,281
 - సాంద్రత 3,972/km2 (10,287.4/sq mi)
 - పట్టణ 4,753,120
 - మెట్రో 5,555,912
 - Demonym Torontonian
కాలాంశం EST (UTC-5)
 - Summer (DST) EDT (UTC-4)
Postal code span M
Area code(s) (416) and (647)
NTS Map 030M11
GNBC Code FEUZB
వెబ్‌సైటు: toronto.ca

టొరంటో కెనడాలో అతి పెద్ద నగరం. టొరంటో దక్షిణ ఒంటారియో వాయవ్య దిశలో ఉంది. 18వ శతాబ్దంలో మిసిసాగా వద్ద భూములను ఒప్పందం ద్వారా కొనుగోలు చేయడంతో టొరంటో చరిత్ర మొదలైంది. తరువాత బ్రిటిష్ ప్రభుత్వం టౌన్ ఆఫ్ యోర్క్ పేరుతో ఒక పట్టణాన్ని స్థాపించింది. తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ జాన్ గ్రేవ్స్ సింకో టౌన్ ఆఫ్ యోర్క్ ను ఎగువ కెనడా రాజధానిగా రూపుదిద్దాడు. 1812 లో బాటిల్ ఆఫ్ యోర్క్ యుద్ధంలో ఈ నగరం దోపిడీకి గురైంది. 1834 లో యోర్క్‌కు నగర అతస్థు ఇచ్చి టొరంటో అని పేరును పేరుమార్పిడి చేసారు.ఈ నగరం 1849, 1904 లలో రెండు మార్లు అగ్నిప్రమాదానికి గురైంది. టొరంటో పలుమార్లు పొరుగున ఉన్న పురపాలకాలను కలుపుకుంటూ తన సరిహద్దులను విస్తరించింది. సరికొత్తగా 1998లో టొరంటో సరిహద్దులను విస్తరించింది.

2011 గణాంకాలను అనుసరించి టొరంటో నగరంలో 2.6 మిలియన్ల నివాసులు ఉన్నారు . టొరంటో ఉత్తర అమెరికాలో జనసంఖ్యపరంగా ఐదవ స్థానలో ఉంది. 2011 గణాంకాలను అనుసరించి ది సెంసస్ మెట్రోపాలిటన్ ఏరియా (సి.ఎం.ఎ) జనసంఖ్య 55,83,064 ఉండగా, టొరంటో మహానగర (జి.టి.ఎ) జనసంఖ్య 60,54,191 ఉంది. టొరంటో మహానగరం హృదయస్థానంలో టొరంటో నగరం ఉంది. అలాగే గోల్డెన్ హార్స్‌షూ అనబడే దక్షిణ ఒంటారియోలో టొరంటో అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతం అని అంచనా. అత్యంత నాగరీకత కలిగిన అంతర్జాతీయ గుర్తింపు కలిగిన ప్రజలు కలిగిన టొరంటో కెనడాకు వచ్చే విదేశీవలస ప్రజలకు ప్రధాన గమ్యస్థానమని భావించబడుతుంది. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యం కలిగిన నగరంగా టొరంటో నగరానికి ప్రత్యేకత ఉంది. టొరటో వాసులలో 49% పౌరులు విదేశాలలో జన్మించిన వారే.

విశేషాలు

మార్చు

ప్రపంచం లోని ఏ ఇతర పట్టణంలో ఉండనటువంటి భిన్న జాతులు సంస్కృతులు కలిగిన వివిధ దేశాల ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు.

చరిత్ర

మార్చు

కి.పూ 1500 ఇక్కడ ఇరాక్యూ ఆదివాసులు నివసించినట్లు అంచనా.వారే ఈ ప్రదేశానికి ట్కొరంటో అనే పేరుతో పిలిచేవారని వారి భాషలో ట్కొరంటో అంటే వర్షాధార అరణ్యాలు.అవి ప్రస్తుతం సిమ్‌క్యూ సరసు ఉత్తర భాగాన్ని సూచిస్తుంది.తరువాతి కాలంలో ఇరాక్యూ తెగలను తరిమికొట్టి ఈ ప్రదేశాన్ని హరాన్ తెగలు ఆక్రమించికున్నారు.వీరు సిమ్‌క్యూ సరసు ఉత్తర భాగంలో కోరల్ చేపలకోసం నాటిన చెట్లు ఉన్న ప్రదేశం నుండి ఒంటారియా సరసు, సిమ్‌క్యూ సరసు లను కలుపుతూ చెట్లతో కూడిన భూమార్గం ఉంది.ఈ ప్రదేశాన్ని టొరంటో క్యారీయింగ్ - ప్లేస్ ట్రైల్ అని ఇక్కడి ప్రజలు పిలుస్తారు.ఇలా రెండు జలాశయాలను కలిపే మార్గాలను ఆంగ్లంలో పోర్టేజ్ రూట్ అంటారు. యురేపియన్లు ఇక్కడ ప్రవేశించే సమయానికి ఈ ప్రదేశం హరాన్ తెగల స్వాధీనంలో ఉంది.

1750లో ప్రస్తుత ఎగ్జిబిషన్ గ్రాండ్‌లో ఫ్రెంచ్‌దేశ వ్యాపారులు ఒక రేవుని నిర్మించారు కాని 1759లో ఈ రేవును ఉపయోగించకుండా వదిలి వేసారు.అమెరికన్ రివల్యూషనరీ వార్ కాలంలో అమెరికా విశ్వాసులైన బ్రిటన్‌దేశీయులు అప్పటికి ఎలాంటి ఒప్పందం జరగని ఒంటారియా సరసు ఉత్తర భాగంలో ప్రవాహంలా వచ్చి చేరారు.1987లో న్యూక్రెడిట్‌ కు చెందిన మసిసాగాస్ తెగల నుండి ఈ ప్రదేశాన్ని కొనుగోలు చేయటానికి సాగించిన బేరాలు 1805 నాటికి ముగింపుకు వచ్చి 2,50,000 ఎకరాల టొరంటో ప్రదేశం బ్రిటన్ స్వాధీనంలోకి వచ్చింది.

1793లో గవర్నర్ సిమ్‌కోర్ ఇక్కడ నిర్మించిన పట్టణానికి డ్యూక్ ఆఫ్ యోర్క్అండ్ ఆల్బనీ ప్రభువు జ్ఞాపకార్ధం ప్రిన్స్ ఫెడరిక్ (బ్రీటిష్ రాజకుమారుడు)యోర్క్ అని నామకరణం చేసాడు.సిమ్‌కోర్ చే అప్పర్ కెనడా రాజధానిని నెవార్క్ నుండి యోర్క్‌ కు మార్చబడింది.ఈ ప్రదేశంలో ఉంటే అమెరికన్ల దాడి నుండి కొంచం తగ్గుతుందని విశ్వసించారు.పట్టణ సహజ సిద్దమైన రేవు ప్రదేశంలో ఫోర్ట్ యార్క్ రేవు నిర్మాణం జరిగింది.

 
1894 టొరంటో మ్యాప్

వార్ ఆఫ్ 1812 లో భాగంగా బాటిల్ ఆఫ్ యోర్క్ ముగింపులో 1831లో ఈ పట్టణం అమెరికన్ సేనల వశమై వారిచే దోపిడీకి గురైంది.ఈ పట్టణం అమరికన్ సేనలు జాన్ స్ట్రేచర్ నాయకత్వంలో రాయబారం జరిపి స్వాధీనపరచుకున్నారు.ఐదు రోజులపాటు జరిగిన ఆక్రమణలో అమెరికన్ సేనలు ఫోర్ట్ యార్క్ ను ధ్వంసం చేసి పార్లమెంట్ భవనాన్ని అగ్నికి ఆహుతి చేశారు.

1834 మార్చి 6న టొరంటొ నగరంగా గుర్తింపు పొంది నగరపాలిత సంస్థ పాలనలోకి మారింది.ఈ నగరం పేరు తిరిగి పూర్వపు పేరైన టొరంటొగా మార్చబడింది.ప్రారంభంలో ఈ నగర జనాభా కొన్ని అమెరికన్ రాష్ట్రాల నుండి పారిపోయివచ్చిన బానిసలైన ఆఫ్రికన్ అమెరికన్లతో చేర్చి 9,000. 1834 నుండి అప్పర్ కెనడాలో బానిసత్వం రద్దు చేయబడింది.సంస్కరణలకు రూపకల్పన చేసిన రాజకీయనాయకుడు విలియమ్ లైన్ మెకన్‌జీ నగరానికి మొదటి మేయర్‌ అయ్యాడు.

19వ శతాబ్ధపు మధ్యకాలంలో నగర జనాభా అనూహ్యంగా అభివృద్ధి చెందింది.1846, 1849లలో ఐరిష్లో ఏర్పడిన దుర్భర క్షామం కారణంగా ఐరిష్ ప్రజావాహిని ఇక్కడకు వచ్చి స్థిరపడసాగారు.వారిలో కాధలిక్కులు అధిక సంఖ్యలో ఉన్నారు.1851లో నగరంలో పెద్దసంఖ్యలో ఉన్న సంప్రదాయక జాతి ఐరిష్ పూర్వికంగా ఉన్న వాళ్ళే.నగరంలో మిగిలి ఉన్న స్కాటిష్, ఆంగ్లేయులు ఐరిష్, స్వల్ప సంఖ్యాకులైన ప్రొటెస్టెంట్ వలస ప్రజలను ఆనందంగా దేశంలోకి ఆహ్వానించారు.

టొరంటొ రెండు సార్లు స్వల్పకాలికంగా కెనడాప్రొవిన్స్‌కు రాజధానిగా ఉంది.అధికారపూర్వకంగా ఒంటారియా ప్రొవిన్స్ ఏర్పడిన తరువాత 1867 నుండి ఒంటారియా ప్రోవిన్స్ (రాష్ట్రం)కు రాజధాని అయింది.రాజధాని అంతస్తు కారణంగా క్వీన్స్ పార్క్‌లో శాసనసభ హాల్,గవర్నమెంట్ హౌస్,రాజ ప్రతినిధి గృహం వైస్ -రీగల్ ఈ నగరంలో చోటు చేసుకున్నాయి.

 
1990 యోంజ్ స్ట్రీట్

19వ శతాబ్దంలో అధునాతన మురుగునీటి కాల్వల నిర్మాణం జరిగింది.వీధులు గ్యాస్ దీపాల వెలుగులను సంతరించుకున్నాయి.దూరప్రాంతాలకు రైలు మార్గాలు నిర్మించబడ్డాయి.1854లో టొరొంటొ, అప్పర్ గ్రేట్ లేక్‌లను కలుపుతూ రై మార్గం నిర్మించబడింది.యూనియన్ స్టేషను నిర్మాణంతో గ్రాండ్ ట్రంక్ రైల్వే, నార్తన్ రైల్వే ఆఫ్ కెనడా రైలు మార్గాలు అనుసంధానించబడ్డాయి.రైలు ప్రయాణాలు సుగమంకావడంతో వలసదారుల సంఖ్య అధికం కావడం వ్యాపారం అభివృద్ధి కావడంతో టొరంటొ కెనడా ముఖద్వారంగా సర్వతోముఖాభివృద్ధి చెందింది.ఒంటారియా స్టీమర్లూ, స్కూనర్లూ రేవుకు రావడంతో లోతట్టు ఊత్తర అమెరికా ఖడంతో ప్రపంచానికి సంబంధాలు మెరుగు పడ్డాయి.1891లో గుర్రాలతో లాగబడే కార్లు మోట్ర్ కార్లకు దారి ఇచ్చాయి.1921టొరంటొ రైల్వే కంపెనీకు కెనడా ప్రభుత్వం నుండి ట్రాన్సిస్ట్ ఫ్రాంచిస్ అనుమతి లభించటంతో ప్రభుత్వ రైల్వే సంస్థ అభివృద్ధి చెందింది.ఇది తరువాత టొరంటొ ట్రాంసిస్ట్ కంపెనీగా నామాంతరం చెందింది.ప్రస్తుతం ఈ సంస్థ ఉత్తర అమెరికా ఖండంలో ప్రయాణీకుల సంఖ్యలో మూడవ స్థానంలో ఉంది.

