కుడుదుల నగేష్
కుడుదుల నగేష్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే. ఆయన ప్రస్తుతం ఆలేరు జెడ్పిటీసీగా ఉన్నాడు.
కుడుదుల నగేష్ | |||
మాజీ ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2004 - 2009 | |||
ముందు | మోత్కుపల్లి నర్సింహులు | ||
---|---|---|---|
తరువాత | బూడిద భిక్షమయ్య | ||
నియోజకవర్గం | ఆలేరు నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1969 రాఘవాపురం గ్రామం, ఆలేరు మండలం , యాదాద్రి భువనగిరి జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ | ||
తల్లిదండ్రులు | నర్సయ్య | ||
జీవిత భాగస్వామి | విజయ కుమారి | ||
నివాసం | ఆలేరు |
జననం, విద్యాభాస్యం
మార్చుకుడుదుల నగేష్ 1969లో తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా , ఆలేరు మండలం , రాఘవాపురం గ్రామంలో జన్మించాడు. ఆయన కొలనుపాకలోని జిల్లా ప్రభుత్వ పాఠశాలలో 1979లో 10వ పూర్తి చేశాడు . ఆయన 1988లో హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి ఎం.బి.బి.ఎస్ పూర్తి చేసి, 1993లో విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ఎం.ఎస్ పూర్తి చేశాడు.
రాజకీయ జీవితం
మార్చుడా.కుడుదుల నగేష్ 1994లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలోకి వచ్చి ఆలేరు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు చేతిలో 38975 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు. ఆయన తిరిగి 1999లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి 7617 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.
డా.కుడుదుల నగేష్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 2001లో కేసీఆర్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. ఆయన 2004లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా ఆలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు పై 24825 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి ఎమ్మెల్యేగా అడుగు పెట్టాడు.[1] కుడుదుల నగేష్ 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి మోత్కుపల్లి నర్సింహులు పై 3924 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
డా.కుడుదుల నగేష్ కి 2009లో తెరాస టికెట్ దక్కకపోవడంతో ఆయన టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బహుజన్ సమాజ్ పార్టీ నుండి పోటీ చేసి 4వ స్థానంలో నిలిచాడు. ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీ లో చేరి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. కుడుదుల నగేష్ 2019లో జరిగిన తెలంగాణ జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఆలేరు జెడ్పిటీసీగా గెలిచాడు.[2][3]అనంతరం ఆయన సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. డా.కుడుదుల నగేష్ తెలంగాణ శాసనమండలికి 10 డిసెంబర్ 2021లో జరిగే నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు.[4]
మూలాలు
మార్చు- ↑ Eenadu (5 November 2023). "తెరాస తొలి ఎమ్మెల్యే ఎవరో తెలుసా.?". Archived from the original on 5 November 2023. Retrieved 5 November 2023.
- ↑ TV9 Telugu (4 June 2019). "తెలంగాణ పరిషత్ ఎన్నికల ఫలితాలు - TV9 Telugu Telangana MPTC and ZPTC Election Results 2019". Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ The Hans India (5 June 2019). "Twist of fate: Ex-MPTC becomes MLA, Ex- MLA becomes ZPTC in Yadadri-Bhongir" (in ఇంగ్లీష్). Archived from the original on 25 July 2021. Retrieved 25 July 2021.
- ↑ Namasthe Telangana (24 November 2021). "3 నామినేషన్లు తిరస్కరణ". Archived from the original on 29 November 2021. Retrieved 29 November 2021.