మొవ్వ

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, మొవ్వ మండలం లోని గ్రామం

మొవ్వ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్ నం. 521 135., యస్.టీ.డీ.కోడ్ = 08671.

మొవ్వ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మొవ్వ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 5,653
 - పురుషులు 3,174
 - స్త్రీలు 3,103
 - గృహాల సంఖ్య 1,673
పిన్ కోడ్ 521135
ఎస్.టి.డి కోడ్ 08671


మొవ్వ
—  మండలం  —
కృష్ణా జిల్లా పటములో మొవ్వ మండలం స్థానం
కృష్ణా జిల్లా పటములో మొవ్వ మండలం స్థానం
మొవ్వ is located in Andhra Pradesh
మొవ్వ
మొవ్వ
ఆంధ్రప్రదేశ్ పటంలో మొవ్వ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°13′04″N 80°54′32″E / 16.217642°N 80.908756°E / 16.217642; 80.908756
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం మొవ్వ
గ్రామాలు 19
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 56,259
 - పురుషులు 28,118
 - స్త్రీలు 28,341
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.79%
 - పురుషులు 75.71%
 - స్త్రీలు 63.94%
పిన్‌కోడ్ 521135

గ్రామ చరిత్రసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

కృష్ణా జిల్లాలోని మండలాలు, గ్రామాలుసవరించు

విజయవాడ రూరల్ మండలం పరిధితో పాటు, పట్టణ పరిధిలోకి వచ్చే ప్రాంతం. విజయవాడ అర్బన్ మండలం పరిధిలోని మండలం మొత్తంతో పాటు అర్బన్ ఏరియా కూడా. ఇబ్రహీంపట్నం మండలం మొత్తంతో పాటు అర్బన్ ప్రాంతం, పెనమలూరు మండలం పరిధితో పాటు అర్బన్ ఏరియా, గన్నవరం మండలంతో పాటు అర్బన్ ఏరియా, ఉంగుటూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంకిపాడుతో పాటు అర్బన్ ఏరియా, ఉయ్యూరుతో పాటు అర్బన్ ఏరియా, జి.కొండూరు మండలంతో పాటు అర్బన్ ఏరియా, కంచికచర్ల మండలంతో పాటు అర్బన్ ఏరియా, వీరుళ్లపాడు మండలంతో పాటు అర్బన్ ఏరియా, పెనుగంచిప్రోలు మండల పరిధిలోని కొంతభాగంతో పాటు శనగపాడు గ్రామం ఉన్నాయి.

మొవ్వ మండలంసవరించు

మొవ్వ మండలంలోని అయ్యంకి, కూచిపూడి, గుడపాడు, పెదపూడి, పెదశనగలూరు, బార్లపూడి, భట్లపెనుమర్రు, మొవ్వ, యద్దనపూడి, వేములమాడ గ్రామాలు ఉన్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[2] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)

సమీప గ్రామాలుసవరించు

మచిలీపట్నం, గుడివాడ, పెడన, రేపల్లె.

సమీప మండలాలుసవరించు

పమిడిముక్కల, ఘంటసాల, పామర్రు, గూడూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

విజయవాడ నుండి రోడ్దు రవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్ట్ఘేషన్: విజయవాడ 49 కి.మీ