1954లో టొరంటోకు మహానగర హోదా లభించింది.యుద్ధానంతర మార్పుల వలన నగరపరిసరాలు విపరీత అభివృద్ధి సాధించాయి భూమిని సద్వినియోగం చేయడంలో ఊహాత్మకమైన మార్పులు సేవలందించడంలో సహకారం నగరాన్ని శక్తివంతంగా చేసాయి.మహానగర ప్రభుత్వం సేవలు నగర పరిసరాలను దాటి విస్తరించాయి.1967 6 మున్సిపాలిటీలు టొరంటో కార్పొరేషన్లో కలిశాయి.1968లో అధికారపూర్వకంగా ఒకే పాలనలోకి వచ్చాయి.

 
ది గ్రేట్ టొరంటో ఫైర్ ఆఫ్ 1940
 
టొరంటో హార్బర్ 1919

1904లో నగరంలోని డౌన్‌టౌన్ తీవ్ర అగ్ని ప్రమాదానికి గురైంది.ఈ ప్రమాదంలో డౌన్‌టౌన్ చాలాభాగం కాలి బూడిదైంది.ఈ ప్రమాదానికిది గ్రేట్ టొరంటో ఫైర్ ఆఫ్ 1904 గా నామకరణం చేసారు.ఈ ప్రమాదం అగ్నిమాపకదళం నాణ్యతాపరంగానూ సిబ్బందిపరంగానూ అభివృద్ధి చెందటానికి దోహద పడింది.నగరం ఈ ప్రమాదం నుండి త్వరగా కోలుకొని పునర్నిర్మించబడింది.

19, 20 వశతాబ్దంలో నగరానికి నూతన వలసదారులు వచ్చి స్థిరపడ సాగారు.ప్రత్యేకంగా తూర్పు ఐరోపా దేశాలైన జర్మన్లు,ఈటాలియన్లు, యూదుల నుండి అధికంగా ఉన్నారు.ఆతరువాత వీరిని అనుసరించి చైనీయులు,రష్యన్లు,పోలండ్ దేశీయులు, తూర్పు ఐరోపా వాసులు ఇక్కడ స్థిరపడసాగారు.వీరిలో అధికులు జనసాంద్రత అధికంగా కలిగిన మురికి వాడలలో నివసించసాగారు.ప్రస్తుతం నగరపరిసరాలలో బే స్ట్రీట్ లో మధ్యభాగంలో ఉన్న ఈ ప్రదేశం వ్యాపారకూడలిగా అభివృద్ధి చెందింది.1934 నాటికి టొరంటో స్టాక్ ఎక్ష్చేంజ్ దేశంలో ప్రథమ స్థానానికి చేరింది.

1945 నుండి

మార్చు
 
బే స్ట్రీటులో వి.ఇ. డే ఉత్సవాలు

రెండవ ప్రపంచ యుద్ధానంతరం యుద్ధంవలన చిన్నాభిన్నమైన ఐరోపా దేశాల నుండి వచ్చే శరణార్ధులు ఉపాధిని అన్వేషిస్తూ వచ్చి చేరే చైనీయులు నగరానికి వచ్చి నిర్మాణ రంగంలో ఉపాధి వెతుక్కున్నారు.ప్రత్యేకంగా ఇటలీ, పోర్చుగల్ వాసులు నిర్మాణరంగంలోధికంగా పనిచేయసాగారు తరువాతి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలవాసులు ఇక్కడకు వలస వచ్చి చేరడంతో 1951 నాటికి నగర జనాభా 10 లక్షలకు చేరింది.నగరపరిసరాలలో బృహత్తర అభివృద్ధి పధకాలు చేపట్టారు.1971 నాటికంతా జనసంఖ్య 20 లక్షలకు చేరింది.1980 నాటికి టొరంటో జనసంఖ్యలోనూ ఆర్థికకేంద్రంగానూ మోట్రియల్ నగరాన్ని అధిగమించింది.అదేసమయంలో క్యూబెక్ సావరనిటీ మూవ్‌మెంట్ కారణంగా ఏర్పడిన అనిస్చితి కారణంగా మోంట్రియల్ నుండి జాతీయ అంతర్జాతీయ సంస్థలు తమ ప్రధాన కార్యాలయాలను టొరంటో, దేశంలోని ఇతర పడమటి నగరాలకు మార్చుకున్నాయి.

1954లో టొరంటో నగరం, పరిసరప్రాంతాలు 12 పురపాలకాలు కలిసి మెట్రోపాలిటన్ టొరంటో పేరిట ప్రాంతీయంగా ఫెడరల్ ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నాయి. యుద్ధానంతరం అభివృద్ధి ఫలితంగా నగరశివారులు శీఘ్రగతిలో అభివృద్ధిని నగరంలో భాగంగా మారాయి. సంఘటితమైన భాభాగం వ్యూహాత్మకంగా నగరాన్ని అభివృద్ధి చేయడానికి సేవలు అందించడానికి ఉపకరించిందని విశ్వసించారు. మెట్రో పాలిటన్ ప్రభుత్వం పురపాలక సరిహద్దులను సరిహద్దులను దాటి రహదారులు, పోలీస్ సర్వీసులు, పబ్లిక్ ట్రాంసిస్ట్ సేవలందించడం ప్రారంభించింది. ఆ సంవత్సరం గ్రేట్ ఫైర్ నగాన్ని అగ్నికి ఆహుతి చేసింది. సుమారు అర్ధ సతాబ్ధానికి ముందు (1954) ఇలాంటి అగ్నిప్రమాదం సంభవించింది. హరెకెన్ హాజెల్ తుఫాన్ తీసుకువచ్చిన వేగవంతమైన గాలుల, తీవ్రమైన వరద వలన నగరానికి పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఈ విపత్తు వలన 81 మంది ప్రజలు ప్రాణాలను కోల్పోగా, 1,900 కుటుంబాలు నివాసగృహాలను కోల్పోయారు. హరికేన్ తుఫాన్ కారణంగా 25 మిలియన్ల డాలర్ల నష్టం వాటిల్లింది.1967లో టొరంటో మెట్రోపాలిటన్ లోని 7 పురపాకాలు వాటి పొరుగున ఉన్న పెద్ద భూభాగాలతో కలిసాయి. ఫలితంగా 6 పురపాలకాలు పాత టొరంటోనగరం, పరిసర పురపాలకాలైన ఈస్ట్ యోర్క్, ఇటోబికోక్, స్కార్‌బారో, యోర్క్ లలో అంతర్భాగం అయ్యాయి. 1998 లో మెట్రోపాలిటన్ ప్రభుత్వాన్ని ప్రోవింషియల్ ప్రభుత్వం రద్దు చేసింది. చిన్న పురపాలకాలు దీనిని తీవ్రంగా ఎదిరించడంతో వాటితో టొరంటోలోని 6 పురపాలకాలను కలిపి బృహత్తరమైన టొరంటోమహా నగరపాలిత వ్యవస్థగా మార్చబడింది. నగరానికి మెల్ లాస్ట్మన్ మొదటి మేయరుగా చేయబడ్డాడు. డేవిడు మిల్లర్ రెండవ మేయర్ కాగా అలాగే రాబ్ ఫోర్డ్ మూడవ మేయరుగా చేయబడ్డాడు.

2009 మార్చి 6 వ తేదీలో నగరం 175వ జన్మదినోత్సవం జరుపుకున్నది.1834 లో టొరంటో నగరం స్థాపించబడింది. 2010 జూన్ మాసం 26-27 తేదీలలో జి-20 నాలుగవ సమ్మేళనానికి దేశం ఆతిథ్యం ఇచ్చింది. కెనడా ప్రభుత్వం ఈ సమ్మేళనం నిర్వహణ కొరకు చేసిన వ్యయం, రక్షణ ఏర్పాట్లు కెనడా చరిత్రలో మొదటి స్థానం వహించాయి. 2013 లో మద్యాహ్నం ఉరుములతో కూడిన బృహత్తర మెరుపుల దాడి జరిగింది. ఈ దాడి తరువాత 4,50,000 మంది ప్రజలు విద్యుత్తు కొరతను ఎదుర్కొన్నారని అంచనా. ఉరుములతో కూడిన మెరుపుల తరువాత 126 మీల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు టొరంటో అంతర్జాతీయ విమానాశ్రయం అయిన పియర్సన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లు తెలిపింది. 5 గంటలకంటే అధిక సమయం భారీ వర్షం కురిసింది. ఇది హాజెల్ హరికేన్ సమయంలో కురిసిన దానికంటే అధికం. 2015లో టొరంటో నగరం పాన్ అమెరికన్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నది.

భౌగోళికం

మార్చు

టొరంటో నగరం మొత్తం వైశాల్యం 630 చదరపు కిలోమీటర్లు.ఉత్తర, దక్షిణ భాగం 21 కిలోమీటర్ల పొడవు,తూర్పు, పడమర భాగాలు 43 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.ఒంటారియా ఈశాన్య భాగంలో 46 కిలోమీటర్ల పొడవున జలతీరం ఉంది.నగరానికి దక్షిణంలో ఒంటారియా సరసు,పడమట ఎటోబైకోక్ క్రీక్ (క్రీక్ అంటే ఆంగ్లంలో జలపాతం), హైవే 427 రహదారి,ఉత్తరంలో స్టీల్స్ అవెన్యూ తూర్పులో రోగ్ నది సరిహద్దులుగా ఉన్నాయి.

భౌగోళిక స్వభావం

మార్చు
 
నాసా లాండ్‌సెట్ 7 ఉపగ్రహ టొరంటో వర్ణచిత్రం 2004

టొరంటో నగరం రెండు నదుల మధ్య అందంగా పొదగబడింది.పడమట హంబర్ నది డౌన్‌టౌన్‌కు తూర్పున డాన్ నది .ఒంటారియా సరసులోని చిన్న చిన్న దీవుల మధ్య సహసిద్ధంగా ఏర్పడిన రేవు.ఉత్తర భాగం నుండి సరసు వైపు ప్రవహించే నదులు సెలఏళ్ళ జలం వలన సశ్యశ్యామలంగా దట్టంగా పెరిగిన వర్షాధార అరణ్యాలు.ఇవి తయారుచేసిన ఉద్యానవనాలు,విహార ప్రదేశాలు. అయినప్పటికీ నగర వీధులను రూపకల్పన చేయడానికి నదులు అడ్డం వస్తుంటాయి. ఫలితంగా ఫ్రెంచ్ అవెన్యూ, లెసిల్ స్ట్రీట్, లారెంస్ అవన్యూ, ఎస్.ట్.క్లెయర్ అవెన్యూ మొదలైన వీధులు ఒక వైపు లోయలతో అంతమౌతాయి. ఈ లోతైన లోయలు నగరంలోని వరదనీటిని విడులదల చేయడానికి ఉపకరిస్తాయి. అయినప్పటికీ నగరంలోని కొన్నిభాగాలు డాన్ నదీతీరంలో ఉన్నాయి కనుక హటాత్తుగా సంభవించే వరద వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి.

