కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

కూచకుళ్ల రాజేష్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

పదవీ కాలం
2023 డిసెంబర్ 03 - ప్రస్తుతం
ముందు మర్రి జనార్దన్ రెడ్డి
నియోజకవర్గం నాగర్‌కర్నూల్

వ్యక్తిగత వివరాలు

జననం 1973
తూడుకుర్తి గ్రామం , నాగర్‌కర్నూల్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సౌభాగ్యమ్మ
జీవిత భాగస్వామి సరితా
సంతానం రిషిత్ రెడ్డి & రుథిక్ రెడ్డి
నివాసం కోకాపేట్, హైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి 1973లో తెలంగాణ, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ మండలం, తూడుకుర్తి గ్రామంలో కూచుకుల్ల దామోదర్ రెడ్డి, సౌభాగ్యమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బాపూజీ డెంటల్ కాలేజ్ & హాస్పిటల్ నుండి ఎండిఎస్ (డెంటల్‌) పూర్తి చేశాడు.[2][3]

రాజకీయ జీవితం మార్చు

కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి తన తండ్రి కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి[4], 2023 ఆగష్టు 3న కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు 2023 అక్టోబర్ 15న కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కించుకొని 2023లో శాసనసభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డిపై 5,248 ఓట్ల తేడాతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[5][6]

మూలాలు మార్చు

  1. Namaste Telangana (4 December 2023). "స్వల్ప తేడాతో హస్తగతం." Archived from the original on 7 December 2023. Retrieved 7 December 2023.
  2. Namaste Telangana (4 December 2023). "అసెంబ్లీకి ఎన్నికైన 15 మంది డాక్టర్లు.. ఇంజనీర్లు కూడా..!". Archived from the original on 20 December 2023. Retrieved 20 December 2023.
  3. News18 తెలుగు (4 December 2023). "అసెంబ్లీలో అధ్యక్షా అననున్న డాక్టర్లు.. ఎమ్మెల్యేలుగా 16 మంది వైద్యులు..!". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  4. Andhrajyothy (4 December 2023). "తండ్రి కలను నెరవేర్చిన కొడుకు.. ఎవరా అభ్యర్థి? ఏమా కథ?". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  5. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  6. "Election Commission of India - Nagarkurnool Results". 2023. Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.