పెద్దింటి అశోక్ కుమార్
పెద్దింటి అశోక్ కుమార్ ( జననం: ఫిబ్రవరి 6, 1968 ) తెలంగాణా ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ తెలుగు నవల,నాటక, సినిమా , కథా రచయిత.
జీవిత విశేషాలుసవరించు
పెద్దింటి అశోక్ కుమార్ 1968 , ఫిబ్రవరి 6 న రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం, భీముని మల్లారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. మల్లవ్వ, అంజయ్య ఇతని తల్లిదండ్రులు. ఇతడు ఇంటర్మీడియట్ గంభీరావుపేటలోను, బి.యస్సీ సిద్ధిపేటలోను ఎం.ఏ తెలుగు కాకతీయ విశ్వవిద్యాలయంలోను ఎం.ఎస్సీ గణితం నాగార్జున విశ్వవిద్యాల్యం లో చదివాడు. ఇల్లంతకుంట మండలం, రామాజీపేట గ్రామంలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. కథ, నవలా రచయితగానే కాకుండా సినిమాలకు కథలు, మాటలు, పాటలు రాస్తూ సినిమా రచయితగా రాణిస్తున్నారు.
రచనలుసవరించు
ఇతడు 1999లో రచనా వ్యాసంగం మొదలు పెట్టాడు. మొట్టమొదటి కథ "ఆశ- నిరాశ -ఆశ ". ఇంతవరకు 200కు పైగా కథలు, 6 నవలలు, ఏడు కథా సంపుటాలు ప్రకటించాడు. ఇతని నవల జిగిరి హింది,ఇంగ్లీష్,మరాటీ,ఒరియా,పంజాబీ,కన్నడ,మైథిలి,బెంగాలి,మొదలగు ఎనిమిది భారతీయ భాషలలోనికి అనువదించబడింది. దాగుడుమూత దండాకోర్ సినిమాకు మాటలు, మల్లేశం సినిమాకు పాటలు, మాటలు వ్రాశాడు.దొరసాని, వేదం మరికొన్ని సినిమాలకి రచనా సహకారం చేసారు.ఎనిమిది చిన్నసినిమాలకు కథలు మాటలు అందించారు.6 నాటికలు వంద వరకు వ్యాసాలు రాసారు.ఇతని తెగారం నాటకం నటనా విభాగంలో నంది బహుమతి తో పాటు పాతిక అవార్డులను గెలుచుకుంది.
- జిగిరి
- ఎడారి మంటలు
- దాడి
- ఊరికి ఉప్పులం
- సంచారి
- లాంగ్ మార్చ్
- ఇంకెంత దూరం
కథాసంపుటాలుసవరించు
- ఊటబాయి
- భూమడు
- మాఊరి బాగోతం
- మాయి ముంత
- వలస బతుకులు
- పోరుగడ్డ (కథలు, వ్యాసాలు)
- జుమ్మేకి రాత్ మే
- గుండెలో వాన
కథలుసవరించు
- అతడు ఆకలిని జయిస్తున్నాడు
- అనగనగా ఒక పేద బడి కథ
- ఆ ఇల్లు మూత వడ్డది
- ఆకుపచ్చ నవ్వు
- ఆశ నిరాశ ఆశ
- ఇగ వీడు తొవ్వకు రాడు
- ఇసం మింగిన మనిషి
- ఊటబాయి
- ఎండమావి
- ఎజెండా
- ఎడారి
- ఎదురు చేప
- ఏడిండ్ల పిల్లికూన
- కంగ్రాట్స్
- కథ మల్లా మొదటకొచ్చింది
- కన్నతల్లి
- కన్నీళ్ళు
- కాగుబొత్త
- కీలుబొమ్మలు
- కొత్త జీతగాడు
- గద్దలు
- గురిజ గింజలు
- గూడు చెదిరిన పక్షి
- గ్లాసియర్
- చెత్తలచెడుగు
- జిద్దు
- తడిగొంతు
- తెగిన బంధాలు
- నువ్వూ నేనూ ఆ వెన్నెలరాత్రి
- నెనరు
- పడగ నీడ
- పిల్లజలగ
- పీడ
- పెద్దోడు
- బందీలు
- భూముడు
- మాయిముంత
- ములాఖత్
- మూడు నా (ము)ళ్ళ బంధం
- యుద్ధనాదం
- రక్తం మరకలున్న వందనోట్లు
- రణనినాదం
- రెండు దుకాణాలు
- రెండుకోతులు
- రేపు మాపు అను ఒక విడాకుల కథ
- రైతక్క
- వర్గమూలాలు
- వలయం
- వెలి
- సావుడప్పు
- సివంగి
సినిమారంగంసవరించు
- 2010: వేదం (రచనా సహకారం )
- 2015: దాగుడుమూత దండాకోర్ (మాటలు )
- 2018: మల్లేశం (మాటలు - పాట)
- 2019: దొరసాని (రచనా సహకారం )
- 2021:తమసోమా జ్యోతిర్గమయా (పాటలు)
పురస్కారాలుసవరించు
- తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2
- మాయి ముంత కథలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2011
- భారతీయ భాషా యువ పురస్కారం కలకత్తా 2008
- 2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 (జిగిరి పుస్తకానికి)[1]
- ఉత్తమ నాటక రచయిత - తెగారం నాటకం (పంతం పద్మనాభ కళా పరిషత్, కాకినాడ) అక్టోబరు 28, 2018.
మూలాలుసవరించు
- ↑ నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.