హిమయుగపు చివరిదశలో టొరంటోలోని కొంతభూభాగం ఇరోక్వియస్ హిమతటాకం కింద ఉండేది. ఈ తటాకం సరిహద్దులలో ఇరాక్వియిస్ షోర్లైన్ అనే ఏటవాలు భూభాగాల వరుసలు ఉన్నాయి. విక్టోరియా పార్క్ అవెన్యూలో హైలాండ్ క్రీక్ ముఖభాగంలో స్కార్బారో వద్ద ఉన్న ఈ ఏటవాలు భూభాగాలు ప్రాముఖ్యం కలిగి ఉన్నాయి. ఇరాక్వియిస్ షోర్లైన్ ఏటవాలు భూభాగాలు మీద ఉపస్థితమై ఉన్న ఇతర ప్రాంతాలు బాత్రస్ట్ స్ట్రీట్‌లో పడమరవైపున్న ఎస్.టి క్లెయిర్ అవెన్యూ, ది డాన్ నది, డావన్‌రోడ్ ఉత్తరదిశలో కేల్డోనియా నుండి స్పాండినా రోడ్ వరకు, ది కాస లోమా గ్రౌండ్స్ మొదలైనవి. టొరంటో సాధారణంగా కొండప్రాంతం కాదు. సరసు నుండి స్థిరమైన ఎత్తులో ఉంటుంది. నగరం మొత్తంలో ఒంటారియా లేక్ వరకూ ఉన్న సముద్రమట్టానికి 75 మీటర్ల నుండి 206 మీటర్ల వరకూ ఎత్తులలో వ్యత్యాసాలు ఉంటాయి. ప్రత్యేకంగా టొరంటో నగరమద్యలో వరుసగా కొండల వరుసలు ఉన్నాయి. కొండశిఖరాల నుండి ఒక్కోసారి ఒంటారియా సరసు దృశ్యాలను తిలకించవచ్చు. ప్రస్తుత సరసు తీరభూభాగాలు టొరంటో హార్బర్ ఆక్రమించి ఉంది. 19వ శతాబ్దం చివరిలోటొరంటో హార్బర్ లో అనధికారంగా లాండ్ ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. ఒకప్పుడు ఉన్న సరసు వైశాల్యంలో కొంతభాగం లాండ్ ఫిల్లింగ్ కారణంగా కుంచించుకు పోయింది. హార్బర్ పరిసర ప్రాంతాలలో కూడా లాండ్ ఫిల్లింగ్ జరుగుతూ ఉంది. 1858 లో సంభవించిన తుఫాను వరకూ టొరంటో ద్వీపాలు ప్రకృతి సహజ సంపదలుగా ఉంటూ ప్రధానభూమితో కాలువల ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి. తరువాత ఈ కాలువలు నౌకల రాకపోకలకు, ద్విపాలు రేవులుగా ఉపయోగపడుతున్నాయి.

వాతావరణం

మార్చు

టొరంటో ఆర్ధత కలిగిన వెచ్చని వేసవి, అతి చల్లని శీతాకాలాలతో ఆర్ధ్ర ఖండాంతర శీతోష్ణస్థితి కలిగి ఉంది. నగరంలో ఒక్కోరోజు ఒక్కోమాదిరిగా ఉండే నాలుగు వ్యత్యాసమైన శీతోష్ణస్థితులు ఉంటాయి. ఈ వ్యత్యాసాలు ప్రత్యేకంగా చల్లని శీతాకాలలో ఎదురౌతుంటుంది. టొరంటో అతిపెద్ద నీటి వనరు అయిన ఒంటారియా సరసుకు పక్కన ఉన్న కారాంగా పగలు, రాత్రి ఉష్ణోగ్రతలలో వ్యత్యాసం తక్కువగా ఉంటుంది. నగరం జనసాంద్రత కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు సంవత్సరం అంతా వెచ్చగా ఉంటాయి. అలాగే శీతాకాలంలో చలి కూడా మిగిలిన ప్రాతాంల కంటే తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ వసంతకాలాలలో, ఆరంభకాల వేసవి మద్యహ్నానాలు సరసు నుండి వచ్చేచలి గాలుల కారణంగా చలి కొంచం అధికంగా ఉంటుంది. ఒంటారియా సరసు కారణంగా టొరంటో నగర ఉష్ణోగ్రతలు అల్పంగా సముద్రతీర ఉష్ణోగ్రతలను పోలి ఉంటాయి. అంతేకాక ఒంటారియా సరసు నగరంలో అత్యధికంగా పొగమంచు ఏర్పడడానికి హేమంతం, వసంతకాలాల ఆగమనం ఆలస్యం కావడం వంటివి సంభవిస్తాయి.

టొరంటోలో −10 °C ఉండే సమయంలో గడ్డకట్టించే చలిగాలులు వీస్తుంటాయి. హిమంతోనూ, అర్షంతో కూడిన మంచుతుఫానులు సంభవిస్తుంటాయి. ఇలాంటి సమయంలో అగరంలో ప్రజలు పనిచేయడానికి, ప్రయాణించడానికి ఇబ్బందులను ఎదుర్కొంటారు. నవంబరు నుండి ఏప్రిల్ వరకు మంచు పేర్కోవడం పేరుకున్న మంచు కరగడ వలన ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటుంటారు.

వేసవి మాసాలలో తేమ వాతావరణం కొనసాగుతుంది . సాధారణంగా వేసవి ఉష్ణోగ్రతలు 23 ° సెంటీగ్రేడ్ నుండి (73 ° ఫారెన్‌హీట్ )31 ° సెంటీగ్రేడ్ (88 ° ఫారెన్‌హీట్ ), పగటి ఉష్ణోగ్రతలు అరుదుగా 35 ° సెంటీగ్రేడ్ (95 ° ఫారెన్‌హీట్ ) వేడి వాతావరణం ఉంటుంది. వేసవి కాలాలు అత్యధిక తేమతో కూడిన వాతావరణంతో అసహనం కలిగించేలా ఉంటాయి. వసంతం, శిశిర ౠతువులలో తేమతో కూడిన పొడి వాతావరణం ఉంటుంది. వర్షపాతం సంవత్సరమంతా సమానంగా ఉంటుంది. వేసవిలో సాధారణంగా పొడి వాతావరణం ఉరుములు పిడుగుపాటు అధికంగా ఉంటుంది. హేమంతం, వసంతకాలంలో సాధారణంగా వాతావరణం తేలికగా లేక చలిగా ఉంటుంది. పొడివాతావరణం ఉన్నప్పటికీ కరువు పరిస్థితులు మాత్రం అరుదుగానే సంభవిస్తుంది. సగటు వార్షిక వర్షపాతం 133 సెం.మీ. (52), వార్షిక సగటు హిమపాతంతో 830 మిల్లీమీటర్లు (లో 32.7) ఉంటుంది.

 

నిర్మాణశైలి

మార్చు
 
బ్రూక్ ఫీల్డ్ ప్లేస్ లోని ఆలెన్ లాంబర్ట్ గలేరియా

టొరంటో నగరంలోని భవనాలు డిజైన్, భవనాలు నిర్మించబడిన కాలం వైవిధ్యం కలిగి ఉంటాయి. నగరలోని అనేక భవనాలు 19వ శతాబ్ధానికి ముందు నిర్మించబడినవి. ప్రముఖమైన ఇతర భవనాలు 21వ శతాబ్ధపు మొదటి దశాబ్ధంలో నిర్మించబడినవి. టొరంటో ఆకాశసౌధాలలో సి.ఎన్ టవర్ పర్యాటకం, వాణిజ్య కేంద్రంగా ఉంది. సి.ఎన్ టవర్ 1976 లో నిర్మించబడింది. ఈ నిర్మాణం ఎత్తు 553.33 మీటర్లు. ప్రపంచంలో ఎత్తైన నిర్మాణం అని ప్రఖ్యాతి చెందిన సి.ఎన్ టవర్‌ను 2007 తరువాత బుర్జ్ ఖలీఫా భవనం అధిగమించింది. టొరంటో నగరంలో 30 మీటర్లకంటే అధికమైన ఎత్తైన భవనాల సఖ్య 1,800. సెంట్రల్ డిస్ట్రిక్‌లోని భనాలలో వాణిజ్య కార్యాలయాలు ఉన్నాయి. ఈ భవనాలలో అధికశాతం నివాసగృహ సముదాయాలకు చెందినవి. 1950లో అభివృద్ధి చెందిన జనాభా అవసరాలకు తగిన విధంగా నిర్మించబడిన నివాసగృహ భవనసముదాయాలను ప్రస్తుతం పునర్నిర్మించాలని య్చిస్తున్నారు. 2011 గణాంకాలు టొరంటో నగరంలో 132 ఆకాశ సౌధాలు నిర్మాణదశలో ఉన్నాయని తెలియజేస్తున్నాయి.

టొరంటో నగరంలో 1960-1970 లో వారసత్వ భవనాలు అభివృద్ధి పనుల కొరకు, పార్కింగ్ ప్రదేశాల కొరకు పడగొట్టబడ్డాయి. 2000 నుండి టొరంటో వారసత్వభవనాలను పునరుద్ధరించి వాటిని తిరిగి ఉపయోగంలోకి తీసుకు వచ్చింది. డేనియల్ లిబ్‌స్కిండ్స్ రాయల్ ఒంటారియో మ్యూజియం ఆడిషన్, ఫ్రాంక్ గెహ్రీస్ రీమేక్ ఆఫ్ ది ఆర్ట్ గ్యాలరీ ఆఫ్ ఒంటారియో, విల్ల్ అల్సాప్స్ డిస్టిన్‌క్టివ్ ఒంటారియో కాలేజ్ ఆఫ్ ఆర్ట్ & డిజైన్ ఎక్స్పెంషన్ మొదలైన భవనాలు నగరలో ప్రదర్శనకు, ప్రజల సందర్శనకు అనుకూలమైనవిగా ఉన్నాయి. డౌన్ టౌన్ పడమటి తీరంలో ఉన్న చారిత్రాత్మక ఇష్టిల్లరీ డిస్ట్రిక్ తిరిగి పెడిస్ట్రెయన్ ఓరియంటేడ్ ఆర్ట్‌లతో అభివృద్ధిచేయబడింది.

