రామా చంద్రమౌళి

రామా చంద్రమౌళి (rama chandramouli) సమకాలీన తెలుగు రచయితలలో ఒకరు. 2020లో తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చేతులమీదుగా కాళోజీ సాహిత్య పురస్కారాన్ని అందుకున్నాడు.[1][2]

రామా చంద్రమౌళి
రామా చంద్రమౌళి.jpeg
రామా చంద్రమౌళి గారి తాజా చిత్రం
జననంరామా చంద్రమౌళి
జూలై 8, 1950
ఆంధ్ర ప్రదేశ్
వృత్తివైస్‌ ప్రిన్సిపాల్‌, వరంగల్‌
ప్రసిద్ధితెలుగు కథా రచయిత
మతంహిందువు
తండ్రిరామా కనకయ్య
తల్లిరాజ్యలక్ష్

జననంసవరించు

రామా కనకయ్య, రాజ్యలక్ష్మి దంపతులకు జూలై 8, 1950లో జన్మించిన రామా చంద్రమౌళి ఎం.ఎస్‌ (మెకానికల్‌) ఎఫ్‌.ఐ.ఇ, పిజిడిసిఎ చదివారు. వీరు ప్రస్తుతం ప్రొఫెసర్‌గా, వైస్‌ ప్రిన్సిపాల్‌గా వరంగల్‌ గణపతి ఇంజినీరింగ్‌ కాలేజీలో పనిచేస్తున్నారు.[3]

జీవిత విశేషాలుసవరించు

పురస్కారాలుసవరించు

రాష్ట్రపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్‌ టీచర్‌ స్వర్ణపతక పురస్కారాలు పొందారు. సరోజినీనాయిడు జాతీయ పురస్కారం (కులాల కురుక్షేత్రం సినిమాకు), ఉమ్మెత్తల సాహితీ పురస్కారం (1986) నూతలపాటి గంగాధరం సాహిత్య పురస్కారం (1986) ఏపి పాలిటెక్నిక్‌ అధ్యాపక అవార్డు (2000, భాగ్య అవార్డు (2005), ఆంధ్రసారస్వత సమితి పురస్కారం (2006), అలాగే అనేక పోటీలతో వీరు అవార్డులు పొందడం జరిగింది. ‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’గా వెలువడ్డ మాతృక ‘కిటికీ తెరిచిన తర్వాత’ కవిత్వ సంపుటి ‘2007- తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం’ పొందింది. స్వాతి శ్రీపాద అనువదించిన ‘ఇన్‌ఫెర్నో’ మూలగ్రంథం ‘అంతర్ధహనం’ కవిత్వం ‘2008-సినారె కవిత్వ పురస్కారం’ సాధించింది. జి.ఎం.ఆర్‌. రావి కృష్ణమూర్తి కథా పురస్కారం (2008), తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం (2019).

ముఖ్యమైన ఘట్టాలుసవరించు

 • వీరి సాహిత్యంపై కాకతీయ విశ్వవిద్యాలయంలో ఆచార్య కె.యాదగిరి నేతృత్వంలో రామాచంద్రమౌళి - సమగ్ర సాహిత్యం పరిశోధన అంశంపై జ్వలితచే పి.హెచ్‌.డి చేస్తున్నారు.
 • అలాగే కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్‌లో ఆచార్య కాత్యాయినీ విద్మహే నేతృత్వంలో రామాచంద్రమౌళి - కథలూ అంశంపై ఎంఫిల్‌ పరిశోధన జరుగుతున్నది.
 • వీరి నవలలపై ఆచార్య జ్యోతి నేతృత్వంలో రామాచంద్రమౌళి - నవలలు అంశంపై ఎంఫిల్‌ పరిశోధన జరుగుతున్నది.