గ్రామంలోని విద్యా సౌకర్యాలుసవరించు

కళాశాలలుసవరించు

వేమూరి సుందర రామయ్య ప్రభుత్వ డిగ్రీ, పి.జి. కళాశాలసవరించు

క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలసవరించు

ఈ కళాశాలలో గణితశాస్త్ర అధ్యాపకులైన శ్రీ వేమూరి శివనాగేశ్వరరావు, గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే, రాష్ట్రస్థాయిఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపికైనారు. 2014,సెప్టెంబరు-5న గుంటూరులోని పెరేడ్ గ్రౌండ్సులో నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్రమంత్రుల నుండి, వీరీ పురస్కారాన్ని, ప్రశంసాపత్రాన్నీ అందుకుంటారు. ఇంతకుముందు వీరు, 2014,ఆగస్టు15, స్వాతంత్ర్య దినోత్సవం రోజున జిల్లా కలక్టరుగారి చేతులమీదుగా, జిల్లాస్థాయి ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని అందుకున్నారు. వీరు కళాశాలలో 100% ఉత్తీర్ణతకు కృషిచేయడమేగాక, సెలవురోజులలోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించుచూ విద్యాభివృధికి కృషిచేస్తున్నారు. [7] కార్పొరేటు కళాశాలకు దీటుగా విద్యాబోధన జరుచున్న ఈ కళాశాలలో ప్రస్తుతం 550 మంది విద్యార్థులు విద్యనభ్యసించుచున్నారు. గత ఏడు సంవత్సరాలుగా, 4 సార్లు రాష్ట్రస్థాయిలో, మిగిలిన మూడు సంవత్సరాలు జిల్లాస్థాయిలో, ప్రథమస్థానంలో, ఫలితాలు సాధించారు. [11] ఈ కళాశాల 36వ వార్షికోత్సవం 2017,ఫిబ్రవరి-20న ఘనంగా నిర్వహించారు. [20]

పాఠశాలలుసవరించు

మండవ కనకయ్య జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, మొవ్వసవరించు

బెంగళూరులోని సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియంలో 2016,జనవరి-19 నుండి 23 వరకు నిర్వహించనున్న దక్షిణ భారతదేశ స్థాయి వైద్య,విఙానిక సదస్సులో పాల్గొనడానికి ఈ పాఠశాల విద్యార్థుల బృందం ఎంపికైనది. [13]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాలసవరించు

లాల్ బహదూర్ విద్యాలయంసవరించు

ఇమ్మానుయేలు మిషన్ స్కూలుసవరించు

హోలీ స్పిరిట్ ఆంగ్ల మాధ్యమ పాఠశాలసవరించు

పి.హెచ్.డబ్ల్యు.పాఠశాలసవరించు

శాఖా గ్రంథాలయంసవరించు

 1. ఈ పురాతన గ్రంథాలయాన్ని, చాలా సంవత్సరాల క్రితం, గ్రామానికి చెందిన శ్రీ మండవ వెంకటరంగయ్య ఙాపకార్ధం, ఆయన భార్య శ్రీమతి ప్రసూనాంబ, గ్రామస్థుల సహకారంతో అప్పట్లో నిర్మించారు. ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో, నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం 20 లక్షల రూపాయలను మంజూరు చేసింది. ఇదిగాక కంప్యూటర్ల కొనుగోలుకు, 2011 లోనే, మరియొక 2.90 లక్షల రూపాయలను మంజూరు చేసింది. నూతన భవననిర్మాణానికి 16 నెలల క్రితమే శంకుస్థాపన గూడా నిర్వహించారు. కానీ ఇంతవరకు, భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. కంప్యూటర్లూ కొనలేదు. [10]
 2. ఈ గ్రంథాలయానికి నూతన భవనం, నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్దంగా ఉంది. [15]

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

స్త్రీశక్తి భవనం:- ఈ భవనం మొవ్వ ఎం.పి.డి.ఓ కార్యాల ఆవరణలో ఉంది.

బ్యాంకులుసవరించు

 1. ఇండియన్ బ్యాంక్. ఫోన్ నం.08671/252432. సెల్=9912223826.
 2. విజయ బ్యాంక్:- మొవ్వ గ్రామంలో ఈ బ్యాంక్ శాఖను, 2016,జనవరి-22వ తేదీ శుక్రవారం ఉదయం 10-35 గంటలకు ప్రారంభించారు. [16]

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013-జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీ తాతినేని పిచ్చేశ్వరరావు, సర్పంచిగా ఎన్నికైనారు. [8]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, మొవ్వసవరించు

ఈ గ్రామం లోని ఈ ఆలయము చాలా పురాతనమైనది. ఈ ఊరి స్థలపురాణము ప్రకారం, మౌగల్య మహర్షి చేత ఇసుకతో ఇచటి మువ్వ గోపాల స్వామి విగ్రహం తయారుచేయబడెను. ఆ విగ్రహం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. అంతే కాక చదువు రాని వరదయ్య, స్వామి కృపతో గొప్పకవి అయ్యాడని ప్రతీతి. వరదయ్య వ్రాసిన శృంగార కవిత్వం ఎంతో ప్రసిద్ధి.

ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణబ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో, మాఘశుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు వైభవంగా నిర్వహిచెదరు. త్రయోదశి నాడు ఉదయం విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం, పెళ్ళికుమారుని, పెళ్ళికుమార్తెను చేయడం, సాయంత్రం 4 గంటలకు క్షేత్రయ్య ఆరాధనోత్సవం, రాత్రికి అంకురార్పణ, ధ్వజారోహణం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించెదరు. చతుర్దశినాడు ఉదయం నిత్యహోమం, గ్రామ బలిహరణ, లక్ష్మీనారాయణ సహిత సుదర్శన మహాయఙం, సాయంత్రం నిత్య హోమం, ఎదురుకోలు సంవాదం, రాత్రికి స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం నిర్వహించెదరు. మాఘశుద్ధ పౌర్ణమినాడు ఉదయం నిత్య హోమం, రాత్రికి పవళింపుసేవ కార్యక్రమాలు నిర్వహించెదరు. [17]

ఈ ఆలయం విజయవాడ కనకదుర్గ అమ్మవారి దేవాలయానికి దత్తత దేవాలయం. [19]

ఇక్కడి ఇతర దేవాలయాలుసవరించు

 1. శ్రీ బాలా త్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం (శివాలయం):- ఈ అలయంలో స్వామివారి మహాకుంభాభిషేకాలను, 5వ తేదీ శుక్రవారంనాడు, ప్రారంభించారు. ముందుగా మహాగణపతిపూజ, పుణ్యాహవచనం, దీక్షాధారణ, ఋత్వికా వరుణ, యాగశాల ప్రవేశం, శాలాసంస్కారలు ధ్వజపతాక ఆవిష్కరణ, నవగ్రహ ఆరాధన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. 6వ తేదీ శనివారంనాడు, దేవతాహోమాలు నిర్వహించారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 8-48 గంటలకు, శ్రీ బాలా త్రిపురసుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి, శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారలకు, మహా సంప్రోక్షణ, మహా కుంభాభిషేకం, నాగసుబ్రహ్మణ్యం, నందీశ్వర, బలిపీఠ ప్రతిష్ఠా మహోత్సవాలు, శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీస్వామివారు నిర్వహించెదరు. [9]
 2. శ్రీ రామాలయం.
 3. శ్రీ సిద్ధి గణపతి ఆలయం.
 4. శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయం.
 5. శ్రీ షిర్దీ సాయి ఆలయం.
 6. శ్రీ రేణుకా అంకమ్మ అమ్మవారి ఆలయం:- మొవ్వ గ్రామంలో ఈడే వారి ఇలవేలుపు అయిన ఈ అమ్మవారి వార్షిక సంబరాలు, ప్రతి సంవత్సరం వైశాఖ పూర్ణిమ సందర్భంగా (మే నెలలో) మూడు రోజులు వైభవంగా నిర్వహించెదరు. [18]

పై ఆలయాలే కాక గ్రామ దేవతల ఆలయాలు మరి కొన్ని ఉన్నాయి. ఈ కారణాన మొవ్వను దేవాలయాల గ్రామం (the village of temples) అని ప్రస్తావించెదరు.