పరిసర ప్రాంతాలు

మార్చు

టొరంటో లోని వాణిజ్య అవసరాలకు ఉపకరించే ఆకాశసౌధాలు ఉన్న ప్రాంతానికంటే నివాస ప్రాంతాలు ప్రత్యేకత కలిగి ఉంటాయి. రోస్‌డేల్, క్యాబేజ్‌టౌను, అనెక్స్, యోర్క్‌విల్లే లలో విక్టోరియన్, ఎడ్వర్డియన్ శకానికి చెందిన నివాస భవన ఉన్నాయి. విచ్‌వుడ్ పార్క్ ప్రాంతాలలో చారిత్రక ప్రాధాన్యత కలిగిన పురాతన శైలి నివాసగృహాలను టొరంటో లోని మొదటి ప్రణాళికా బద్ధమైన నిర్మాణాలని భావిస్తున్నారు. 1985లో విచ్ వుడ్ పార్క్ ప్రాంతాన్ని ఒంటారియా హెరిటేజ్ కంసర్వేషన్ డిస్ట్రిక్‌గా గుర్తించబడింది. 1911లో స్టోరీ బుక్ కాస్టిల్ నిర్మించి దానికి ది కాసా లోమా అని నామకరణం చేసారు. ఇందులో పూలతోటలు, గోపురాలు, దిమ్మెలు, ఎలివేటర్లు, రహస్య మార్గాలు, బౌలింగ్ అల్లే ఉన్నాయి. 19వ శతాబ్దంలో నిర్మించబడిన స్పాండినా హౌస్ ప్రస్తుతం మ్యూజియంగా మార్చబడింది.

టొరంటో నగరం నగరం చుట్టి భౌగోళికంగా 6 పురపాలకాలు ఉన్నాయి. సంవత్సరాలుగా ఒక్కో పురపాలనకు ఒక్కొ ప్రత్యేక చరిత్ర, ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నాయి. టొరంటో వాసులు ఆ పేర్లు సాధారణంగా వాడుతుంటారు. నగరం మొత్తంలో కొన్ని వందల చిన్న ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్న పెద్ద ప్రాంతాలు కూడా ఉన్నాయి. మునుపటి పురపాలు వరుసగా యోర్క్, ఎటోబికోక్, నార్త్ యోర్క్, ఓల్డ్ టొరంటో, స్కార్‌బారో, యోర్క్.

పాత టొరంటో

మార్చు
 
19వ శతాబ్దంలో టొరంటోలో ప్రసిద్ధిచెందిన అనెక్స్ శైలి గృహసమదాయం
 
ప్రస్తుత టొరంటో లోని మునుపటి 6 పురపాలకాల సరిహద్దులు

ప్రస్థ్తం డౌన్ టౌన్ ఉన్న ప్రాంతమే పాత టొరంటో నగరం అయినప్పటికీ డౌన్‌టౌన్ తూర్పు, పడమర, ఉత్తర దిశలలో ఉన్న పొరుగు ప్రాంతాలు కూడా పాత టొరంటోగానే భావించవచ్చు. చారిత్రక ప్రాధాన్యమున్న టొరంటో ప్రాంతంలోప్రస్తుతం జనసాంద్రత అధికం. కెనెడాకు చెందిన మొదటి ప్రాంతం ది ఫైనాంషియల్ డిస్ట్రిక్, టొరంటో డోమినియన్ సెంటర్, స్చూటియా ప్లాజా, కామర్స్ కోర్ట్, బ్రూక్ ఫిల్డ్ ప్లేస్ అని భావించబడుతుంది. పాతనగరంలో అదనంగా సెయింట్ జేంస్ టౌన్, గార్డెన్ డిస్ట్రిక్, సెయింట్ లారెంస్, క్రాజ్‌టౌన్, చర్చ్, వెలెస్లి ప్రాంతాలు కూడా చేరుతాయి. అక్కడి నుండి ఆకాశసౌధావళి ఉత్తరంగా యోంజ్ స్ట్రీట్ వెంట సాగుతుంది. పాత టొరంటో చారిత్రకంగా ప్రసిద్ధిచెందిన స్థానిక సంపన్నులైన యోర్క్ విల్లే, రోస్‌డాలే, ఫారెస్ట్ హిల్, డీర్ పార్క్, మూరే పార్క్, కాసా లోమా మొదలైన వారికి నివాసస్థలం. బాగా విస్తరించిన ఉత్తర, తూర్పు, పడమర డౌన్‌టౌన్ పరిసర ప్రాంతాలలో కెంసింగ్టన్ మాత్కెట్, చైనా టౌన్, లెస్లివెల్లి, కేబేజ్‌టౌన్, రివర్‌డేల్ మొదలైన ప్రాంతాలు వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా ఉండడమే కాక స్టోడియోలు కలిగిన కళాకారులకు నివాస స్థలాలుగా ఉన్నాయి. ఇక్కడ అనేక సంపన్న, మద్యతరహా వృత్తికి చెందినవారు నివసిస్తున్నారు. డౌన్‌టౌన్ ఇతర పరిసరాలు కూడా చైనాటౌన్, ది గ్రీక్ టౌన్ ప్రాంతం, లిటిల్ ఇటలీ, పోర్చ్‌గల్ విలేజ్, లిటిల్ ఇండియా, ఇతర సంప్రదాయాలకు చెందిన ప్రజల వంటి సంప్రదాయ గుర్తింపును కలిగి ఉంది.

శివారు ప్రాంతాలు

మార్చు

టొరంటో సరిహద్దులలో ఉన్న యోర్క్, తూర్పు యోర్క్ పూరపాలకాలలో పరిపక్వత కలిగిన సంప్రదాయకంగా పనిచేస్తున్న ప్రజలు నివసిస్తున్నారు. మొదటి ప్రపంచయుద్ధం తరువాత స్థిరపడిన చిన్నకుటుంబాల ప్రజల నివాసగృహసముదాయాలు ఉన్నాయి. క్రిసెంట్ టౌన్, థామ్‌క్లిఫ్, పార్క్, వెస్ట్రన్, ఓక్‌వుడ్-వ్యూఘన్ ప్రాంతాలలో ఉన్నతస్థాయి అపార్ట్మెంట్ భవనాలు ఉన్నాయి. ఇక్కడ అనేకంగా కొత్తగా స్థిరపడిన విదేశీప్రజలు నివసిస్తుంటారు. 2000 నుండి టొరంటో పరిసరప్రాంతాలు సంప్రదాయకంగా వైవిధ్యభరితంగా ఉంటాయి. 1990 చివరి కాలం, 21వ శతాబ్ధపు మొదటి దశాబ్ధంలో పెరుగిన జనసంఖ్య కొరకు నివాసగృహాల అవసరం అధికమైన కారణంగా పునరుద్ధరణ పనులు కూడా ఆరంభం అయ్యాయి. మొదటిసారిగా లీసీడై, ఉత్తర టొరంటోలు రియల్ ఎస్టేట్ అభివృద్ధి ప్రభావానికి గురైయ్యాయి. క్రమంగా ఈ అభివృద్ధి యోర్కులోని పడమర పరిసరప్రాంతాలకు కొనసాగింది. ఈ ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలలోని భవనాలు తిరిగి నిర్మించబడుతుండగా కొన్ని పునరుద్ధరించబడుతున్నాయి.

శివారు వెలుపలి పరిసర ప్రాంతాలైన మునుపటి పురపాలకాలైన ఎటోబికోక్ (వెసాట్), స్కార్‌బారో (వెస్ట్), నార్త్ యోర్క్ (యోర్క్) ప్రాంతాలలో యుద్ధానంతర అభివృద్ధికి విశాలమైన వీధుల నిర్మాణం మొదలైంది. శివారుప్రాంత రియల్ ఎస్టేట్ అభివృద్ధి ఆరంభమయ్యే ముందుగానే ఇక్కడ పొడవైన బృహత్తరమైన నివాసగృహ సముదాయాల నిర్మాణం మొదలైంది. ఎటోబికోక్ లోని మిమికో, ఐలింగ్టన్, న్యూ టొరంటో; విల్లోడేల్, న్యూటన్‌బ్రూక్, యోర్క్ లోని డౌంస్‌వ్యూ; స్కార్‌బరోహ్ జిన్‌కోర్ట్, వెక్స్‌ఫోర్డ్, వెస్ట్ హిల్ ప్రాంతాలలో 1940 చివరిదశలో అభివృద్ధి మొదలైంది. ఉత్తర యోర్క్ వంతెన మార్గం, గుల్డ్‌వుడ్ లోని స్కార్‌బరో బ్లఫ్స్ పరిసరప్రాంతాలు, మద్య ఎటోబికోక్, హంబర్ వెల్లీ విలేజెస్, ది కింగ్స్‌వే మొదలైన ప్రాంతాలలో బృహాతర ప్రణాళికతో భవనాలు నిర్మించబడ్డాయి.1950లో డాన్‌ మిల్స్ ప్రాంతంలో మొదటి సారిగా ప్రత్యేక సంప్రదాయ ప్రజలకు బృహత్తర ప్రణాళికాబద్ధమైన నివాసగృహసముదాయం నిర్మించబడ్డాయి. శివారు ప్రాంతాలలో విడిగా విడిగా ప్రత్యేక నివాస గృహాల సముదాయం నిర్మాణశైలి ప్రజలను ఆకర్షించింది. 20-21 శతాబ్దం అంతా ఉత్తర యోర్క్ సిటీ సెంటర్, ఎటోబికోక్ సిటీసెంటర్, స్కార్‌బారోహ్ సిటీసెంటర్ మొదలైనవి టొరంటో డౌన్‌టౌన్ వెలుపలి వాణిజ్య కేంద్రాలుగా (సెకండరీ బిజినెస్ డిస్ట్రిక్ ) అభివృద్ధి చెందాయి. మునుపటి పురపాలకాలలో కొనసాగిన ఆకాశసౌధాల అభివృద్ధి ఈ ప్రాంతానికి హై-డెంసిటీ ట్రాంసిస్ట్ కారిడార్లను తీసుకువచ్చింది.

దర్శనీయ ప్రదేశాలు

మార్చు

టొరంటో నగరంలో చూడవలసిన ప్రదేశాలు అనేకం ఉన్నాయి. సునదరమైన లోయలతో నిండిన పబ్లిక్ పార్కుల నుండి సిటీ స్క్వేర్ వంటివి ఈ వరుసలో చేరతాయి. నగరంలోని దర్శనీయ ప్రదేశాలను సంరక్షించడానికి ది టొరంటో పబ్లిక్ స్పేస్ కమిటీ బృందం ఏర్పాటు చేయబడింది. డౌన్‌టౌన్‌లో ఉన్న దర్శనీయ ప్రదేశాలలో నాథన్ ఫిలిప్స్ స్క్వేర్ ఒకటి ఇక్కడ నుండి సిటీసెంటర్‌కు వెళ్ళడానికి మార్గం ఉంది. సిటీహాలుకు సమీపంలో ప్రైవేట్ యాజమాన్యంలో కొత్తగా నిర్మించబడిన దర్శనీయ ప్రదేశం యోజ్ దండాస్ స్క్వేర్ కూడా నగరవాసులను సమీపకాలంలో విపరీతంగా ఆకర్షిస్తూ ప్రజలు విపరీతంగా కూడే ప్రదేశంగా మారింది. అదనంగా పునరుద్ధరించబడిన టొరంటో జలాశయతీరంలో ఉన్న హార్బర్ ఫ్రంట్ స్క్వేర్, ప్రస్తుతం వాడుకలో లేని ది ఫార్మర్ సిటీ హాల్స్, నార్త్ యోర్కులోని సుప్రసిద్ధమైన మెల్ లాస్ట్‌మన్ స్క్వేర్ మొదలైవి టొరంటో నగరంలో దర్శనీయ ప్రదేశాలలో ప్రధానమైనవి.