ఆంగ్ల /ఇతర భాష లోకి అనువాదమైన కథలుసవరించు

'ఎడారిలో చంద్రుడు' (నవల), 'చదరంగంలో మనుషులు' కన్నడంలోకి అనువదించబడ్డాయి. 8 కథలు కన్నడంలో టెలీ కథలుగా ప్రసారం చేయబడ్డాయి. దాదాపు 20 కథలు ఇంగ్లిష్‌, కన్నడ, తమిళ, పంజాబీ భాషల్లోకి అనువదించబడ్డాయి.

ఇంగ్లీషులోకి అనువాదమైన కవితా సంపుటాలుసవరించు

 • ‘ఎటు..?’ అన్న కవితా సంపుటిని ప్రొ కె. పురుషోత్తం, ప్రొ ఎస్‌. లక్ష్మణమూర్తి, డా వి.వి.బి. రామారావు, రామతీర్థ, డా కేశవరావు, డా కె. దామోదర్‌ రావు కలిసి ‘విథర్‌ అండ్‌ అందర్‌ పోయయ్స్‌’గా ఒక సంపుటి వెలువరించారు.
 • ‘కిటికీ తెరిచిన తర్వాత’ సంపుటిని డా కె. పురుషోత్తం, డాఎస్‌. లక్ష్మణమూర్తి, డా లంకా శివరామ ప్రసాద్‌, రామతీర్థ ఇత్యాదులు ‘యాజ్‌ ది విండో ఓపెన్స్‌’ పేరుతో వెలువరిస్తే, అది అమెరికాలో ‘ఆటా’ పక్షాన నిర్వహించిన ‘ప్రపంచ తెలుగు మహాసభ’ల్లో కాలిఫోర్నియా వేదికపై ఆవిష్కరించారు.
 • ‘అంతర్దహనం’ కవిత్వ సంపుటిని స్వాతి శ్రీపాద ‘ఇన్‌ఫెర్నో’ పేరుతో మొత్తం పుస్తకాన్ని అనువదించి వెలువరించారు. లంకా శివరామప్రసాద్‌ ‘ఫైర్‌ అండ్‌ స్నో’గా వెలువరిస్తున్నది నాల్గవ సంపుటి.
 • ‘ఒక దేహం-అనేక మరణాలు’ అక్టోబరు 2009న వెలువడ్డ ఏడవ కవిత్వ సంపుటి, దీంట్లో 54 కవితలున్నాయి. దీంట్లోని కవితలన్నీ ప్రముఖ తెలుగు పత్రికల్లో వెలువడినవే. వీటిలో ఇరవైకి పైగా కవితలు ఇంగ్లీష్‌తో సహా ఇతర భారతీయ భాషల్లోకి అనువదించి ప్రచురించారు. ఇప్పుడు వీటిలోనుండి ముప్పయ్యేడు కవితలను ఎంపిక చేసి ఇంగ్లీష్‌లో ఒక సంపుటిగా ‘ఫైర్‌ అండ్‌ స్నో’ పేర డా లంకా శివరామ ప్రసాద్‌ అనువదించారు.

నిర్వహించిన పదవులుసవరించు

 • 2004 నుండి 'సృజనలోకం' తరపున ప్రధాన సంపాదకత్వంలో కవితా వార్షిక 2004, 2005, 2006, 2007 సంచికలు వెలువడ్డాయి.
 • ఇండియా టుడేకు ప్యానల్‌ రివ్యూవర్‌గా ఉన్నారు. ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ, న్యూఢిల్లిdచే 2007 సం. కోసం వరంగల్‌లో నిర్వహించిన 'కవిత సంధి' కార్యక్రమానికి 1996 నుండి ఎంపిక చేయబడ్డ 3వ కవిగా 29.06.2007న పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 2007న అగ్రాలో 3వ ఇంటర్నేషనల్‌ రైటర్స్‌ పెస్టివల్‌కు అధ్యక్షత వహించారు.
 • ఎం.ఎస్‌ చేస్తున్నప్పుడు 'స్పెషల్‌ అప్లికేషన్‌ బ్యూరియన్స్‌ ఇన్‌ రాకెట్‌ సిస్టమ్‌' అంశంపై డిఆర్‌డిఎల్‌, హైద్రాబాద్‌లో డాక్టర్‌ అబ్దుల్‌ కలాంతో కలిసి పనిచేశారు.
 • ఆచార్య ఆత్రేయ వద్ద స్క్రిప్ట్‌, లిరిక్‌ రైటింగ్‌ నేర్చుకున్నారు. కాంచన సీత సినిమాకు జాతీయ దర్శకుడు 'అరవిందవ్‌' వద్ద పనిచేశారు. బొమ్మరిల్లు, డబ్బు డబ్బు డబ్బు, గూటిలో రామచిలుక, జేగంటలు, కులాల కురుక్షేత్రం వంటి సినిమాలకు పనిచేశారు.