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామ ప్రముఖులుసవరించు

 1. క్షేత్రయ్య లేదా మొవ్వా వరదయ్య అని పిలువబడే 17వ శతాబ్దపు వాగ్గేయకారుడు.
 2. భారత జాతీయ పతాకం రూప కల్పన చేసిన పింగళి వెంకయ్య ఈ మండలంలో నున్న భట్లపెనుమర్రు గ్రామంనకు చెందినవాడు.
 3. ఈ గ్రామానికి చెందిన శ్రీ మండవ జానకి రామయ్య కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం ఛైర్మన్. ఈయన ఇండియన్ డైరీ అసోసియేషన్ వారి ప్రతిష్ఠాత్మక 'కురియన్' అవార్డుకు యెన్నికయ్యాడు. జాతీయ స్థాయిలో ప్రతి యేటా అన్ని రాష్ట్రాలలో డెయిరీ రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి ఈ అవార్డుని ప్రదానం చేస్తారు. 'ఫాదర్ ఆఫ్ మిల్క్ డెయిరీ' గా పేరొందిన డాక్టర్ కురియన్ పేరు మీద ఈ అవార్డుని ప్రదానం చేస్తున్నారు[3] వీరికి 2014,మార్చి-31 ఉగాదిరోజున, విజయవాడలోని ఫన్ టైం క్లబ్ వారు, "కృష్ణరత్న" పేరుతో ఉగాది పురస్కారం అందజేసి, దుశ్శాలువతో సన్మానించారు. [6]
 4. అమెరికాలో 8వ గ్రేడ్ విద్ద్యార్ధిని అయిన నందిపాటి స్నిగ్ధ ఈ వూరి బాలికయే. అమెరికాలో 2012 లో నిర్వహించిన స్పెల్లింగ్-బీ పోటీలలో 2012 వ సంవత్సరానికి గాను జాతీయ ఛాంపియన్ గా ఎన్నిక అయింది. ఈ పోటీలలో ఎన్నిక అయిన మొదటి ముగ్గురు విద్యార్థులూ భారతీయ అమెరికనులు కావటం విశేషం[4].
 5. ఈ గ్రామంనకు చెందిన కీ.శే.మండవ కనకయ్య, సీతారత్నం దంపతుల కుమారుడు శ్రీ మండవ బాబూరావు, అమెరికాలో చేసిన సమాజసేవను గుర్తించిన అ దేశప్రభుత్వం, 2011 లో వీరికి ప్రతిష్ఠాత్మక ఇల్లీస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని ప్రదానం చేసింది.[5]. వీరు జన్మభూమి స్ఫూర్తితో 50 లక్షల రూపాయల వితరణతో, మొవ్వ గ్రామభివృద్ధికి తోడ్పడటమే గాకుండా, అమెరికాలో 800 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు 2016,జనవరిలో పరమపదించారు. [14]
 6. ఈ గ్రామానికి చెందిన డాక్టర్ ఆదిరాల డేవిడ్ కుమార్, జాతీయ సాహిత్య అకాడమీ (న్యూఢిల్లీ) పురస్కారం అందుకున్నారు. దళితుల అభివృద్ధికి పాటుబడే రచయితలనూ, సేవారంగంలో కృషిచేసినవారినీ ప్రోత్సహించే భారతీయ దళిత సాహిత్య అకాడమీ, 2012-13 సంవత్సరానికి గాను వీరిని ఎంపికచేసింది. న్యూఢిల్లీలోని పంచశీల ఆశ్రమంలో, 2013,డిసెంబరు-12న జరిగిన, 29వ జాతీయ దళిత రచయితల మహాసభలలో, జాతీయ అకాడమీ అధ్యక్షులు దా.ఎస్.పి.సమనాక్షర్ చేతులమీదుగా, జాతీయస్థాయి సాహిత్య అకాడమీ అవార్డు అయిన, "డా.బి.ఆర్.అంబేడ్కర్ ఫెలోషిప్"ను అందుకున్నారు. [5]

గ్రామ విశేషాలుసవరించు

మొవ్వ ఇంటిపేరుతో ప్రసిద్ధులు:- మొవ్వా వృషాధ్రిపతి.

సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్ట్సవరించు

గ్రామంలో ఈ పథకాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయత్‌రాజ్‌శాఖ , గ్రామీణ ఉపాధి పథకం శాఖల సంయుక్త ఆధ్వర్యంలో, 3.4 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసినారు. చెత్త నుండి సంపద సృష్టించాడానికై గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుచున్నది. జిల్లాలో తొలివిడతగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 39 చెత్త నిర్వహణ ప్రాజెక్టులలో, మొవ్వ ప్రాజెక్టు, సేంద్రియ ఎరువుల తయీరీలో ఆదర్శంగా నిలుచుచున్నది. వాతావరణ కాలుష్యాన్ని నిలువరించేటందుకు వ్యర్ధాల నిర్వహణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ పేరుతో వీటిని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినది. [21]

గణాంకాలుసవరించు

జనాభా (2001) -మొత్తం 6277 -పురుషులు 3174 -స్త్రీలు 3103 -గృహాలు 1673 -హెక్టార్లు 1546

జనాభాసవరించు

2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[6]

క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషుల సంఖ్య స్త్రీలు
1. అవురుపూడి 338 1,300 655 645
2. అయ్యంకి 852 3,096 1,594 1,502
3. బార్లపూడి 187 616 312 304
4. భట్లపెనుమర్రు 901 3,206 1,581 1,625
5. చినముత్తేవి 693 2,435 1,224 1,211
6. గుడపాడు 295 1,081 520 561
7. కాజ 2,246 8,222 4,165 4,057
8. కోసూరు 1,579 5,625 2,809 2,816
9. కూచిపూడి 1,010 3,615 1,766 1,849
10. మొవ్వ 1,673 6,277 3,174 3,103
11. నిడుమోలు 1,640 6,350 3,227 3,123
12. పలంకిపాడు 209 701 356 345
13. పెదముత్తేవి 1,138 3,825 1,876 1,949
14. పెదపూడి 862 3,667 1,673 1,994
15. పెడసనగల్లు 1,019 3,512 1,796 1,716
16. వేములమాడ 495 1,721 824 897
17. యద్దనపూడి 354 1,280 636 644

గ్రామాలుసవరించు

వనరులుసవరించు

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-18. Retrieved 2016-08-22.
 2. "http://www.onefivenine.com/india/villages/Krishna/Movva/Movva". Retrieved 24 June 2016. External link in |title= (help)CS1 maint: discouraged parameter (link)
 3. ఈనాడు నవంబరు 23, 2011- 11వ పేజీ , ది హిందూ దినపత్రిక ఏప్రిల్ 15, 2012, పేజీ-3
 4. ఈనాడు జూన్ 3, 2012, హాయ్ బుజ్జి పేజీ., ది హిందూ జూన్ 2, 2012, 14వ పేజీ.
 5. http://co107w.col107.mail.live.com[permanent dead link] /default.aspx?wa=wsignin1.0
 6. "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.

వెలుపలి లింకులుసవరించు

[5] ఈనాడు కృష్ణా; 2013,డిసెంబరు-17; 11వపేజీ. [6] ఈనాడు విజయవాడ; 2014,ఏప్రిల్.1, 3వపేజీ. [7] ఈనాడు కృష్ణా; 2014,సెప్టెంబరు-3; 2వపేజీ. [8] ఈనాడు అమరావతి; 2015,మే నెల-12వతేదీ; 38వపేజీ. [9] ఈనాడు అమరావతి; 2015,జూన్-6; 37వపేజీ. [10] ఈనాడు అమరావతి; 2015,జూన్-19; 38వపేజీ. [12] ఈనాడు అమరావతి; 2015,ఆగస్టు-26; 23వపేజీ. [13] ఈనాడు కృష్ణా; 2015,డిసెంబరు-31; 15వపేజీ. [14] ఈనాడు అమరావతి; 2016,జనవరి-10; 27వపేజీ. [15] ఈనాడు అమరావతి; 2016,జనవరి-20; 23వపేజీ. [16] ఈనాడు అమరావతి; 2016,జనవరి-23; 29వపేజీ. [17] ఈనాడు అమరావతి; 2016,ఫిబ్రవరి-20; 8వపేజీ. [18] ఈనాడు అమరావతి; 2016,మే-20; 2వపేజీ. [19] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-8; 1వపేజీ. [20] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,ఫిబ్రవరి-21; 2వపేజీ. [21] ఈనాడు అమరావతి/పామర్రు; 2017,మార్చి-18; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=మొవ్వ&oldid=3154957" నుండి వెలికితీశారు