డౌన్‌టౌన్‌లో గ్రాంజ్ పార్క్, మాస్ పార్క్, ఆలెన్ గార్డెంస్, లిటిల్ నార్వేపార్క్, రివర్‌డెల్ పార్క్, క్వీంస్ పార్క్, ట్రిన్లీ బెల్‌వుడ్స్ పార్క్, క్రిస్టల్ పిట్స్, లెస్టిల్ స్ట్రీట్ స్పిట్ వంటి పలు పెద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. టమీ థాంసన్ పార్క్ అనబడే లెస్టిల్ స్ట్రీట్ స్పిట్ వారాంతపు శలవు దినాలలో మాత్రమే తెరచి ఉంటుంది. టొరంటో ద్వీపాలలో పలు ఎకరాలలో విస్తరించి ఉన్న పార్కులు అనేకం ఉన్నాయి. డౌన్‌టౌన్‌నుండి ఫెర్రీలలో ప్రయాణించి వీటిని చేరుకోవచ్చు. ఇతర ప్రాంతాలలో ఉన్న హైపార్క్, హంబర్ బే పార్క్, సెంటెన్నియల్ పార్క్, డౌంస్ వ్యూ పార్క్, గుల్డ్‌వుడ్ పార్క్, రూజ్ పార్క్ నటివి ఉన్నాయి. డౌన్‌టౌన్ టొరంటోలో ఉన్న కాంపాక్ట్ క్లౌడ్ పార్క్ లోని కొంతభాగం బహిరంగ ప్రదేశం మరికొంత భాగం గ్రీంహౌస్ గ్లాస్ షెడ్లు ఉన్నాయి.

నాథన్ ఫిలిప్స్ స్క్వేర్, హార్బర్‌ఫ్రంట్ సెంటర్, మెల్‌లాట్స్‌మన్ స్క్వేర్ ఫీచర్ పాపులర్ రింక్స్ ప్రజలు ఐస్-స్కేటింగ్ చేయడానికి ఉపయోగంగా ఉంటుంది. 2011లో ఎటోనికోక్స్ కొలేనల్ శాం ట్రైల్ ఆరంభించబడ్డాయి. టొరొంటోలోని మొదటి సేటింగ్ పార్క్ ఇదే. సెంటెన్నియల్ పార్క్, ఎర్ల్ బేల్స్ పార్క్ ఔట్ డోర్ స్కీయింగ్, స్నోబోర్డింగ్ స్లాప్స్ సౌకర్యాన్ని రుసుము తీసుకుని ఆడుకోవడానికి, నేర్చుకోవడానికి సౌకర్యం కలిగిస్తున్నాయి.

నాథన్ ఫిలిప్స్ స్క్వేర్ PLANT ఆర్కిటెక్ట్ ఇంక్, షోర్ Tilbe ఇర్విన్ + భాగస్వాములు, పీటర్ లిండ్సే Schaudt ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ ఇంక్, అడ్రియన్ బ్లాక్వెల్ (2007 లో అంతర్జాతీయ డిజైన్ పోటీ విజేతలు) ద్వారా ఒక పెద్ద పునఃరూపకల్పన దశలో ఉంది. వెస్ట్ 8, ఒక డచ్ వాస్తునిర్మాణ సంస్థ, టొరంటో వాటర్ఫ్రంట్ యొక్క కేంద్ర భాగం మళ్ళీ డిజైన్ 2006 లో సెంట్రల్ వాటర్ ఫ్రంట్ వినూత్న డిజైన్ పోటీ గెలుపొందాడు. [35] [36] 1999 లో, Downsview పార్క్ కెనడా యొక్క సృష్టించే దాని దృష్టి గ్రహించడం ఒక అంతర్జాతీయ రూపకల్పన పోటీ ప్రారంభించారు మొదటి జాతీయ పట్టణ పార్క్. మే 2000 లో, విజేత పార్క్ రూపకల్పన ప్రకటించారు: "TREE నగరం", బ్రూస్ మాయు డిజైన్, మెట్రోపాలిటన్ ఆర్కిటెక్చర్, ఓలెసన్ Worland ఆర్కిటెక్ట్, లోపల / బయట కార్యాలయము జట్టు.

 
నాథన్ ఫిలిప్స్ స్క్వేర్ సమగ్ర దృశ్యం 2011

పరిశ్రలు

మార్చు
 
టొరంటోలోని హైలాండ్ పార్క్

టొరంటో పారిశ్రామిక యుగంలో దిగువ పరిశ్రమలు డాన్‌నది ముఖద్వారం, టొరంటో హార్బర్ ప్రాంతంలో కేంద్రీకృతం అయ్యాయి. ఒకప్పుడు ఆల్కహాల్ తయారీ కేంద్రం సంబంధిత నిర్మాణాలు హార్బర్ పక్కన ఉన్నాయి. మాల్టింగ్ కో, గ్రైన్ ప్రొసెసింగ్ టవర్స్, రెడ్‌పాత్ సుగర్ రిఫైనరీ మొదలైనవి ఇక్కడే ఉన్నాయి. అయినప్పటికీ స్పిరిట్ తయారీ దశాబ్ధాలుగా క్షీణిస్తూ ఉన్నాయి. టొరంటోలో ఇంకా మైక్రోబ్రివరీ ఇండస్ట్రీ ఉంది. ఈ డిస్ట్రిక్ జాతీయ వారసత్వ సంపదగా సంరక్షించబడుతుంది. పర్యాటకులు సందర్శించవలైన వాటిలో ఉత్తమమైనదని నేషనల్ జియోగ్రాఫిక్ పత్రిక శ్లాఘించింది.ఇలాంటి కొన్ని ప్రాంతాలు వాటి పారిశ్రామిక స్థాయిని చాటుతున్నప్పటికీ ఫాషన్ డిస్ట్రిక్‌లోని కార్క్‌టౌన్, రివర్‌డెల్, లెస్లివెల్లి లోని కొన్ని ప్రాంతాలలో సరికొత్త బృహత్తర నివాసగృహసముదాయాలు ఉన్నాయి. టొరంటోలో ఇంకా చురుకుగా పనులు జరుగుతున్నబ్రోక్టన్ విలేజ్, మిమికో, న్యూ టొరంటో పరిశ్రమలు ఉన్నాయి. ఉత్తర టొరంటో, యోర్క్, ది వెస్టన్/మోంట్, డెన్నిస్, జంక్షన్ ప్రాంతాలలో మాంసం ప్యాకేజ్ వసతులు, రెయిల్ యార్డ్స్ వంటి మద్యతరహా జనసాంద్రత కలిగిన పరిశ్రమలు ఉన్నాయి.

19వ శతాబ్ధపు ఆరంభంలో టొరంటో విస్తరణ సమయంలో పరిశ్రమలు నగరానికి వెలుపలి ప్రాంతాలలో ఉండిపోయాయి. అంతేకాక పారిశ్రామలు అధికంగా రైలు మార్గాల పక్కన ఉంటూ వచ్చాయి. తరువాత హైవేలకు పక్కన కూడా పరిశ్రమలు చోటుచేసుకున్నాయి. క్రమంగా నగరం శివారుప్రాంతాలలో అభివృద్ధి కొనసాగింది. ఇప్పటివరకూ ఈ తరహా అభివృద్ధి కొనసాగుతూనే ఉంది. అందువలన పలు బృహత్తర పరిశ్రమలు, డిస్ట్రీబ్యూషన్ గోడౌన్లు నగరశివార్లలోని పీల్, యోర్క్ తరలించబడ్డాయి. అయినప్పటికీ టొరంటో లోని ప్రస్తుత డౌన్‌టౌన్ సమీపంలో ఉన్న మునుపటి పారిశ్రామిక ప్రాంతాలు ఎటోబికోక్, నార్త్ యోర్క్, స్కార్‌బారోహ్ వంటి ప్రాంతాలలో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. పునరుద్ధరణ కార్యక్రమాలు టొరంటో వాటర్ ఫ్రంట్, లైబ్రరీ విలేజ్, వెస్ట్ డన్ లాండ్ ప్ర్రంతాలలో బృహత్తర ప్రణాళికతో కొనసాగుతున్నాయి. ఇప్పటికీ పవర్ ప్లాంట్, షాపింగ్ కంటెయినర్ ఫెసిలిటీ, ఇండస్ట్రియల్ ఫెసిలిటీస్ వంటి పలు ఖాళీ ప్రాంతాలు అభివృద్ధి లేకుండా మిగిలి ఉన్నాయి.

ఆర్ధికరంగం

మార్చు

టొరంటో అంతర్జాతీయ ఆర్థికవ్యవహారాల, వాణిజ్య కేంద్రంగా ప్రాముఖ్యత చెందినది. సాధారణంగా టొరంటో కెనడాదేశానికి ఆర్థిక కేంద్రంగా గుర్తింపు పొందింది. టొరంటోలో ఫైనాంషియల్ డిస్ట్రిక్ లోని బేస్ట్రీటులో అత్యధికంగా బ్యాంకులు, బ్రోకరేజ్ సంస్థలు కేంద్రీకృతమై ఉన్నాయి. టొరంటో స్టాక్ ఎక్స్చేంజ్ ప్రపంచంలో ఏడాస్థానలో ఉంది. టొరంటోలో బిగ్ ఫైవ్ అనే ఐదు ఫైనాంషియల్ ఇంస్టిట్యూషన్ల జాతీయ కార్యాలయాలు ఉన్నాయి.

నగరం ప్రధానంగా మాధ్యమం, ప్రచురణ, సమాచార రంగం, టెలి కమ్యూనికేషన్, చలనచిత్ర నిర్మాణం వంటి రంగాలకు కేంద్రంగా ఉంది. బెల్ మీడియా, రోజర్స్ కమ్యూనికేషన్, టార్‌స్టార్ వంటి సంస్థలకు టొరంటో మూలస్థానం. టొరంటో మహానగర ప్రాంతంలో మాగ్నా ఇంటర్నేషనల్, సెలెస్టికా, మాన్యూలైఫ్ ఫైనాంషియల్, సన్ లైఫ్ ఫైనాంషియల్, ది హడ్సన్ బే కంపనీ, ప్రధాన హోటల్స్, ఫియామోంట్ హోటెల్స్, రిసార్ట్స్ ఉన్నాయి.

ఈ ప్రాంతంలోని తయారీ సంస్థలు అధికంగా నగర శివార్లకు వెలుపల ఉన్నప్పటికీ టొరంటోలో పరిశ్రమలో తయారైన వస్తువుల హోల్సేల్, వితరణ కేంద్రాలు ఉన్నాయి. వ్యూహాత్మకమైన నగరనిర్మాణం లోని క్యూబెక్ సిటీ, విండ్సర్ కారిడార్, నగరం లోని రహదార్లు, రైలు మార్గాలు సమీపంలోని వాహనాలు, ఇనుము, స్టీల్, ఫుడ్, మిషనరీ, రసాయనాలు, కాగితం తయారీ సంస్థల వస్తువుల రవాణాకు అనుకూలంగా ఉన్నాయి.

