సిద్దిపేట

తెలంగాణ, సిద్దిపేట జిల్లాలోని పట్టణం
  ?సిద్ధిపేట (M+OG)
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 36.03 కి.మీ² (14 చ.మై)[1]
జిల్లా (లు) సిద్దిపేట జిల్లా
జనాభా
జనసాంద్రత
1,13,358[1][2] (2011 నాటికి)
• 3,146/కి.మీ² (8,148/చ.మై)
పురపాలక సంఘం సిద్ధిపేట పురపాలకసంఘం


సిద్దిపేట, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాకు చెందిన పట్టణం. సిద్దిపేట జిల్లా పరిపాలన, రెవిన్యూ డివిజన్ కేంద్రం. ఈ పట్టణానికి పూర్వం సిద్దిక్ పేట అని పేరు. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ 2021 అవార్డుకు జాతీయస్థాయిలో సిద్ధిపేట ప‌ట్ట‌ణం ఎంపికైంది. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణలో వాహనాల నిర్వహణ, వీటి ప్రక్రియ‌, పారిశుద్ధ్య కార్మికుల పనితీరు, సర్టిఫికేషన్ విధానం, ప్రజల భాగస్వామ్యం, చైతన్యం, స్వచ్ యాప్ ఉపయోగించడం వంటి కార్య‌క్ర‌మాల‌ను సంపూర్ణంగా అమ‌లు చేయ‌డంతో సిద్ధిపేటకు ఈ అవార్డు వచ్చింది. 2021 నవంబరు 20న ఢిల్లీలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్దిపేట మున్సిప‌ల్ చైర్మ‌న్ మంజుల రాజనర్సు, క‌మిష‌న‌ర్ ర‌మ‌ణాచారి ఈ అవార్డును అందుకున్నారు.[3]

జిల్లాల పునర్వ్యవస్థీకరణలోసవరించు

2016 అక్టోబరు 11న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మెదక్ జిల్లాలోని సిద్దిపేట మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటుచేసిన సిద్ధిపేట పట్టణ మండలంలోకి చేర్చారు.[4]

గణాంక వివరాలుసవరించు

2001 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,52,365 - పురుషులు 76,696 - స్త్రీలు 75,669

కలెక్టరేట్‌ నూతన భవన సముదాయంసవరించు

జిల్లాస్థాయి శాఖల అధికారులు ఉండేలా జిల్లా కేంద్రానికి సమీపంలోని దుద్దాడలోని 50 ఎకరాలలో 63.6 కోట్ల రూపాయలతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నిర్మించబడింది. 2021, జూన్ 20న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్‌ నూతన భవన సముదాయాన్ని (సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం) ప్రారంభించాడు.[5] కార్యాలయానికి చేరుకున్న కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించాడు. ఆ తర్వాత కలెక్టరేట్‌ కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నాడు. అనంతరం ఛాంబర్‌లో కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డిని కుర్చీలో కూర్చుండబెట్టి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టి. హరీశ్‌రావు, మహమూద్‌ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ లతోపాటు స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[6]

 
1972 జూన్ 3న సిద్దిపేటలో జన్మించిన తన్నీరు హరీశ్ రావు చిత్రం. (తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు)

చెరువులుసవరించు

సిద్ధిపేటలో ఒక చెరువు ఉంది. దీనిని కోమటి చెరువు అంటారు. దీనినే మిని టాంక్ బండ్ అందరు సిద్ధిపేటలో మరిన్ని చెరువు కలవు వాటిలో ఎర్ర చెరువు నర్సాపూర్ చెరువు చింతల్ చెరువు కలవు

ఆరోగ్యంసవరించు

2018లో సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటయింది.[7]

