కృష్ణ రావు సూపర్ మార్కెట్
కృష్ణ రావు సూపర్‌మార్కెట్ 2019లో విడుదలైన తెలుగు సినిమా. బిజేఆర్ సమర్పణలో బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీనాథ్ పులకరం దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్ల భరణి, బెనర్జీ, రవి ప్రకాష్, సూర్య, సన ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశాడు.[1] కృష్ణ రావు సూపర్‌మార్కెట్ సినిమా అక్టోబర్ 18, 2019న విడుదలైంది.[2]
కృష్ణ రావు సూపర్‌మార్కెట్ | |
---|---|
దర్శకత్వం | శ్రీనాథ్ పులకరం |
నిర్మాత | బీజేఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ |
తారాగణం | కృష్ణ, ఎల్సా ఘోష్, గౌతమ్ రాజు,తణికెళ్ల భరణి, బెనర్జీ |
ఛాయాగ్రహణం | ఏ.విజయ్ కుమార్ |
సంగీతం | బోలె షావలి |
నిర్మాణ సంస్థ | బీజేఆర్ ఫిల్మ్ అండ్ టీవీ స్టూడియోస్ |
విడుదల తేదీ | 18 అక్టోబర్ 2019 |
సినిమా నిడివి | 149 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కథ
మార్చుఅర్జున్ (కృష్ణ) ఒక ఒక కిక్-బాక్సింగ్ ట్రైనీ. ఆడుతూ పాడుతూ తిరిగే అర్జున్ తొలిచూపులోనే సంజన (ఎల్సా ఘోష్)తో ఇద్దరు ప్రేమించుకుంటారు. అలా సాగిపోతున్న వారి ప్రేమ ప్రయాణంలో సంజనను ఓ సైకో కిల్లర్ హత్య చేస్తాడు. అసలు సంజనను చంపిన ఆ సీరియల్ సైకో కిల్లర్ ఎవరు ? అతను సంజనను ఎందుకు చంపాడు ? సైకో కిల్లర్ ను అర్జున్ ఎలా కనిపెట్టాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
మార్చు- కృష్ణ [4]
- ఎల్సా ఘోష్
- గౌతం రాజు [5]
- తణికెళ్ల భరణి
- బెనర్జీ
- రవి ప్రకాష్
- సూర్య
- సన
- దొరబాబు
- సంజు
- సహస్ర
సాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్
- నిర్మాత: బిజిఆర్ ఫిలిం అండ్ టీవీ స్టూడియోస్
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: శ్రీనాథ్ పులకరం
- సంగీతం: బోలె షావలి
- సినిమాటోగ్రఫీ: ఏ.విజయ్ కుమార్
మూలాలు
మార్చు- ↑ Sakshi (23 June 2019). "ఇలాంటి సినిమాలనే యూత్ ఆదరిస్తున్నారు". Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
- ↑ "Krishna Rao Supermarket Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". 2019. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
- ↑ "Krishna Rao Supermarket Review: A romantic thriller". 19 October 2019. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
- ↑ "చిరంజీవిగారి నుంచి అవార్డు అందుకోవాలి". 24 September 2020. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.
- ↑ "Comedian Gautham Raju's son coming as a hero with Krishna Rao Supermarket - Times of India". The Times of India (in ఇంగ్లీష్). 12 March 2019. Archived from the original on 25 September 2021. Retrieved 25 September 2021.