రచనలుసవరించు

ఇప్పటి వరకు 192 కథలు, 18 నవలలు, ఎనిమిది కవిత్వ సంపుటాలు, ఎన్నో సాహిత్య విమర్శా వ్యాసాలు, శాస్త్రీయ విద్యా విషయక వ్యాసాలు, ఇంజినీరింగ్‌ పాఠ్యగ్రంథాలు రాశారు. వీరి ద్విభాషా సంకలనం (ఇంగ్లిష్‌, తెలుగు) అమెరికాలో 2006లో జరిగిన ఆటా సభల్లో ఆవిష్కరించబడింది.

నవలలు

ఈ క్రింద సూచనాప్రాయంగా కొన్ని నవలలు ఇవ్వబడ్డాయి.

 • శాపగ్రస్తులు
 • చారునీళ్లు
 • ప్రవాహం
 • శాంతివనం
 • తెలిసిచేసిన తప్పు
 • అమృతం తాగిన రాక్షసులు
 • వక్రరేఖలు చదరంగంలోని మనుషులు
 • పిచ్చిగీతలు
 • రాగధార
 • నిన్ను నువ్వు తెలుసుకో
 • పొగమంచు
 • మజిలీ
 • దారితప్పిన మనుషులు
 • ఎడారిలో చంద్రుడు
 • ఎక్కడనుండి ఎక్కడికి?
కథాసంపుటాలు
 • తెగిన చుక్కలు', [4]
 • జననబీభత్సం, మరణ సౌందర్యం
కవితా సంపుటాలు
 • దీపగ్ని (1971)
 • శిలలు వికసిస్తున్నాయి (1979)
 • స్మృతిధార (1984)
 • ఎటు? (2004)
 • కిటికీ తెరిచిన తర్వాత (2006)
 • అంతర్ధహనం
 • ఒకే దేహం... అనేక మరణాలు
 • మూడు స్వప్నాలు ఒక మెలకువ (సంయుక్తంగా)
ఇంజినీరింగ్‌ పాఠ్యపుస్తకాలు
 1. ఇంజినీరింగ్‌ డ్రాయింగ్‌
 2. డిజైన్‌ ఆఫ్‌ మెకానిక్‌ ఎలక్ట్రానిక్స్‌
 3. ఇంజినీరింగ్‌ మెకానిక్స్‌
 4. ఇంజినీరింగ్‌ మెటాలజీ
 5. సాలిడ్‌ మెకానిక్స్‌

మూలాలుసవరించు

 1. ఈనాడు, తెలంగాణ (10 September 2020). "రామా చంద్రమౌళికి కాళోజీ పురస్కారం ప్రదానం". www.eenadu.net. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.
 2. నమస్తే తెలంగాణ, తెలంగాణ (9 September 2020). "సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య అవార్డు". ntnews. Archived from the original on 10 September 2020. Retrieved 10 September 2020.
 3. ఆంధ్రప్రభ లో రామా చంద్రమౌళి పై వ్యాసం[permanent dead link]
 4. 25 ఏళ్లనాటి 25 కథలు

బయటి లంకెలుసవరించు