కూరాడు (తెలంగాణ కథ 2016)


కూరాడు అనేది సింగిడి (తెలంగాణ రచయితల సంఘం) ప్రచురించిన పుస్తకం. తెలంగాణ కథా సిరీస్ లో భాగంగా ప్రచురించబడిన నాలుగవ పుస్తకం ఇది. 2016లో వెలువడిన కథలలో నుంచి తెలంగాణ రచయితలు రాసిన 13 మంచి కథలతో ఈ సంకలనంగా వెలువడింది.[1]

కూరాడు (తెలంగాణ కథ 2016)
కూరాడు (తెలంగాణ కథ 2016) పుస్తక ముఖచిత్రం
కృతికర్త: కథా సంకలనం
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్
డా. వెల్దండి శ్రీధర్
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: సింగిడి (తెలంగాణ రచయితల సంఘం)
విడుదల: 2016, నవంబరు 11
పేజీలు: 128

సంపాదకులు

మార్చు

కథల నేపథ్యం

మార్చు

ఒక దర్జీకి, పల్లె పడుచుకు మధ్య జరిగిన సంభాషణల నేపథ్యంలో 'గుండెలో వాన' (పెద్దింటి అశోక్‌కుమార్‌) కథ, లెట్రిన్‌ ట్యాంకులను ఖాళీ చేసే యంత్రాల రాకతో వచ్చిన లాభనష్టాల నేపథ్యంలో సఫాయి (కె.వి.నరేందర్‌) కథ, దళిత స్పృహ నేపథ్యంలో ఊరు మెచ్చిన మనిషి (గుడిపల్లి నిరంజన్‌) కథ, గ్రామాల్లో రియల్‌ ఎస్టేట్‌ దందాకు అద్దం పడుతున్న నేపథ్యంలో పుంజీతం (వెల్దండి శ్రీధర్‌) కథ, దళిత జీవన వ్యధ నేపథ్యంలో అపచారమపచారం (మన్నె ఏలియా) కథ, సింగరేణి జీవితాల నేపథ్యంలో 'అతడు' (రామా చంద్రమౌళి) కథ, దొర కొడుకు చేతిలో దెబ్బ తిన్న దళిత ఆడబిడ్డ నేపథ్యంలో 'పులి అడుగు దెబ్బ' (పసునూరి రవీందర్‌) కథ, విప్లవోద్యమ కుటుంబ నేపథ్యంలో వాళ్ళు (తాయమ్మ కరుణ) కథ, కాశ్మీరీ ముస్లింల బతుకు నేపథ్యంలో 'రంగు రెక్కల వర్ణ పిశాచం' (చందు తులసి) కథ రాయబడ్డాయి.[2]

ఆవిష్కరణ

మార్చు

2017, నవంబరు 11న హైదరాబాదు, ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని నేషనల్ బుక్ ట్రస్ట్ హాల్ (దుర్గాబాయి దేశ్‌ముఖ్ మహిళా సభ) లో ఈ పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో సంగిశెట్టి శ్రీనివాస్, ఎన్ గోపి, ముదిగంటి సుజాతారెడ్డి, నిజాం వెంకటేశం, ఎకె ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.[3]

విషయసూచిక

మార్చు
క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు
1 గుండెలో వాన పెద్దింటి అశోక్ కుమార్
2 ఇప్పుడే వస్తాను హనీఫ్
3 సఫాయి కె.వి. నరేందర్
4 ఒక తలుపు వెనుక అఫ్సర్
5 ఊరు మెచ్చిన మనిషి గుడిపల్లి నిరంజన్
6 పుంజీతం వెల్డండి శ్రీధర్
7 కొనూపిరి చెన్నూరి సుదర్శన్
8 అపచారమపచారం మన్నె ఏలియా
9 తూ హోగా జరా పాగల్ కిరణ్ చర్ల
10 అతడు రామా చంద్రమౌళి
11 పులి అడుగు దెబ్బ పసునూరి రవీందర్
12 వాళ్ళు తాయమ్మ కరుణ
13 రంగు రెక్కల వర్ణ పిశాచం చందు తులసి

మూలాలు

మార్చు
  1. "కూరాడు (తెలంగాణ కథ)". lit.andhrajyothy.com. Archived from the original on 2021-12-04. Retrieved 2021-12-19.
  2. "కలి రుచి చూపిన కూరాడు కథలు | దర్వాజ". NavaTelangana. 2017-12-24. Archived from the original on 2021-12-19. Retrieved 2021-12-19.
  3. "హైదరాబాద్‌లో నవంబర్ 11న 'కూరాడు' తెలంగాణ కథ - 2016". lit.andhrajyothy.com. Archived from the original on 2017-11-12. Retrieved 2021-12-19.