భరోసా, సఖి, ఓల్డ్ ఏజ్ హోమ్‌లుసవరించు

సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒకే కాంప్లెక్స్‌లో రూ.48.69 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సఖి వన్ స్టాప్ సెంటర్ భవనం, సికింద్రాబాద్‌కు చెందిన గౌరా పెట్రో కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులు కోటి రూపాయలతో నూతనంగా నిర్మించనున్న మహిళలు, బాలల భరోసా సెంటర్ భవనానికి 2022 మార్చి 17న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు శంకుస్థాపన చేశాడు. ఈ కార్యక్రమంలో ఇతర ప్రజాపతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[8]

భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రంసవరించు

భారతదేశంలోనే తొలిసారిగా సిద్ధిపేట పట్టణంలో నిర్మించిన భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని 2022 ఏప్రిల్ 20న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హరీష్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. 300కోట్ల రూపాయలతో ఏర్పాటుచేసిన ఎస్టీపీ ద్వారా శుద్ధి చేసిన నీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తారు.[9][10]

బస్తీ దవాఖాన ప్రారంభంసవరించు

డబుల్ బెడ్‌రూం కేసీఆర్‌ నగర్‌లో ఏర్పాటుచేసిన బస్తీ దవాఖాన నూతన భవనాన్ని 2022 జూన్ 10న తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి టి. హ‌రీశ్ రావు ప్రారంభించాడు. తాత్కాలిక భవనంలో బస్తీ దవాఖాన సేవలు అందిస్తుండగా, 18 లక్షల రూపాయలతో పక్కా భవనం నిర్మించారు. ఈ దవాఖానాలో అవుట్​ పేషెంట్​ సేవలు అందించడంపాటు బీపీ, షుగర్‌తో సహా 57 రకాల వైద్య పరీక్షలను చేస్తున్నారు. సుమారు 150 రకాల మందులను ఉచితంగా అందిస్తున్నారు. స్వల్పంగా అనారోగ్యం బారిన పడిన వారికి తక్షణ వైద్య చికిత్స అందించడంతో పాటు టీకాలు, కుటుంబ నియంత్రణ, వైద్య పరమైన కౌన్సిలింగ్ ఇస్తున్నారు.[11]

అవార్డులుసవరించు

సిద్ధిపేట పట్టణానికి జాతీయ, రాష్ట్రస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి.[3]

  1. 2012: రాష్ట్ర స్థాయిలో క్లీన్ సిటీ ఛాంపియన్ షిప్ అవార్డు
  2. 2015: జాతీయ స్థాయిలో ఎక్సలెన్స్ అవార్డు (సాలీడ్ వెస్ట్ మేనేజ్ మెంట్)
  3. 2016: జాతీయ స్థాయిలో ఎక్స్ లెన్స్ అవార్డు పారిశుద్ధ్య నిర్వహణ
  4. 2016: రాష్ట్ర స్థాయిలో హరిత మిత్ర అవార్డు
  5. 2016: చెత్త సేకరణ, 100% మరుగుదొడ్ల నిర్మాణంలో జాతీయ స్థాయిలో స్కాచ్ అవార్డు
  6. 2016: జాతీయ స్థాయిలో ఓడీఎఫ్ సర్టిఫికెట్
  7. 2016: రాష్ట్ర స్థాయిలో ఎక్స్ లెన్స్ అవార్డు
  8. 2017: జాతీయ స్థాయిలో రాష్ట్రీయ స్వచ్ భారత్ పురస్కారం
  9. 2017: సీఎం చే రాష్ట్ర స్థాయి బెస్ట్ మున్సిపాలిటీ అవార్డు
  10. 2017: జాతీయ స్థాయిలో ఐఎస్వో అవార్డు
  11. 2018: జాతీయ స్థాయిలో సాలీడ్ మేనేజ్మెంట్ లో స్కాచ్ అవార్డు
  12. 2018: జాతీయ స్థాయిలో స్వచ్ఛత ఎక్స్ లెన్స్ అవార్డు
  13. 2018: 6 పద్ధతులు అమలు లో ఉన్నందున జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డు
  14. 2018: స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం
  15. 2019: జాతీయ స్థాయిలో స్వచ్చత ఎక్స్ లెన్స్ అవార్డు
  16. 2019: జాతీయ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డు (దక్షిణ భారత దేశంలో రెండవ స్థానంలో)
  17. 2021: సిద్ధిపేట పట్టణంలో 100% ఇంటింటికి స్వచ్చమైన త్రాగు నీటి సరఫరా నిర్వహణకు రెండు స్కాచ్ అవార్డులు
  18. 2021: దేశ స్థాయిలో స్వచ్ సర్వేక్షన్ అవార్డు కు ఎంపిక