2010 నగరం చెల్లించవలసిన ౠణాల మొత్తం 4.4 బిలియన్ డాలర్లలో 2011 నాటికి 400 బిలియన్ల డాలర్లను తిరిగి చెల్లించాలని ఎదురు చూసారు, అయినప్పటికీ నగర ౠణాలు 2010 చివరకు 721 మిలియన్ డాలర్లు అధికరించాయి. 2011 గణాంకాలు నగరంలో నిరుద్యోగం 8.1% ఉన్నదని తెలియజేస్తున్నాయి. 2011 గణాంకాలు టొరంటో జీవనవ్యయం కెనడాలోనే అత్యధికమని తెలియజేస్తున్నాయి.

సంస్కృతి

మార్చు
 
రాయల్ అలెక్జాండ్రియా థియేటర్

టొరంటో దియేటర్ అండ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ 50 కంటే అధికంగా బ్యాలెట్, నృత్య కంపనీ ప్రదర్శనలు, సింఫోనీ ఆర్కెస్ట్రాస్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. నేషనల్ బ్యాలెట్ ఆఫ్ కెనడా, ది కెనెడియన్ ఒపేరా కంపెనీ, ది టొరంటో సింఫోనీ ఆర్కెస్ట్రా, ది కెనెడియన్ ఎలెక్ట్రానిక్ ఎంసెంబుల్, ది కెనెడియన్ స్టేజ్ కంపనీ ఆరంభించబడినది టొరంటో నగరంలోనే. నగరంలో ది ఫోర్ సీజంస్ సెంటర్ ఫర్ ది పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్, రాయ్ థాంసన్ హాల్, ది ప్రింసెస్ ఆఫ్ వేల్స్ దియేటర్, ది రాఅల్ అలెక్జాండ్రియా దియేటర్, మాసే హాల్, ది టొరంటో సెంటర్ ఫర్ ది ఆర్ట్స్, ది ఎల్జిన్ అండ్ వింటర్ గార్డెన్ దియేటర్స్, ది సోనీ సెంటర్ ఫర్ ది పర్‌ఫార్మింగ్ ఆర్ట్స్ (సాధారణగా దీనిని " ది ఓ కీఫ్ సెంటర్ ", హమ్మింగ్‌బర్డ్ సెంటర్ అంటారు ) మొదలైన గుర్తింపు పొందిన ప్రార్శనా వేదికలు ఉన్నాయి.

ఒంటారియో ప్రాంతంలో ప్రపంచంలో మొదటి పర్మనెంట్ ఐమాక్స్ దియేటర్, ది చైనీస్‌ఫేర్, మోల్‌సన్ ఆంఫిదియేటర్, సగీత ప్రదర్శనల కొరకు ఓపెన్ ఎయిర్ వెన్యూ ఉన్నాయి. 2012 వసంతకాలంలో కొనతకాలం మూసివేయబడింది. అయినప్పటికీ మోల్సన్ ఆంఫీ దియేటర్, హార్బరులు ఇంకా చురుకుగా పనిచేస్తున్నాయి. ది పార్క్, చైనీస్‌ఫేర్‌లు ఎక్కువకాలం ఉపయోగంలో లేవు.

ది కెనెడియన్ స్టేజ్ కంపనీ ప్రతి వేసవిలో టొరంటోలోని హైపార్క్‌లో " డ్రీం ఇన్ హైపార్క్" పేరుతో బహిరంగ వేదిక మీద షేక్స్‌ఫియర్ నాటకాలను ప్రదర్శిస్తుంటారు. నగరంలోని కింగ్ స్ట్రీట్, సింకో స్ట్రీట్‌లలో " కెనడాస్ వాక్ ఆఫ్ ఫేం అక్నాలెడ్జెస్ ఆఫ్ సక్సెస్‌ఫుల్ కెనెడియంస్ " పేరిట విజయవంతమైన కెనెడాపౌరుల గౌరవార్ధం ప్రజాదరణ పొదిన నక్షత్రస్థాయి వ్యక్తులు నడుస్తూ ప్రదర్శన నిర్వహిస్తారు.

నగరంలో దేశీయ, విదేశీ చలనచిత్ర, టెలివిజన్ కార్యక్రమాలను తయారుచేయడం ప్రధాన ప్రాంతీయ పరిశ్రమగా గుర్తింపు పొందింది. 2011 టొరంటో చలనచిత్ర, టెలివిజన్ కార్యక్రమాలను రూపొందించడంలో అంతర్జాతీయంగా మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో లాస్ ఏంజలెస్ మరుయు న్యూయార్క్ నగరాలు ఉన్నాయి. హాలీవుడ్ నార్త్ అనే మారుపేరును వాంకోవర్ నగరంతో పంచుకుంటుంది. ప్రతి సంవత్సరం టొరంటో నగరంలో అంతర్జాతీయ ఫిలిం ఇండస్ట్రీ " ది టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ " పేరిట చలనచిత్రోత్సవం నిర్వహించబడుతుంది. టొరంటో ప్రతిష్ఠాత్మకంగా జరుపుకుంటున్న మరొక చలనచిత్రోత్సవం " ది టొరంటీ స్టూడెంట్ ఫిలిం ఫెస్టివల్". ఈ ఉత్సవంలో 12-18 సంవత్సరాల విద్యార్థుల చలన చిత్రాలు ప్రదర్శించబడతాయి.

నగరంలో ప్రతి వేసవిలో జూన్ మద్య నుండి ఆగస్ట్ ఆరంభం వరకూ టొరంటో స్కూటియా బాంక్ కరిబ్బీన్ కార్నివల్ (ఫార్మర్లీ దీనిని కర్బానా అంటారు) ను నిర్వహిస్తారు. గతంలో ట్రినిడాడ్, టొబాగో కార్నివల్ ఆధారంగా నిర్వహించబడేది. నగరంలోని కరిబ్బీన్ సమూహం కారిబానా ఉత్సవాన్ని 1967లో మొదటిసారిగా నిర్వహించారు. 40 సంవత్సరాల అనంతరం ఈ ఉత్సవాలు 10లక్షలకంటే అధిక ప్రజలను ఆకర్షించసాగాయి. ఈ ఉత్సవాల కారణంగా ఒంటారియో పర్యాటక రంగానికి ప్రతి సంవత్సరం 400 మిలియన్ డాలర్లకంటే అధికంగా ఆదాయం లభిస్తుంది. జూన్ చివరిలో " ప్రైడ్ వీక్ " నగరంలో అతి పెద్ద ఉత్సనంగా భావించబడుతుంది. అలాగే ఈ ఉత్సవం ప్రపంచంలో అతి పెద్ద ఎల్.జి.బి.టి ఉత్సవంగా గుర్తింపు పొందింది.

పర్యాటకం

మార్చు
 
రాయల్ దియేటర్
 

రాయల్ ఓంటారియా మ్యూజియం (ఆర్.ఒ.ఎం ) సంగ్రహాలయం, 460 ప్రత్యేక జాతులకు చెందిన 5,000 జంతువులు నిలయం అయిన టొరంటో జూ, కెనెడియన్, యూరోపియన్, ఆఫ్రికన్, సమకాలీన కళ వస్తువులను విస్తారంగా సేకరించిన అంటారియో ఆర్ట్ గ్యాలరీ ఉన్నాయి. ఈ మ్యూజియంలో అంతర్జాతీయ ఆర్ట్ గ్యాలరీలు, పురాతన వస్తు ప్రదర్శన నిర్వహిస్తుంది. కెనడా లోసిరమిక్స్ వస్తువులకు మాత్రమే పూర్తిగా అంకితమమైన సిరామిక్ ఆర్ట్ ఆఫ్ గార్డినర్ మ్యూజియంలో ఆసియా, అమెరికా, యూరోప్ నుండి సేకరించబడిన 2,900 సిరామిక్ కళాఖాండాలను కలిగి ఉంది. నగరంలో ఒంటారియో సైన్స్ సెంటర్, బాటా షూ మ్యూజియం, యొక్క టెక్స్టైల్ మ్యూజియం ఆఫ్ కెనడా మ్యూజియంలను నిర్వహిస్తుంది. ఇతర ప్రముఖ కళా గ్యాలరీలలో, మ్యూజియంలలో డిజైన్ ఎక్స్చేంజ్, ఇన్యుట్ ఆర్ట్ మ్యూజియం, టి.ఐ.ఎఫ్.ఎఫ్ బెల్ లైఅత^బాక్స్, సమకాలీన కెనడియన్ ఆర్ట్ మ్యూజియం, సమకాలీన సంస్కృతి కొరకు ఇన్స్టిట్యూట్, టొరంటో స్కల్ప్చర్ గార్డెన్, సి.బి.సి మ్యూజియం, రెడ్‌పాత్ షుగర్ మ్యూజియం, టొరంటో ఆర్ట్ సెంటర్ విశ్వవిద్యాలయం, హార్ట్ హౌస్ మొదలైనవి ఉన్నాయి అదనంగా ఇంస్ట్యూట్ ఆఫ్ ఆర్ట్, ఫ్యూచర్ అగా ఖాన్ మ్యూజియం యొక్క టి.డి గ్యాలరీలు ఉన్నాయి. నగరంలో స్వంతగా నడుపుతున్న స్పాండినా హౌస్ మ్యూజియం ఉంది.

 
సి.ఎన్. టవర్

1889 లో ప్రారంభించబడిన ది డాన్ వెల్లీ బ్రిక్ వర్క్స్ లోని కొంతభాగం 1996లో పార్క్ గా మార్చబడింది. అప్పటి నుండి అదనంగా పునరుద్దరణ పనులు జరుగుతున్నాయి. ఎగ్జిబిషన్ ప్రదేశంలో ప్రతిసంవత్సరం కెనెడియన్ నేషనల్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది. ఈ ఎగ్జిబిషన్ ప్రతిసంవత్సరం సుమారుగా 1.25 మిలియన్ల ప్రజలను ఆకర్షిస్తుంది.

యోర్క్ వెల్లి పరిసరరాలు, క్వీన్ వెస్ట్, హార్బర్ ఫ్రంట్, ది ఎంటర్టెయినెంట్ డిస్ట్రిక్, సెయింట్ లారెంస్ మార్కెట్ పరిసరాలు ప్రధాన షాపింగ్ సెంటర్లాను కలిగి ఉన్నాయి. టొరంటో లోని అత్యంత ఆకర్షణీయమైన షాపింగ్ సెంటర్లలో ఒకటి అయిన ఈటన్ షాపంగ్ సెంటర్ సంవత్సరానికి 52 మిలియన్ల ప్రజలను ఆక్కర్షిస్తున్నది.

