కీసరి నర్సింగం తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళాకారుడు సినీ నటుడు. బలగం సినిమాలో సర్పంచ్ గా నటించి పేరు పొందాడు. కీసరి నర్సింగం సిరిసిల్ల జిల్లాలోని నాగారం లో జన్మించాడు. కీసరి నర్సింగం నాగారం చుట్టుపక్కల నాటకాలు వేసేవాడు. కీసరి నర్సింగం రామాయణం మహాభారతం భక్త మార్కండేయ జీవిత చరిత్ర లాంటి నాటకాలను వేసేవాడు ‌‌. ఇతని ప్రతిభను గుర్తించిన బలగం సినిమా దర్శకుడు వేణు బలగం సినిమాలో నటుడిగా అవకాశం ఇచ్చాడు. కీసరి నర్సింగం 2023 సెప్టెంబరు 5న మరణించాడు. ఇతని మరణానికి బలగం సినిమా దర్శకుడు వేణు సంతాపం తెలిపారు. బలగం సినిమా టీం నుంచి రచ్చ రవి కీసరి నర్సింగం కు నివాళులర్పించారు. కీసరి నర్సింగం మరణానికి సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.[1][2]

మూలాలు

మార్చు
  1. "బలగం నటుడు పెద్ద నర్సింగం మృతి". EENADU. Retrieved 2024-04-12.
  2. కీసరి. "బలగం సినిమా నటుడు మృతి".