కుల్ భూషణ్ ఖర్బందా
కుల్ భూషణ్ ఖర్బందా ప్రముఖ హిందీ, పంజాబీ సినిమా నటుడు. షాన్(1980)సినిమాలో ఈయన నటించిన షకాల్ పాత్ర ద్వారా ప్రసిద్ధుడు.[1][2] జేమ్స్ బాండ్ సినిమాల్లోని బ్లోఫెల్డ్ పాత్ర ఈ షకాల్ పాత్రకు ప్రేరణ.[3] ఢిల్లీలోని నాటక సమాజంతో మొదలైన కుల్ భూషణ్ నటనా ప్రయాణం సినిమాల దగ్గరకు చేరింది. 1974లో జాదూ కా షంఖ్ సినిమాతో తెరంగేట్రం చేశారు. బాలీవుడ్ లో మెయిన్ స్ట్రీం సినిమాలు చేయకముందు కొన్ని పేర్లల్ సినిమాల్లో నటించారాయన. మహేష్ భట్ తీసిన క్లాసిక్ అర్ధ్(1982), ఏక్ చడర్ మైలి సి(1986), దీపా మెహతా తీసిన ట్రయాలజీ ఫైర్(1996), ఎర్త్(1998), వాటర్(2005) వంటి సినిమాల్లో కూడా నటించారు కుల్ భూషణ్.[4]
దాదాపు రెండు దశాబ్దాల తరువాత కలకత్త ప్రొడక్షన్స్ లో పడతిక్ థియేటర్ లో, వినయ్ శర్మ దర్శకత్వం వహించిన ఆత్మకథ నాటకంలో నటించారు ఆయన.[5]
తొలినాళ్ళ జీవితం, చదువు
మార్చు21 అక్టోబరు 1944న పాకిస్థానీ పంజాబ్ లో అటోక్ జిల్లాలోని హస్సనబ్దాల్ ప్రాంతంలో జన్మించారు ఖర్బందా. ఈ ప్రదేశాన్ని చారిత్రికంగా గురుద్వారా పంజా సాహిబ్ అని పిలుస్తారు. భారత విభజన తరువాత వీరి కుటుంబం భారతదేశం పంజాబ్ కు వలస వచ్చేశారు. జోధ్ పూర్, డెహ్రాడూన్ ఆలీగఢ్, ఢిల్లీల్లో చదువుకున్నారు ఖర్బందా. డిల్లి విశ్వవిద్యాలయానికి చెందిన కిరోరీ మల్ కళాశాల నుండి డిగ్రీ పట్టా అందుకున్నారాయన.
కెరీర్
మార్చుచదువు పూర్తి అయిన తరువాత స్నేహితులతో కలసి అభియాన్ అనే నాటక సమాజం మొదలుపెట్టారు కుల్ భూషణ్. ఆ తరువాత ఢిల్లీకి చెందిన యాత్రిక్ నాటక సమాజంలో కూడా పనిచేశారు. ఈ సమాజానికి మొట్టమొదటి డబ్బులు తీసుకునే కళాకారాడు ఆయన. ఈ సమాజాన్ని స్థాపించిన దర్శకుడు జాయ్ మిచెల్ అమెరికా విశ్వవిద్యాలయాలకు లెక్చరర్ గా వెళ్ళిపోయాకా, ఆ నాటక సమాజం మూతపడింది.[6][7][8] ఆ తరువాతే కలకత్తాకి వెళ్ళి పడతిక్ నాటక సమాజంలో దర్శకుడు శ్యామానంద్ జలనిన్ నాయకత్వంలో పనిచేశారు. ఇక్కడ కొన్నాళ్ళు పనిచేశాకా ముంబై వెళ్ళి సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు ఆయన.[9][10]
శ్యాం బెనగళ్ దర్శకత్వంలో నిషాంత్(1974) సినిమాతో తెరంగేట్రం చేశారు కుల్ భూషణ్. ఆ తరువాత మన్థాన్(1976), భూమిక:ది రోల్(1977), జునూన్(1978), కల్యుగ్(1980) వంటి కమర్షియల్ సినిమాల్లోనే కాక, బి.వి.క్రాంత్ దర్శకత్వం వహించిన గోధూళి(1977) వంటి పేర్లల్ సినిమాల్లో కూడా నటించారు కుల్ భూషణ్.
