కూచుకుల్ల దామోదర్ రెడ్డి

కూచకుళ్ల దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2016, 2021లో జరిగిన తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో మహబూబ్​నగర్​ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.[1]

కూచకుళ్ల దామోదర్ రెడ్డి
కూచుకుల్ల దామోదర్ రెడ్డి


ఎమ్మెల్సీ
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
5 జనవరి 2016 - ప్రస్తుతం
నియోజకవర్గం మహబూబ్‌నగర్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 12 డిసెంబర్ 1947
తూడుకుర్తి గ్రామం , నాగర్‌కర్నూల్ మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
ఇతర రాజకీయ పార్టీలు భారత జాతీయ కాంగ్రెస్
తెలంగాణ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు రామచంద్ర రెడ్డి, కొండమ్మ
జీవిత భాగస్వామి సౌభాగ్యమ్మ
సంతానం కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి
నివాసం కోకాపేట్, హైదరాబాద్

జననం, విద్యాభాస్యం మార్చు

కూచుకుల్ల దామోదర్ రెడ్డి 1947 డిసెంబరు 12లో తెలంగాణ రాష్ట్రం, నాగర్‌కర్నూల్ జిల్లా, నాగర్‌కర్నూల్ మండలం, తూడుకుర్తి గ్రామంలో రామచంద్ర రెడ్డి, కొండమ్మ దంపతులకు జన్మించాడు. ఆయన హైదరాబాద్ నిజాం కాలేజీ, ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1969లో బిఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం మార్చు

కూచుకుల్ల దామోదర్ రెడ్డి 1980లో కాంగ్రెస్ పార్టీ చేరి రాజకీయ జీవితం ప్రారంభించాడు. ఆయన 1981 నుండి 1991వరకు తూడుకుర్తి గ్రామ సర్పంచ్ గా, 1991 నుండి 1996వరకు ఎంపీపీగా పనిచేశాడు.దామోదర్ రెడ్డి 2006లో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ జెడ్పిటిసిగా గెలిచి మహబూబ్​నగర్​ జిల్లా ఛైర్మన్‌గా పనిచేశాడు.

ఆయన 2018 జూన్ 9లో కాంగ్రెస్ పార్టీ నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[2][3] ఆయనను 7 సెప్టెంబరు 2019లో ప్రభుత్వ విప్‌‌గా ప్రభుత్వం నియమించింది. తెలంగాణ శాసనమండలికి 2021లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానానికి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండవసారి ఆయన పేరును టిఆర్ఎస్ అధిష్టానం 22 నవంబర్ 2021న ఖరారు చేసింది. ఆయన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నవంబర్ 23న నామినేషన్‌ పత్రాలు దాఖలు చేశాడు. [4] ఆయన మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై నవంబర్ 26న గెలుపు పత్రాన్ని అందుకున్నాడు.[5]కూచుకుల్ల దామోదర్ రెడ్డి 19 జనవరి 2022న రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[6]

కూచకుళ్ల దామోదర్‌రెడ్డి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 అక్టోబర్ 26న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాడు.[7][8][9]

శాసనసభకు పోటీ మార్చు

సంవత్సరం నియోజకవర్గం పేరు రిజర్వేషన్ ఓడిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు మెజారిటీ ఫలితం
1999 నాగర్‌కర్నూల్ జనరల్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 00 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 00 31466 ఓటమి
2004 నాగర్‌కర్నూల్ జనరల్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 0000 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 0000 1449 ఓటమి
2009 నాగర్‌కర్నూల్ జనరల్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 0000 నాగం జనార్ధన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 0000 6593 ఓటమి
2012 (ఉప ఎన్నిక) నాగర్‌కర్నూల్ జనరల్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 0000 నాగం జనార్ధన్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి 0000 27325 ఓటమి
2014 నాగర్‌కర్నూల్ జనరల్ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 0000 మర్రి జనార్దన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 0000 14435 ఓటమి
2015 శాసనమండలి ఎన్నికలు (మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానం) జనరల్ ఎస్. జగదీశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 0000 కూచుకుల్ల దామోదర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 0000 రెండవ ప్రాధ్యాన్యత ఓట్ల ఆధిక్యం గెలుపు
2021 శాసనమండలి ఎన్నికలు (మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల స్థానం) జనరల్ 0000 కూచుకుల్ల దామోదర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 0000 ఏకగ్రీవం గెలుపు

మూలాలు మార్చు

  1. Sakshi Post (30 December 2015). "TRS Wins 4 MLC Seats, Congress Grabs Nalgonda, Mahbubnagar". Sakshi Post (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  2. Deccan Chronicle (9 June 2018). "Senior Congress leader, MLC Damodar Reddy to join TRS today". Deccan Chronicle (in ఇంగ్లీష్). Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  3. Sakshi (9 June 2018). "టీఆర్‌ఎస్‌లో చేరిన దామోదర్‌ రెడ్డి". Sakshi. Archived from the original on 6 June 2021. Retrieved 6 June 2021.
  4. Sakshi (23 November 2021). "నిజామాబాద్‌ నుంచి పోటీకే కవిత మొగ్గు". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
  5. Andhrajyothy (26 November 2021). "పాలమూరు ఎమ్మెల్సీలకు గెలుపు పత్రాలు అందజేత". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
  6. Namasthe Telangana (19 January 2022). "ఎమ్మెల్సీలుగా కవిత, దామోదర్‌రెడ్డి ప్రమాణం". Archived from the original on 27 జనవరి 2022. Retrieved 27 January 2022.
  7. Mana Telangana (26 October 2023). "బిఆర్ఎస్ పార్టీకి షాక్.. కాంగ్రెస్‌లోకి నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  8. Andhrajyothy (26 October 2023). "మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కి బిగ్ షాక్.. ఆ కీలక నేత రాజీనామా". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  9. Sakshi (27 October 2023). "బీఆర్‌ఎస్‌కు కూచుకుళ్ల, కేఎస్‌ రత్నం రాజీనామా". Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.