కుంబాల లక్ష్మి తెలంగాణ రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త. ఈవిడ 2017 లో తెలంగాణ ప్రభుత్వం నుండి తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.[1]

కుంబాల లక్ష్మి
జాతీయతభారతీయురాలు
వృత్తిసామాజిక కార్యకర్త, ఇబ్ర‌హీంపూర్‌ గ్రామ సర్పంచ్

జీవిత విశేషాలు మార్చు

సిద్దిపేట జిల్లా ఇబ్ర‌హీంపూర్‌ గ్రామానికి చెందిన కుంబాల లక్ష్మి 2013లో గ్రామ సర్పంచ్ గా ఎన్నికయింది.

గ్రామ సేవలు మార్చు

తెలంగాణ ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి గ్రామ అభివృద్ధికి కృషిచేసింది. ఈ గ్రామంలోని ప్రజలందరికీ ఎకౌంట్లు తెరిపించి, డెబిట్‌ కార్డులు ఇప్పించింది. రేషన్ దుకాణం, కిరాణం, పిండి గిర్ని, బాలవికాస ప్లాంట్, పాలకేంద్రం తదితర చోట్ల స్వైపింగ్ మిషన్లు ఏర్పాటుచేయించింది. నగదు రహిత లావాదేవీలను నిర్వహించి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దృష్టిని ఆకర్షించి, దక్షిణ భారతదేశంలోనే తొలి నగదు రహిత గ్రామంగా ఇబ్రహీంపూర్ గ్రామంని నిలిపింది.[2]

ఇంకుడు గుంతల నిర్మాణం, జలసంరక్షణ కందకాలు, హరితహారం తదితర వినూత్న కార్యక్రమాలతో ఈ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచింది.

బహుమతులు - పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. నమస్తే తెలంగాణ. "యత్ర నార్యస్తు పూజ్యంతే." Retrieved 10 April 2017.
  2. నవతెలంగాణ. "దక్షిణాది తొలి నగదు రహిత గ్రామం ఇబ్రాహీంపూర్‌". Retrieved 11 April 2017.