షాన్(1980) సినిమాలోని విలన్ పాత్ర షకాల్ ద్వారా బాలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లోకి పూర్తిగా అడుగుపెట్టారు కుల్ భూషణ్. ఘయాల్(1990), జో జీతా వోహీ సికందర్(1992), గుప్త్(1997), బోర్డర్(1997), ఎస్ బాస్(1997), రెఫ్యూజీ(2000) వంటి సినిమాల్లో నటించారు ఆయన. అలాగే చక్ర (1981) అర్థ్(1982), అంధీ గలీ(1984), ఏక్ చడర్ మైలీ సీ(1986), ఉత్సవ్(1984), గిరీష్ కర్నాడ్ తీసిన మండి(1983), త్రికళ్(1985), సుస్మన్(1987), శ్యాం బెనగళ్ తీసిన నసీమ్(1995), మాన్సూన్ వెడ్డింగ్(2001) వంటి ఆర్టు సినిమాల్లో కూడా నటించారు కుల్ భూషణ్.
శశి కపూర్ నిర్మించిన కల్యుగ్ సినిమాలో రీమా లగూ భర్త, రాజ్ బబ్బర్ సోదరుని పాత్ర పోషించారు కుల్ భూషణ్. పిరియాడిక్ సినిమాలైన జోధా అక్బర్, లగాన్ సినిమాల్లో కూడా నటించారాయన. ఆయన తాజా సినిమాలు ఆలూ చాట్, టీమ్:ది ఫోర్స్. పంజాబీ సినిమాల్లో ఎక్కువగా నటించారు కుల్ భూషణ్. చాన్ పరదేశి(1980), మొహల్ ఠీక్ హై(1999) సినిమాల్లో నటించారు ఆయన.
దీపా మెహతా దర్శకత్వంలో ఎర్త్, ఫైర్, వాటర్ సినిమాలతో పాటు దాదాపు 6 సినిమాల్లో నటించారు కుల్ భూషణ్. 2009లో ఒక జర్మనీ సినిమాలో కూడా నటించారు ఆయన. షాన్నో కీ షాదీ, మాహీ వే వంటి టీవీ సీరియళ్ళలో కూడా ఆయన నటించారు.[1] తీన్ ఫరిష్టే, హత్య ఏక్ ఆకార్ కి, బాకీ ఇతిహాస్, ఏక్ షున్యా బాజీరావ్, గునియా పిగ్, గిర్దడే, సఖారాం బిందెర్, ఆత్మకథ వంటి ఎన్నో ప్రముఖ నాటకాల్లో నటించారు కుల్ భూషణ్.
సినిమాలు
మార్చు- అజహర్(హింది)
- డిక్టేటర్(తెలుగు)
- బ్రదర్స్(హింది) (2015)
- టబి(2015 )(హింది)
- హైదర్(హింది) (2014)
- కిర్పాన్-ది స్వార్డ్ ఆఫ్ హానర్(పంజాబీ) (2014)
- సాదీ లవ్ స్టోరీ(పంజాబీ) (2013)
- ఢిల్లీ ఇన్ ఎ డే(2012)
- విండ్స్ ఆఫ్ చేంజ్(2012)
- ఖుషియా(2011)
- ఖట్టా మీఠా(2010)
- కుర్బాన్(2009)
- ఆలూ చాట్(2009)
- రు బా రు(2008)
- జోధా అక్బర్(2008)
- ఏక్: ది పవర్ ఆఫ్ వన్(2008)
- ఎమీ(2008)
- మనోరమ సిక్స్ ఫీట్ అండర్(2007)
- ఉమ్రావ్ జాన్(2006)
- లగే రహో మున్నా భాయ్(2006)
- వాటర్(2005)
- నేతాజీ సుభాష్ చంద్రబోస్: ది ఫర్గాటన్ హీరో(2005)
- ఫైట్ క్లబ్-మెంబర్స్ ఓన్లీ(2006)
- అగ్నిపంఖ్(2004)
- జమీర్:ది ఫైర్ వితిన్(2005)
- గర్వ్:ప్రైడ్ అండ్ హానర్(2004)
- ఐ ప్రౌడ్ టు బి ఏన్ ఇండియన్(2004)
- పింజర్(2003)
- బస్తి(2003)
- బాలీవుడ్/హాలీవుడ్(2002)
- లగాన్(2001)
- మాన్సూన్ వెడ్డింగ్(2001)
- పుకార్(2000)
- హీరా ఫెరీ(2000)
- రెఫ్యూజీ(2000)
