కృష్ణ జింక
కృష్ణ జింక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు. ఏంటిలోప్ సెర్వికాప్రా అనే శాస్త్రీయ నామం గల ఈ జంతువు ప్రధానంగా భారతదేశంలో నివసించినప్పటికీ, పాకిస్థాన్, నేపాల్ లోని కొన్ని ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది. దీనిని ఆంగ్లలో బ్లాక్ బక్ అని అంటారు.
కృష్ణ జింక | |
---|---|
![]() | |
Scientific classification | |
Kingdom: | |
Phylum: | |
Class: | |
Order: | |
Family: | |
Subfamily: | |
Genus: | ఏంటిలోప్ Pallas, 1766
|
Species: | ఏ. సెర్వికాప్రా
|
Binomial name | |
ఏంటిలోప్ సెర్వికాప్రా | |
ఉపజాతులు | |
Antilope cervicapra centralis |

జీవిత విశేషాలుసవరించు
కృష్ణ జింకలు విశాలమైన పచ్చిక మైదానాలలో జీవిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా రకరకాల గడ్డిని, అప్పుడప్పుడు పండ్లను తింటాయి. అతి వేగంగా పరిగెత్తగలిగే జంతువులలో ఇది ఒకటి. సాధారణంగా ఇవి 15-20 జింకలు కలిసి ఒక మందగా తిరుగుతుంటాయి. ప్రతి మందలోను ఒక బలిష్టమైన మగ జింక ఉంటుంది.
మగ కృష్ణ జింక సుమారు 32 అంగుళాల పొడవు పెరుగుతుంది. సుమారు 40 కి.గ్రా. దాకా బరువుంటుంది. వీని కొమ్ములు 3-4 మలుపులతో మెలికలు తిరిగి సుమారు 28 అంగుళాల పొడవు దాకా పెరుగుతాయి. మగ జింకలో శరీరపు పైభాగం నలుపు లేదా ముదురు గోధుమగంగులో ఉంటే, కడుపు, ఇంకా కళ్ళు చుట్టూ ఉండే ప్రాంతం మాత్రం తెలుపురంగులో ఉంటుంది.
ఆడ కృష్ణ జింకలు వీటికి భిన్నంగా లేత గోధుమ రంగులో ఉంటాయి. వీటికి కొమ్ములుండవు.
రక్షిత జంతువుసవరించు
ఒకొప్పుడు సువిశాలమైన మైదానాల్లో స్వేచ్ఛగా తిరిగిన కృష్ణ జింకలు నేడు క్రమంగా అంతరించి పోతున్నాయి. అయితే కొందరు వీటిని మాంసం కోసం, చర్మం కోసం, వినోదం కోసం చంపుతున్నారు. అనేక ఇతర వన్యప్రాణుల వలె కృష్ణ జింకలు కూడా రక్షిత జంతువులు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్యప్రాణుల సంరక్షక చట్టం - 1972' ప్రకారం వీటిని వేటాడటం చట్టరీత్యా నేరమవుతుంది.
పురాణాలలో కృష్ణ జింకసవరించు
హిందూ ధర్మానుసారం, "కృష్ణ జింక" చంద్రుని వాహనం. కృష్ణ జింక నివసించే స్థానములు పుణ్యమైన ప్రాంతములు.
మూలాలుసవరించు
- ↑ Mallon, D.P. (Antelope Specialist Group) (2003). Antilope cervicapra. 2006. IUCN Red List of Threatened Species. IUCN 2006. www.iucnredlist.org. Retrieved on 2008-08-13.