రవాణా సౌకర్యంసవరించు

ఇది కరీంనగర్, హైదరాబాదు ప్రధాన మార్గంలో ఉండుట వలన నిజామాబాద్, మెదక్ ల నుండి అన్ని బస్సులకు ఇది కూడలిగా ఉంది.ఇక్కడ బస్టాండ్ కూడా అన్ని సౌకర్యములతో ఉంది. సిద్ధిపేటలో రెండు బస్సు స్టాండులు ఉన్నాయి. ఒకటి పాతది. దీనిని పాత బస్సు స్టాండు అని అంటారు. కేవలం చుట్టు ప్రక్కల గ్రామాలకు వెళ్ళే ఆర్డినరీ బస్సులు మాత్రమే ఈ బస్సు స్టాండులో దొరుకుతాయి. ఎక్స్‌ప్రెస్ బస్సులు మాత్రం కొత్త బస్సు స్టాండులో ఆగుతాయి. పాత బస్సు స్టాండు ఊరికి నడిబొడ్డులో ఉంది.

ప్రముఖులుసవరించు

మూలాలుసవరించు

  1. 1.0 1.1 "Basic Information of Municipality". siddipetmunicipality.in. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 24 December 2015.
  2. "Siddipet municipal polls on April 6; counting on April 11". The Hindu (in Indian English). 20 March 2016. Retrieved 28 June 2016.
  3. 3.0 3.1 "జాతీయ స్థాయిలో మెరిసిన సిద్దిపేట‌.. స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డుకు ఎంపిక‌". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-10. Archived from the original on 2021-11-10. Retrieved 2021-12-27.
  4. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2022-08-18.
  5. "సిద్దిపేటలో కలెక్టరేట్,పోలీస్ కమిషరేట్ కార్యాలయాలను ప్రారంభించిన సీఎం కేసీఆర్". telugu oneindia. 2021-06-20. Archived from the original on 2021-06-20. Retrieved 2023-02-23.
  6. Today, Telangana (2021-06-20). "CM KCR inaugurates newly constructed offices in Siddipet". Telangana Today. Archived from the original on 2021-06-24. Retrieved 2023-02-23.
  7. TelanganaToday (2018-06-04). "Laxma Reddy inaugurates Siddipet Medical College". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2018-08-11. Retrieved 2020-09-05.
  8. telugu, NT News (2022-03-17). "ఒకే కాంప్లెక్స్‌లో భరోసా, సఖి, ఓల్డ్ ఏజ్ హోమ్‌ల నిర్మాణం : మత్రి హరీశ్‌రావు". Namasthe Telangana. Archived from the original on 2022-03-17. Retrieved 2022-03-17.
  9. Velugu, V6 (2022-04-20). "సిద్ధిపేటను శుద్ధిపేటగా చూడాలనుంది". V6 Velugu (in ఇంగ్లీష్). Archived from the original on 2022-04-21. Retrieved 2022-04-21.
  10. telugu, NT News (2022-04-20). "సిద్దిపేట పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో వారిదే కీలక పాత్ర : మంత్రి హరీశ్‌రావు". www.ntnews.com. Archived from the original on 2022-04-21. Retrieved 2022-04-21.
  11. telugu, NT News (2022-06-10). "కేసీఆర్‌ నగర్‌లో బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు". Namasthe Telangana. Archived from the original on 2022-06-10. Retrieved 2022-06-15.

వెలుపలి లంకెలుసవరించు