కుక్కరహళ్ళి సరస్సు

కుక్కరహళ్లి సరస్సు కర్ణాటకలోని మైసూర్ నగరం నడిబొడ్డున ఉంది. మైసూరు రాజవంశానికి చెందిన ముమ్మాడి కృష్ణరాజ వడయార్ (1794-1868) నగరం వెలుపల సుమారు 4000 హెక్టార్ల (10,000 ఎకరాల) భూమికి సాగునీటిని అందించడానికి 1864 సంవత్సరంలో ఈ సరస్సును సృష్టించాడు. అప్పట్లో ఈ సరస్సు మైసూర్ నగరానికి నీటి సరఫరా వనరుగా ఉండేది, అయితే కొన్ని సంవత్సరాలుగా మురుగునీరు, అధిక భూ ఆక్రమణలు వంటి వాటి వలన సరస్సు దీన స్థితికి చేరింది. సరస్సు చుట్టుపక్కల 4.5 కిమీ నడక మార్గం ఉంది. సందర్శకులు కూర్చుని, విశ్రాంతి తీసుకోవడానికి, సరస్సు సుందరమైన దృశ్యాలను ఆస్వాదించడానికి రాతి బెంచీలు సరస్సు చుట్టూ అమర్చబడ్డాయి.[1][2][3]

కుక్కరహళ్ళి సరస్సు
కుక్కరహళ్ళి సరస్సు is located in Karnataka
కుక్కరహళ్ళి సరస్సు
కుక్కరహళ్ళి సరస్సు
ప్రదేశంమైసూరు
అక్షాంశ,రేఖాంశాలు12°18′N 76°38′E / 12.3°N 76.63°E / 12.3; 76.63
రకంమంచినీరు
పరీవాహక విస్తీర్ణం414 కి.మీ2 (160 చ. మై.)
ప్రవహించే దేశాలుభారతదేశం
ఉపరితల వైశాల్యం62 హె. (150 ఎకరం)
గరిష్ట లోతు5 మీ. (16 అ.)
2.53×10^6 మీ3 (89×10^6 ఘ.అ.)
ఉపరితల ఎత్తు755.73 మీ. (2,479.4 అ.)
ప్రాంతాలుమైసూరు

ప్రత్యేకత

మార్చు

బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అనే సంస్థ కర్ణాటక రాష్ట్రంలోని 38 ముఖ్యమైన పక్షి ప్రాంతాల (IBAs) జాబితాలో కుక్కరహళ్లి సరస్సుని చేర్చింది. ఈ సరస్సు మైసూర్ సిటీ రైల్వే స్టేషన్ నుండి 3 కిమీ (1.9 మైళ్ళు) దూరంలో ఉంది.[4] [5]

విస్తీర్ణం

మార్చు

ఈ సరస్సు 414 చదరపు కిలోమీటర్ల (160 చదరపు మైళ్ళు) కంటే ఎక్కువ పరీవాహక ప్రాంతాన్ని కలిగి ఉంది. సరస్సు 'J' ఆకారంలో ఉంది. సరస్సు గరిష్ట లోతు 5 మీటర్లు(16 అడుగులు) ఉంది.[6]

అభివృద్ధి

మార్చు

1981-2001 కాలంలో చేపట్టిన అధ్యయనం సరస్సు క్షీణిస్తున్న స్థితిలో ఉన్నట్లు, పునరుద్ధరించడానికి చర్యలు అవసరమని నిర్ధారించింది. మైసూర్ విశ్వవిద్యాలయం, మైసూర్ పౌర వేదికలు వంటివి సరస్సును రక్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.[7]

పక్షులు

మార్చు

ప్రకృతి శాస్త్రవేత్తల ప్రకారం, దాదాపు 176 జాతుల పక్షులు (వాటిలో ఎక్కువ సంఖ్యలో వలస పక్షులు, సైబీరియా నుండి వచ్చిన పక్షులు) 10,000 నుండి 15,000 వరకు శీతాకాలంలో ఈ సరస్సును సందర్శిస్తాయి. ఈ మధ్య కాలంలో సరస్సులో కాలుష్యం ఎక్కువ కావడంతో సరస్సును సందర్శించే పక్షుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు, సరస్సును సందర్శించే పక్షుల సంఖ్య దాదాపు 2,000 కి తగ్గింది. ఇప్పుడు సరస్సు దగ్గర స్పాట్-బిల్ పెలికాన్స్, చిన్న కార్మోరెంట్, పెయింట్ క్రేన్స్, ఓపెన్‌బిల్ క్రేన్స్, యురేషియన్ స్పూన్‌బిల్స్, నైట్ హెరాన్స్, ఓరియంటల్ డార్టర్స్ వంటి పక్షులు కనిపిస్తాయి.[8][9][10]

మూలాలు

మార్చు
  1. "Kukkarahalli Lake".
  2. http://wgbis.ces.iisc.ernet.in/energy/lake2006/programme/programme/proceedings/studentspapers/ug.htm. Preservation of Mysore Urban Waterbodies
  3. [1] Popularity turns a bane for Kukkarahalli lake
  4. "Important Bird Areas (IBA)". Mysore Nature. 2016-10-30. Retrieved 2016-12-01.
  5. Page 40, India Archived 3 జనవరి 2009 at the Wayback Machine
  6. Limnology, Watershed Hydrology and Monitoring
  7. "Two City Lakes Regain Their Glory". Mysoresamachar.com. Archived from the original on 2015-04-03. Retrieved 2016-12-01.
  8. Page 40, India Archived 3 జనవరి 2009 at the Wayback Machine
  9. "Mysuru District - KARNATAKA". Mysore.nic.in. Retrieved 2016-12-01.
  10. http://www.mysoretourism.org/Kukkarahalli%20Lake.htm Archived 2012-03-14 at the Wayback Machine Kukkarahalli Lake