డాన్‌ఫోర్త్ లోఇ గ్రీక్‌టౌన్ ప్రతి సంవత్సరం " టేస్ట్ ఆఫ్ ది డాన్‌ఫోర్త్ " ఉత్సవాన్ని నిర్వహిస్తున్నది. ఈ ఉత్సవం 21/2 రోజులలో 10 లక్షల మంది ప్రజలను ఆకర్షిస్తున్నది. ప్రముఖ టొరంటో ఫైనాంషియర్, పారిశ్రామిక వేత్త, సైన్యాధికారి అయిన సర్ హెంరీ పుట్టిన ఊరు ఇదే. గుర్తించతగిన పరిసరాలలోని ఇతర ఆకర్షణలు బీచులు, టొరంటో ద్విపాలు, కెంసింగ్టన్ మార్కెట్, ఫోర్ట్ యోర్క్, హాకీ హాల్ ఆఫ్ ఫేం ముఖ్యమైనవి.

 
1900 లిటిల్ ఇటలీ

2006 గణాంకాలననుసరించి నగర జనసంఖ్య 25,03,281.టొరంటో కెనడాలోనే అతిపెద్ద నగరంగా అభివృద్ధి చెందింది. అలాగే జనసంఖ్యలో ఉత్తర అమెరికా నగరాలలోఐదవ స్థానానికి చేరుకుంది. 1996-2001 నగరంలో జనసంఖ్య (96,073) 4% పెరిగింది, అలాగే 2001-2006 మద్యకాలంలో జనసంఖ్య (21,787) 1% పెరిగింది, అలాగే 2006-2011 మద్య కాలంలో జనసంఖ్య (1,11,779) జనసంఖ్య 4.3% పెరిగింది.14 సంవత్సరాల లోపు వయసున్న వారు 17.5%, 65 సంవత్సరాలకంటే వయసున్న వారు 13.6%. సరాసరి వివాహ వయసు 36.9 సంవత్సరాలు. జనాభాలో విదేశీలో పుట్టిన పౌరులు 49.9% ఉన్నారు. పురుషులు 48%, స్త్రీలు 52%. 20 సంవత్సరాలకు పైబడిన వారిలో స్త్రీల సంఖ్య అధికంగా ఉంది. అల్పసంఖ్య వర్గాలకు చెందిన ప్రజలు 46.9% ఉన్నారని 2006 గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2017 నాటికి టొరంటో నగరంలో అల్పసంఖ్య వర్గాలకు చెందిన ప్రజలు అధికంగా ఉంటారని భావిస్తున్నారు. 1981 టొరంటో అలపసంఖ్యాకులు 13.6% ఉండేవారు. యునైటెడ్ నేషంస్ డెవలెప్మెంట్ ప్రోగ్రాం విదేశంలో పూట్టిన పౌరులు అధికంగా ఉన్న అంతర్జాతీయ నగరాలలో టొరంటో నగరం ద్వితీయ స్థానంలో ఉందని అభిప్రాయపడుతుంది. మొదటి స్థానంలో మియామి, ఫ్లోరిడా ఉన్నాయి. మైమి విదేశంలో పూట్టిన పౌరులు క్యూబా, లాటిన్ అమెరికాకు చెందినవారు. టొరంటో నగర విదేశీ వలస ప్రజలలో ఒకే సంప్రదాయానికి చెందినవారెవరు సంఖ్యా పరంగా ఆధిక్యత కలిగి లేరు. ఈ కారణంగా టొరంటో ప్రపంచంలో అత్యధిక వైవిధ్యమైన ప్రజలు కలిగిన నగరంగా గుర్తింపు పొందింది. సంవత్సరానికి టొరంటో నగరానికి 1,00,000 కంటే అధికమైన ప్రజలు వలస వస్తుంటారు. 2006 లో గణాంకాలు నగరంలో ఇంగ్లండుకు చెందిన ప్రజలు 15.9%, కెనడా 12.8%, స్కాట్ లాండ్ 11.1%, చైనా 10.6%, ఐర్లాండ్ 10.5%, ఇండియా 9,6%, ఇటలీ 9.2%, జర్మనీ 5.1%, ఫ్రాన్స్ 4.8%, పోలాండ్ 4.1%, పోర్చ్‌గల్ 3.7%, ఫిలిప్పైంస్ 3.6%, జమైకా 3.2% ఉన్నట్లు తెలియజేస్తున్నాయి. టొరంటో నగరంలో మొదటి ఐదు స్థానాలలో అధికసంఖ్యలో ప్రజలు ఉన్న దేశాలు వరుసగా సౌత్ ఆసియన్లు 12.0%, చైనీయులు 11.4%, నల్లజాతి వారు 8.4%, ఫిలిప్పైన్లు 4.1%, లాటిన్ అమెరికన్లు 20.6%. స్థానికులు .5%. ఈ వైవిధ్యానికి ఫలితంగా టొరంటో సమీపంలో చైనా టౌన్, కార్సో ఇటాలియా, గ్రీక్ టౌన్, కెంసింగ్టన్ మార్కెట్, కొరియా టౌన్, లిటిల్ ఇండియా, లిటిల్ ఇటలీ, లిటిల్ జమైకా, లిటిల్ పోర్చ్ గల్, రాంవాలేస్ వంటి భిన్న సంస్కృతికి చెందిన వారి ప్రాంతాలు అధికంగా ఉన్నాయి.

టొరంటోలో క్రిస్టియన్ల సంఖ్య అధికం. 2001 గణాంకాలు 33.4% ప్రజలు కాథలిక్కు మతానికి చెందిన వారని, ప్రొటెస్టెంట్ మతానికి చెందిన వారు 21.1%, క్రిస్టియన్ ఆర్థడాక్స్ 4.8%, కోప్టిక్ ఆర్థడాక్స్ 0.2% ఉతర క్రిస్టియన్లు 3.9% ఉన్నారు. మెథడిస్ట్ క్రిస్టియన్లు అధికంగా ఉన్నందున టొరంటోను కొన్నిసమయాలలో మెథాడిస్ట్ రోం అని పిలుస్తుంటారు. ఇతర మతానికి చెందిన వారులో ఇస్లాం మతస్థులు 5.5%, హిందువులు 4.1%, జూడిజం 3.5%, బుద్ధిజం 2.1%, సిక్కులు 1.9%, తూర్పు మతాలకు చెందిన వారు 02%. ఏమతానికి చెందని వారు 16.6% ఉన్నారు.

టొరంటోలో అత్యధికులు ఆంగ్లభాషను మాట్లాడుతుంటారు. ప్రంతీయ వాసులు అనేక భాషలను మాట్లాడుతుంటారు. చైనా భాషలు, ఇటాలియన్ రెండు, మూడవ స్థానంలో ఉన్నాయి. ఫలితంగా నగరంలో ఎమర్జెంసీ సేవలైన 9-1-1 పనిచేయాడానికి స్పందించడానికి 150 భాషలు అవసరం ఔతున్నాయి.

ప్రభుత్వము

మార్చు
 
కెనడా టొరంటో వార్డుల మ్యాప్
 
టొరంటో సిటీహాల్

టొరంటో నగరం మేయర్-కౌన్సిల్ సిస్టమ్ అధ్వర్యంలో నిర్వహింపబడుతున్న సింగిల్-టైర్ మున్సిపాలిటీ.నగర మేయర్‌ను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు.నగర పాలనా 44 కౌనిలర్లచే నిర్వహించబడుతుంది.నగరాన్ని వార్డులుగా విభజించి పాలనా వ్యవహారాలు నడుపుతుంటారు.మేయర్, సభ్యులు 4 సంవత్సరాలకాలం పాలనా బాధ్యతలు స్వీకరిస్తారు.వీరు ఎన్నికలలో పాల్గొనడానికి ఎటువంటి పరిమితులు ఉండవు.

నగర కౌన్సిల్‌ను ఏడు కమిటీలుగా విభజించి ఒక్కో విభాగానికి ఒక చైర్ ఒక వైస్ చైర్ నలుగురు కౌన్సిల్ సభ్యులు ఉంటారు.చైర్ సభ్యులను మేయర్ ప్రతిపాదిస్తాడు.మిగిలిన సభ్యులు సిటీ కౌన్సిల్‌చే నియమించబడతారు.ఒక్కొక్క కమిటీ సభ్యులతో నిర్వహణా కమిటీ ఏర్పాటు చేయబడుతుంది.

సిటీ కౌన్సిల్‌ పరిధిలో 40 సబ్‌కమిటీలు,అడ్వైసరీ కమిటీ, రౌండ్ టేబుల్స్ ఉంటాయి.వీటిలో చిటీ కౌన్సిల్ సభ్యులు, స్వచ్ఛంద సేవకులు పనిచేస్తారు.అదనంగా నగరంలో నాలుగు కమ్యూనిటీ కౌన్సిల్స్ పనిచేస్తుంటాయి.వీరు ప్రాంతీయ విషయాలను సిటీ కౌన్సిల్‌కు చేరవేసి కావలసిన అనధికార ప్రతిపాదనలు చేస్తుంటారు.ఒక్కొక్క సిటీ కౌన్సిల్‌ కమ్యూనిటీ కౌన్సిల్ సభ్యుడుగా సేవలందిస్తాడు.

2006టొరంటో నిర్వహణా ప్రణాళిక వ్యయం 6 బిలియన్ల కెనడియన్ డాలర్లు.నగరానికి అధికంగా ఒంటారియా ప్రభుత్వం నిధులన మంజూరు చేస్తుంది అదనంగా టొరంటో నగరం ఆదాయపు పన్ను మరి ఇతర ఆదాయం ఉంటాయి.

నేరము

మార్చు

టొరంటో నగరంలో నేరాల శాతం స్వల్పమే.ఉత్తర అమెరికాలో ఈ నగరం సురక్షితమైనదిగా గుర్తింప బడింది.1999లో గృహాంతర్గత హత్యలు 1,00,000 మందిలో 1.9 గా నమోదైంది.దోపిడీల సంఖ్య 1,00,000 మందికి 115,1 గా నమోదైంది.మొత్తం నేరాలసంఖ్య 1,00,000 మందికి 48.కారు దొంగతనాలు ఎక్కువే అయినా కెనడా నగరాలతో పోల్చినట్లైతే ఈ నగరంలో అధికం కాదు.టొరంటో పోలీస్ తుపాకీ కాల్పులు గ్యాంగ్, అల్పజాతియుల మధ్య వైరాలు నమోదు చేసింది.

టొరంటో నగరం 1991లో అత్యధిక గృహాంతర్గత హత్యలను (89) నమోదు చేసింది.ఇది ఒక 1,00,000 మందికి 3.9.టొరటో మాద్యమం 2005ను ఇయర్ ఆఫ్ ది గన్ గా వర్ణించింది ఆ సంవత్సరంలో నమోదైన 80 హత్యలలో 52 తుపాకీకి సంబంధించినవే కావడం ఇందుకు కారణం.2006 నాటికి గృహాంతర్గత హత్యల సంఖ్య 69కి తగ్గింది.అదే సంవత్సరం తుపాకీ సంబంధిత నేరాల వలన బాధ పడినవారి సంఖ్య 2,000. ఇది దేశంలో జరిగిన వాటిలో నాల్గవభాగం.2007లో 84 హత్యలు నమోదుకాగా వాటిలో సుమారు సగం పైగా తుపాకికి సంబంధించినవే.గ్యాం సంబధిత నేరాలు 1997, 2005ల మధ్య అధికం అయ్యాయి.ఈ సమయంలో 300 పైగానే హత్యలు నమోదైయ్యాయి.ఫలితంగా ఒంటారియా ప్రభుత్వం తుపాకీ ఉపయోగంపై నిషేధించాలని ఉవ్యూహాత్మక ప్రయత్నాలు చేపట్టింది.

