అర్థ్
మహేష్ భట్ దర్శకత్వంలో 1982లో విడుదలైన హిందీ సినిమా.
అర్థ్, 1982లో విడుదలైన హిందీ సినిమా. మహేష్ భట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షబానా అజ్మీ, కుల్ భూషణ్ ఖర్బందా, స్మితా పాటిల్, రాజ్ కిరణ్, రోహిణీ హట్టంగడి తదితరులు నటించారు.[1] గజల్ ద్వయం, జగ్జీత్ సింగ్ - చిత్ర సింగ్ సంగీతాన్ని సమకూర్చారు.
అర్థ్ | |
---|---|
దర్శకత్వం | మహేష్ భట్ |
రచన | మహేష్ భట్ |
స్క్రీన్ ప్లే | మహేష్ భట్ సుజిత్ సేన్ |
కథ | మహేష్ భట్ |
నిర్మాత | కుల్జిత్ పాల్ |
తారాగణం | షబానా అజ్మీ కుల్ భూషణ్ ఖర్బందా స్మితా పాటిల్ రాజ్ కిరణ్ రోహిణీ హట్టంగడి |
ఛాయాగ్రహణం | ప్రవీణ్ భట్ |
కూర్పు | కేశవ్ హిరణి |
సంగీతం | జగ్జీత్ సింగ్ చిత్ర సింగ్ |
విడుదల తేదీ | 1982 |
సినిమా నిడివి | 138 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | హిందీ |
బడ్జెట్ | ₹1 కోటి |
బాక్సాఫీసు | ₹2 కోట్లు |
పర్వీన్ బాబితో తన సంబంధం గురించి మహేష్ భట్ రాసిన సెమీ ఆటోబయోగ్రాఫికల్ సినిమా ఇది.[2] ఇండియా టైమ్స్ మూవీస్ సంకలనం చేసిన 25 తప్పక చూడాల్సిన బాలీవుడ్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి.[3] ఈ సినిమాను బాలు మహేంద్ర 1993లో మరుపాదియుమ్ పేరుతో తమిళంలో రీమేక్ చేశాడు. 2017లో పాకిస్తానీ నటుడు, దర్శకుడు షాన్ షాహిద్ అర్థ్ 2 సినిమాను విడుదల చేసాడు.
నటవర్గం
మార్చు- షబానా అజ్మీ (పూజా ఇందర్ మల్హోత్రా)
- కుల్ భూషణ్ ఖర్బందా (ఇందర్ మల్హోత్రా)
- స్మితా పాటిల్ (కవితా సన్యాల్)
- రాజ్ కిరణ్ (రాజ్)
- రోహిణీ హట్టంగడి (పూజ పనిమనిషి)
- దిన పాఠక్ (కవిత తల్లి)
- ఓం శివపురి (కవిత డాక్టర్)
- మజార్ ఖాన్ (హరీష్)
- గుల్షన్ గ్రోవర్ (గుల్షన్)
- దలీప్ తహిల్ (దిలీప్)
- గీత సిద్ధార్థ్ (అపర్ణ)
- సిద్ధార్థ్ కాక్ (అనిల్)
- షమ్మీ (శ్రీమతి భల్లా)
- చాంద్ ఉస్మాని (స్కూల్ అడ్మినిస్ట్రేటర్)
- కిరణ్ విరాళే (పూజ హాస్టల్ రూమ్-మేట్)
బాక్సాఫీస్
మార్చు₹ 1 కోటి రూపాయలతో రూపొందిన ఈ సినిమా ₹ 2 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద "హిట్"గా ప్రకటించబడింది.
అవార్డులు
మార్చుసంవత్సరం | అవార్డు | విభాగం | గ్రహీత (లు), నామినీ (లు) | ఫలితం |
---|---|---|---|---|
1982 | భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు | జాతీయ ఉత్తమ నటి | షబానా అజ్మీ | గెలుపు |
1983 | బి.ఎఫ్.జె.ఏ. అవార్డులు | ఉత్తమ కళా దర్శకుడు | మధుకర్ షిండే | గెలుపు |
1984 | ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు | ఉత్తమ నటి | షబానా అజ్మీ | గెలుపు |
ఉత్తమ సహాయ నటి | రోహిణి హట్టంగడి | గెలుపు | ||
స్మితా పాటిల్ | ప్రతిపాదన | |||
ఉత్తమ చిత్రం | కుల్జిత్ పాల్ | ప్రతిపాదన | ||
ఉత్తమ దర్శకుడు | మహేష్ భట్ | ప్రతిపాదన | ||
ఉత్తమ సంభాషణలు | గెలుపు | |||
ఉత్తమ కథ | గెలుపు |
మూలాలు
మార్చు- ↑ "Arth (1982)". Indiancine.ma. Retrieved 2021-08-04.
- ↑ "A tribute to Parveen Babi". 4 October 2011. Archived from the original on 4 October 2011.
- ↑ "25 Must See Bollywood Movies". Indiatimes Movies. 15 October 2007. Archived from the original on 15 October 2007.