కుక్కల నాగేశ్వరరావు
కుక్కల నాగేశ్వరరావు (కేఎన్నార్) కృష్ణా జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్,వ్యాపారవేత్త. స్వగ్రామం మొవ్వ మండలంకోసూరు. తల్లి కె.అమ్మగారు కోసూరు సర్పంచ్‌గా పనిచేశారు. కుక్కల నాగేశ్వరరావు ఎస్కే షిప్పింగ్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి విశాఖపట్నం ఓడరేవులో సరకులు దిగుమతి చేసుకునే కాంట్రాక్టు పనులను చేస్తూ వ్యాపారవేత్తగా ఎదిగారు. 2004లో తెలుగుదేశం పార్టీలో, 2006లో కాంగ్రెస్‌లో, 2012 లో వైఎస్సార్‌సీపీలో చేరారు. మొవ్వ జెడ్పీటీసీ సభ్యునిగా గెలుపొంది 2006 జూలై 23 నుంచి 2011 జూలై 22 వరకు జెడ్పీ ఛైర్మన్‌గా కొనసాగారు. ఒంగోలు గిత్తల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచేవారు. ఆయన ఒంగోలు ఎద్దు దేశస్థాయి చాంపియన్‌గా నిలిచి ‘ద్రోణాచార్య కోడె’గా అవార్డు పొందింది.ఉత్తమ గోసంరక్షక అవార్డును అందుకున్నారు. బెస్ట్ సోషల్ వర్కర్‌గా శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి నుంచి ఇందిరా ప్రియదర్శిని అవార్డును స్వీకరించారు. పాలకుల తప్పిదాల వల్లే ఒంగోలు జాతిని కాపాడుకోలేకపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసేవారు.21.11.2013 న చనిపోయారు.
మూలాలు
మార్చు- సాక్షి 22.11.2013 http://www.sakshi.com/news/andhra-pradesh/k-nageshwara-rao-82513