విద్య

మార్చు
 
యూనివర్శిటీ ఆఫ్ టొరంటో

టొరంటో అనేక ఉన్నత విద్యాసంస్థలు ఉన్నాయి.1827లో ఒంటారియో ప్రభుత్వ విశ్వవిద్యాలయం యూనివర్శిటీ ఆఫ్ టొరంటో ప్రస్తుతం ప్రథమ స్థానంలో ఉన్న పరిశోధనా సంస్థ.ఈ విశ్వవిద్యాలయం బయోమెడికల్ పరిశోధనలలో అంతర్జాతీయ గుర్తింపు పొందింది.ఈ విశ్వవిద్యాలయంలో ఉన్న గ్రంథాలయం అమెరికాలో మూడవ స్థానంలో ఉంది.టొరంటో ఉత్తర సరిహద్దులలో హార్వర్డ్ యూనివర్శిటీ,యేల్ యూనివర్శిటీ, యోర్క్ యూనివర్శిటీలు ఉన్నాయి.ఇవి కాక నగరంలో రియర్‌‌సన్ యూనివర్శిటీ,ఒంటారియో కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ డిజైన్స్, ది యూనివర్శిటీ ఆఫ్ గల్ఫ్-హంబర్లు ఉన్నాయి.

నగరంలో డిప్లొమా చదువులనందించే కాలేజ్‌లు నాలుగు ఉన్నాయి.అవి వరసగా సెనేగా కాలేజ్,హంబర్ కాలేజ్ ,సెంటెనియల్ కాలేజ్, జార్జ్ బ్రౌన్ కాలేజ్.ఓష్వాలో ఉన్న ఫ్రాంకోఫోన్ కాలేజ్ బోరియల్ సాధారణంగా గ్రేటర్ టొరంటోలోని భావిస్తారు.వీటితో చేరి డర్‌హమ్ కాలేజ్ ,ది న్యూ యూనివర్శిటీ ఆఫ్ ఒంటారియో ఇన్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ , పీల్ రీజియన్ లో ఉన్న షెరిడన్ కాలేజ్ , యూనివర్శిటీ ఆఫ్ టొరంటో కాంపస్‌లు ఉన్నాయి.

టొరంటో నగర డౌన్ టౌన్‌లో రాయల్ కన్సర్వేటరీ ఆఫ్ మ్యూజిక్ ఉంది.ఇందులో గుర్తింపు పొందిన సంగీత పాఠశాల ది గ్లెన్ గ్లౌడ్ పాఠశాల కూడా ఒక భాగమే.నార్మన్ జ్యూసన్ చే స్థాపించబడిన కెనడియన్ ఫిల్మ్ సెంటర్ లో చలన చిత్ర,దూరదర్శన్ , మీడియా రంగాలలో శిక్షణ ఇస్తారు. టిండేల్ యూనివర్శిటీ కాలేజ్ అండ్ సెమినరీ గుర్తింపు పొందిన క్రిస్టియన్ ఉఉనత కళాశాల.

నగరంలో ది టొరంటో డిస్ట్రిక్ పాఠశాల బోర్డ్ ఆధ్వర్యంలో 558 పాఠశాలలు నడుస్తుంటాయి.వాటిలో 451 ప్రాధమిక పాఠశాలలు 102 మాధ్యమిక పాఠశాలలు ఉన్నాయి.టొరంటో నగర పాఠశాలల సంస్థలలో ఇది ప్రధమ స్థానంలో ఉంది.ది టొరంటో కాథలిక్ డిస్ట్రిక్ పాఠశాల బోర్డ్ ఆధ్వర్యంలో రోమన్ కాథలిక్ పాఠశాలలు నడుస్తాయి.గ్రీన్ వుడ్ కాలేజ్ పాఠశాల,అప్పర్ కెనడా కాలేజ్,క్రిసెంట్ పాఠశాల'టొరొంటో ఫ్రెంచ్ పాఠశాల,హావర్గల్ కాలేజ్,బ్రిటన్ స్ట్రాచన్ పాఠశాల,బ్రాంక్‌సమ్ హాల్ , సెయింట్ మైకేల్ కాలేజ్ స్కూల్ ఉన్నాయి.

టొరొటో నగర ప్రభుత్వ గ్రంథాలయం 1.1 కోటి గ్రంధాలు కలిగి 99 శాఖలు కలిగి కెనడాలో ప్రధమ స్థానంలో ఉన్న గ్రంథాలయం.

ఆరోగ్యం

మార్చు
 
శిశు వైద్య శాల(సిక్ చిల్డ్రెన్ ఆర్టియమ్)
 
టొరంటో జనరల్ హాస్పిటల్

టొరంటో నగరంలో 20 ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి.

  • హాస్పిటల్ ఫర్ సిక్ చిల్డ్రెన్.
  • మౌంట్ సినయ్ హాస్పిటల్.
  • సెయింట్ మైకేల్స్ హాస్పిటల్.
  • నార్త్ యోర్క్ జనరల్ హాస్పిటల్.
  • టొరంటో జనరల్ హాస్పిటల్.
  • టొరంటో వెస్ట్రన్ హాస్పిటల్.
  • సన్నీ బ్రూక్ హెల్త్ సైన్సెస్ సెంటర్.
  • సెంటర్ ఫర్ అబ్డిక్షన్ అండ్ మెంటల్ హెల్త్ సెంటర్.
  • ప్రిన్సెస్ మార్గరేట్ హాస్పిటల్.
  • యూనివర్శిటీ ఆఫ్ టొరొటో ఫాకల్టీ ఆఫ్ మెడిసన్.

టొరంటో డిస్కవరీ డిస్ట్రిక్ట్ బయోమెడిసన్ పరిశోధనలకు కేంద్రం.ఇది 2.5 చదరపు కిలోమీటర్ల (620 చదరపు ఎకరాలు)పరిధిలో విస్తరించి ఉంది.వైద్య సంబంధిత విద్యలనేకం అక్కడ చదువుకునే సదుపాయం ఉంది.ఇది కాక నగరంలో మెక్ సెంటర్ ఫర్ మాలిక్యులర్ మెడిసన్ విద్యాసంస్థ ఉంది.

ప్రయాణ వసతులు

మార్చు
 
టొరంటో స్ట్రీట్ కార్

టొరంటో " పబ్లిక్ ట్రాంస్పోర్టేషన్ సిస్టం "ను టొరంటో ట్రాంసిస్ట్ కమీషన్ (టి.టి.సి), పబ్లిక్ ట్రాంస్పోర్టేషన్ నెట్వర్క్ కు టొరంటో సబ్వే , ఆర్.టి. హెవీ రైల్ రాపిడ్ ట్రాంసిస్ట్ మార్గాలు, స్కార్ బారో రైలు మార్గంలో నడుపబడుతున్న లైట్- మెట్రో రాపిడ్ ట్రాంసిస్ట్ , టి.టి.సి నడుపుతున్న బసులు , స్ట్రీట్ కార్లు ఉన్నాయి వెన్నెముకగా ఉన్నాయి.సబ్వే రైలు మార్గాలను పొడిగించి లైట్-మెట్రో రైళ్ళను నడపడానికి పలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయినప్పటికీ పలు ప్రయత్నాలను లోటు బడ్జెట్ కారణంగా కార్యరూపందాలచలేక పోతున్నాయి. 2011 వరకు నార్త్ డౌంస్‌వ్యూ స్టేషను స్పాడినా సబ్వే మాత్రమే పొడిగించడానికి సాధ్యం అయింది.

 
టొరంటో రాకెట్ ట్రైన్

కెనడాలోని అత్యంత రద్దీ అయిన విమానాశ్రయం " టొరంటో ఇంటెర్ నేషనల్ విమానాశ్రయం " (ఐ.టి..ఎ. వై.వై.జెడ్) అని అంచనా. ఈ విమానాశ్రయం ఇరువైపులా నగర పడమటి సరిహద్దులు మరోవైపు శివారు నగరమైన మిసిసాగ ఉన్నాయి. టొరంటో డౌన్‌టౌన్‌కు ఆగ్నేయంలో ఉన్న టొరంటో దీవిలో ఉన్న బిల్లీ బిషప్ టొరంటో సిటీ ఎయిర్ పోర్ట్ పరిమితమైన పాదింజర్ సర్వీస్ , వాణిజ్య సేవలు అందిస్తున్నది. మార్కంలో ఉన్న టొరంటో/బుట్టాన్‌ విల్లీ మునిసిపల్ ఎయిర్ పోర్ట్ సాధారణ విమాన సేవలు అందిస్తున్నది. నగర ఉత్తర సరిహద్దులకు సమీపంలో ఉన్న డీ హావీలాండ్ కెనడాకు స్వంతమైన టొరంటో / డౌంస్‌వ్యూ ఎయిర్ పోర్ట్ బాంబార్డర్ ఎయిరో స్పేస్ ఫ్యాక్టరీకి సేవలు అందిస్తున్నది.

 
టొరంటో విమానాశ్రయం

టొరంటో , గ్రేటర్ టొరంటోలకు పలు పురపాలక రహదారులు , ప్రాంతీయ రహదారులు రవాణాసదుపాయాలను అందిస్తున్నాయి. 401 రహదారి డౌన్‌టౌన్ ద్వారా నగర తూర్పు , పడమర దిశలను అనుసంధానిస్తున్నది. ఉత్తర అమెరికాలో ఇది అత్యధిక రద్దీ అయిన రహదారి అని అలాగే ప్రపంచంలోని రద్దీ అయిన రహదారులలో ఒకటి భావించబడుతుంది. టొరంటోలోని పురపాలక రహదారులలో ప్రధానమైనవి గార్డనర్ ఎక్స్‌ప్రెస్ వే, ది డాన్ వెల్లీ పార్క్ వే, ఆలెన్ రోడ్ మొదలైనవి. టొరంటో మహానగరం వాహన రద్దీ సమస్యను ఎదుర్కొంటున్నది. కెనడాలో వాహన రద్దిని ఎదుర్కొంటున్న నగరాలలో టొరంటో రెండవ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో వాంకోవర్ ఉంది.

ఇవి కూడ చూడండి

మార్చు

ఆల్బర్ట్ డ్యూరాంట్ వాట్సన్

బయటి లింకులు

మార్చు

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "Population and dwelling counts, for Canada, census metropolitan areas, census agglomerations and census subdivisions (municipalities), 2006 and 2001 censuses - 100% data". Statistics Canada, 2006 Census of Population. 2007-03-13. Archived from the original on 2009-07-27. Retrieved 2007-03-19.
  2. 2.0 2.1 "Population and dwelling counts, for urban areas, 2006 and 2001 censuses - 100% data". Statistics Canada, 2006 జనాభా లెక్కలు. 2007-03-13. Archived from the original on 2009-02-11. Retrieved 2007-03-19.
"https://te.wikipedia.org/w/index.php?title=టొరంటో&oldid=4312292" నుండి వెలికితీశారు