గడ్డం ఆనంద్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు

గడ్డం ఆనంద్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన తండ్రి గడ్డం గంగారెడ్డి నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా పనిచేశాడు.

గడ్డం ఆనంద్‌ రెడ్డి
గడ్డం ఆనంద్ రెడ్డి

నియోజకవర్గం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 9 ఫిబ్రవరి 1958
కేశ్‌పల్లి, జక్రాన్‌పల్లె మండలం, నిజామాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు గడ్డం గంగారెడ్డి, లక్ష్మీకాంతమ్మ
జీవిత భాగస్వామి ఇందిరా రెడ్డి
సంతానం కీర్తి రెడ్డి, కావ్యరెడ్డి

జననం, విద్యాభాస్యం

మార్చు

ఆనంద్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, నిజామాబాదు జిల్లా, జక్రాన్‌పల్లె మండలం, కేశ్‌పల్లి గ్రామంలో గడ్డం గంగారెడ్డి, లక్ష్మీకాంతమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన పదవ తరగతి వరకు చదువుకున్నాడు.

రాజకీయ జీవితం

మార్చు

ఆనంద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన తన తండ్రి ఎంపీగా ఉన్న సమయంలో నిజామాబాదు జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2008లో డిచ్‌పల్లి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.

ఆనంద్ రెడ్డి 2014లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరి 2014, 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[1] బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడిగా ఉన్న ఆనంద్ రెడ్డి 2020లో బీజేపీకి రాజీనామా చేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాడు.

గడ్డం ఆనంద్ రెడ్డి 2021 మే 14న గుండెనొప్పి రావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కొదిసేపటికే మరణించాడు.[2][3][4]

మూలాలు

మార్చు
  1. Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్‌". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
  2. Sakshi (14 May 2021). "'తొలిప్రేమ' హీరోయిన్‌ కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం". Sakshi. Archived from the original on 14 May 2021. Retrieved 14 May 2021.
  3. Prajasakti (14 May 2021). "టిఆర్‌ఎస్‌ నాయకుడు కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్‌ రెడ్డి కన్నుమూత | Prajasakti". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021. {{cite news}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 14 మే 2021 suggested (help)
  4. Namasthe Telangana (14 May 2021). "గడ్డం ఆనంద్‌రెడ్డి హఠాన్మరణం". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.