లక్ష్మణ్ మీసాల
లక్ష్మణ్ మీసాల యువ రంగస్థల, సినిమా నటుడు.[1] అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన లక్ష్మణ్ 'కో అంటే కోటి' సినిమా ద్వారా తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించి, హితుడు,మనమంతా, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్ 100 చిత్రాలలో నటించి గుర్తింపుపొందాడు.
లక్ష్మణ్ మీసాల | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | రంగస్థల, సినిమా నటుడు |
తల్లిదండ్రులు | మీసాల రామారావు, నారాయణమ్మ |
రంగస్థల ప్రస్థానంసవరించు
2007లో హైదరాబాద్కి వచ్చిన లక్ష్మణ్, డి.యస్. దీక్షితులు దగ్గర నటనలో శిక్షణ పొంది అదే సంవత్సరం ప్రదర్శించిన అమ్మా నాకు బ్రతకాలని ఉంది నాటకంలో త్రిపాత్రాభినయంతో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. నేషనల్ స్కూల్ అఫ్ డ్రామా వారి ఆధ్వర్యంలో 2009లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో నెల రోజులపాటు జరిగిన రంగస్థల శిక్షణా శిబిరంలో పాల్గొని నటనలో మెళకువలు నేర్చుకోవడంతోపాటు, ఆ శిక్షణా శిబిరంలో తయారుచేసిన స్వప్న వసంతం నాటకంలో నటించాడు.[2]
నటించినవిసవరించు
నాటకాలు:
- అమ్మా నాకు బ్రతకాలని ఉంది
- విష్ణుశర్మ ఇంగ్లీషు చదువులు
- కొమరం భీg
- శ్రమణకం
- ఆకాశదేవర
- అంబేద్కర్ రాజగృహ ప్రవేశం
- గో టు హెల్
- నీకూ నాకు మధ్య
- కాగితం పులి
- మహాత్మా జ్యోతిరావు పూలే
- సీత కల్యాణం
- శ్రీ మాధవ వర్మ
- యాదాద్రి మహాత్మ్యం
- పాండవోద్యోగం
- సత్యశోధన
నాటికలు:
- ఇల్లాలి ముచ్చట్లు (నాటిక) [3]
- షాడో లెస్ మాన్
- అమ్మకింక సెలవా
- ఈ పయనమెటు
- దావత్
- బాపు కలలుగన్న దేశం
సినీరంగ ప్రస్థానంసవరించు
నటించిన సినిమాలుసవరించు
- కో అంటే కోటి
- హితుడు
- నగరం నిద్రపోతున్న వేళ
- ప్రతినిధి
- పంచదార పచ్చిమిర్చి
- జీలకర్ర బెల్లం
- శమంతకమణి
- వంగవీటి[4]
- ఘాజీ
- మనమంతా
- కొత్త కొత్తగా ఉన్నది
- తప్పటడుగు
- ఆర్‌ఎక్స్ 100
- భైరవగీత
- జార్జ్ రెడ్డి (లక్ష్మణ్)
- పలాస 1978 (2020)[5][6]
- గువ్వ గోరింక (2020)
- జాంబి రెడ్డి (2021)
- సైకిల్ (2021)
- మిస్టర్ అండ్ మిస్ (2021)
- ఏకమ్ (2021)
- హీరో (2022)
- భీమ్లా నాయక్ (2022)
- సురాపానం (2022)
- కిరోసిన్ (2022)
- చోర్ బజార్ (2022)
- చెడ్డీ గ్యాంగ్ తమాషా (2023)
బహుమతులుసవరించు
- ఉత్తమ హాస్యనటుడు - కోమరంభీం (నాటకం) - నంది నాటక పరిషత్తు - 2013[7]
- ఉత్తమ హాస్యనటుడు - కోమరంభీం (నాటకం) - పరుచూరి రఘుబాబు నాటక పరిషత్తు - 2014 (పరుచూరిలో 2సార్లు ఉత్తమ హాస్యనటుడు)
- ఉత్తమ హాస్యనటుడు - ఇల్లాలి ముచ్చట్లు (నాటిక), 2016 (ప్రగతి కళామండలి, సత్తెనపల్లి) [8] (ఇల్లాలి ముచ్చట్లుకు 27సార్లు ఉత్తమ హాస్యనటుడు)
- ఉత్తమ నటుడు - దావత్ (నాటిక) - 2016 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ) [9]
- ఉత్తమ సహనటుడు - మాధవవర్మ (పద్యనాటకం) - రెండుసార్లు
మూలాలుసవరించు
- ↑ ఆంధ్రజ్యోతి. "కళా..పాప్‌కార్న్." Archived from the original on 30 November 2018. Retrieved 12 August 2017.
- ↑ నాటకం కలిపింది సినిమా నడిపిస్తోంది, వి6 వెలుగు లైఫ్, నరేష్ కుమార్ సూఫీ, 11 ఫిబ్రవరి 2020, పుట. 5.
- ↑ ఆంధ్రభూమి. "ఆదరణ కోల్పోతున్న నాటకరంగం". Retrieved 12 August 2017.
- ↑ The Times of India, entertainment (20 April 2020). "I will be seen alongside Mohan Bhagat in the film Kankam: Laxman Meesala". Paturi Rajasekhar. Archived from the original on 22 April 2020. Retrieved 22 April 2020.
- ↑ ఈనాడు, సినిమా (6 March 2020). "రివ్యూ: పలాస 1978". Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
- ↑ టివి9, రివ్యూ (6 March 2020). "పలాస 1978 మూవీ రివ్యూ". డా. చల్లా భాగ్యలక్ష్మి. Archived from the original on 6 March 2020. Retrieved 6 March 2020.
- ↑ Reddy, V Sateesh (22 April 2020). "'Love to take up experimental roles'" (PDF). The Pioneer. Vijayawada. Retrieved 18 July 2020.
- ↑ ఈనాడు, సత్తెనపల్లి, May 3, 2016
- ↑ సుమధుర ఫలితాలు, నటకులమ్ మాసపత్రిక, ఆగష్టు 2016, పుట.4