- హోతే హోతే ప్యార్ హోగయా(1999)
- ఆక్రోష్(1998)
- చైనా గేట్(1998)
- మేజర్ సాబ్(1998)
- ఎర్త్(1998)
- ఎస్ బాస్(1997)
- బోర్డర్(1997)
- గుప్త్(1997)
- మాచిస్(1996)
- లోఫర్(1996)
- ఫైర్(1996)
- నిర్భయ్(1996)
- నసీమ్(1995)
- బాజీ(1995)
- మోహ్రా(1994)
- శక్తిమాన్(1993)
- మహాకాల్(1993)
- ఏక్ హై రాస్తా(1993)
- దామిని-లైటినింగ్(1993)
- జో జీతా వహీ సికందర్(1992)
- బెఖుడి(1992)
- అంతర్ నాద్(1991)
- హెన్నా(1991)
- ప్రతిబంధ్(1990)
- ఘయల్(1991)
- త్రికాల్(1985)
- యతీమ్(1988)
- వీరనా(1988)
- మై జిందా హూ(1988)
- సుస్మాన్(1987)
- ఉత్తర్ దక్షిణ్(1987)
- ఏక్ చడర్ మైలి సీ(1987)
- న్యూ ఢిల్లీ టైమ్స్ (1986)
- రామ్ తేరీ గంగా మైలీ(1985)
- గులామీ(1985)
- ఉత్సవ్(1984)
- అంధీ గలీ(1984)
- వారిస్(1988)
- గంగ మేరీ మా(1983)
- అర్థ్ (1982)
- శక్తి(1982)
- అపురూప(1982)
- ఉచా దర్ బేబ్ నానక్ డా-పంజాబీ (1982)
- సిల్ సిలా(1981)
- మండి(1983)
- ప్రేమ్ రోగ్(1983)
- చక్ర (1981)
- కల్యుగ్(1981)
- నఖుదా(1981)
- అర్ధ్(1981)
- చాన్ పరదేశి(1980)
- షాన్(1980)
- కల్యుగ్(1981)
- సోల్వా సావన్(1979)
- జునూన్(1978)
- భూమిక (1977)
- మన్తన్(1976)
- జాదూ కా షంఖ్(1974)
నామినేషన్లు
మార్చు- 1986:గులామీ సినిమాకు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటుడు పురస్కారం నామినేషన్.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 "Down movie lane". The Tribune. 1 July 2006.
- ↑ "B-Town's villains we love to hate". CNN-IBN. Archived from the original on 2014-02-02. Retrieved 2016-07-23.
- ↑ "A homage to G P Sippy". Bollywood Hungama, Screen. 5 January 2008.
- ↑ "Adieu to stereotypes". The Hindu. Chennai, India. 20 October 2000. Archived from the original on 2 మార్చి 2009. Retrieved 23 జూలై 2016.
- ↑ "Atmakatha".
- ↑ "Joy de vivre". The Hindu. 4 March 2010.
- ↑ "40 Years, and Still Travelling". Indian Express. 8 August 2003. Archived from the original on 11 నవంబరు 2013. Retrieved 23 జూలై 2016.
- ↑ "The stage is set..." The Hindu. 4 August 2005.[permanent dead link]
- ↑ "Calcutta, home to Hindi Theatre". The Hindu. 29 October 1997. Archived from the original on 25 జూలై 2011. Retrieved 23 జూలై 2016.
- ↑ "Usha Ganguly". mumbaitheatreguide.com. November 2006.