కృష్ణమ్మ
కృష్ణమ్మ 2024లో విడుదలైన తెలుగు సినిమా. కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకు వి.వి.గోపాలకృష్ణ దర్శకత్వం వహించాడు. సత్యదేవ్, అథిరా రాజ్, అర్చన, కృష్ణ బూరుగుల, లక్ష్మణ్ మీసాల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను నటుడు సాయి ధరమ్ తేజ్ 2022 ఆగష్టు 4న విడుదల చేయగా,[1] సినిమాను 2024 మే 10న థియేటర్లలో విడుదల చేసి మే 17 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[2]
కృష్ణమ్మ | |
---|---|
దర్శకత్వం | వి.వి.గోపాలకృష్ణ |
కథ | వి.వి.గోపాలకృష్ణ |
నిర్మాత | కృష్ణ కొమ్మలపాటి |
తారాగణం | సత్యదేవ్ అథిరా రాజ్ కృష్ణ బూరుగుల లక్ష్మణ్ మీసాల |
ఛాయాగ్రహణం | సన్నీ కూరపాటి |
కూర్పు | తమ్మిరాజు |
సంగీతం | కాల భైరవ |
నిర్మాణ సంస్థ | అరుణాచల క్రియేషన్స్ |
విడుదల తేదీs | 10 మే 2024(థియేటర్) 17 మే 2024 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుభద్ర (సత్యదేవ్), కోటి (లక్ష్మణ్ మీసాల), శివ (కృష్ణ బూరుగుల) ముగ్గురు అనాధలుగా పెరుగుతారు. శివ మీనా (అతీరారాజ్)ని ప్రేమిస్తుంటాడు. మీనాను భద్ర కూడా సొంత చెల్లెలిగా భావిస్తుంటాడు. మీనా తల్లి ఆపరేషన్‌కు చాలా డబ్బు అవసరమవుతుంది. ఆ డబ్బు కోసం భద్ర, శివ, కోటి చివరిసారిగా భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్ చేసి వచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేయించాలని డిసైడ్ అయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు దొరికిపోతారు? అనుకోకుండా ఈ ముగ్గురు స్నేహితులు రేప్ అండ్ మర్డర్ కేసులో చిక్కుకుంటారు? ఈ హత్య కేసులో భద్ర, శివ, కోటిలను ఇరికించింది ఎవరు? చేయని తప్పును ఒప్పుకోమని పోలీసులు వారిని ఎలా చిత్రహింసలకు గురిచేశారు? తమను తప్పుడు కేసులో ఇరికించిన వారిపై ఈ ముగ్గురు ఎలా ప్రతీకారం తీర్చుకున్నారు అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- సత్యదేవ్
- అథిరా రాజ్
- అర్చన అయ్యర్
- కృష్ణ బూరుగుల
- లక్ష్మణ్ మీసాల
- నందగోపాల్
- కృష్ణ తేజ
- రఘు కుంచే
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: అరుణాచల క్రియేషన్స్
- నిర్మాత: కృష్ణ కొమ్మలపాటి
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వి.వి.గోపాలకృష్ణ
- సంగీతం: కాల భైరవ
- సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
- ఎడిటర్ : తమ్మిరాజు
- ఆర్ట్ డైరెక్టర్ : రామ్ కుమార్
- మాటలు : సురేష్ బాబా
- పాటలు : అనంత్ శ్రీరామ్
- ఫైట్స్ : పృథ్వి శేఖర్
మూలాలు
మార్చు- ↑ 10TV Telugu (4 August 2022). "కృష్ణమ్మ టీజర్.. వైలెంట్‌గా మారిన సత్యదేవ్!" (in Telugu). Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ EENADU (17 May 2024). "సైలెంట్‌గా ఓటీటీలోకి 'కృష్ణమ్మ'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.
- ↑ Sakshi (17 May 2024). "కృష్ణమ్మ' మూవీ రివ్యూ". Archived from the original on 17 May 2024. Retrieved 17 May 2024.